ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా నిలిచింది. కియా మోటార్స్ 2019 సెప్టెంబర్ నెలలో సెల్టోస్‌తో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో సెల్టోస్‌ కూడా చేరింది.

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

ఇండియన్ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా సెల్టోస్‌ నిలిచింది. సెల్టోస్‌ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి, చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఈ ఎస్‌యూవీ ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించింది.

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

2021 సంవత్సరం మొదటి మూడు నెలల్లో కియా మోటార్స్ దాదాపు 25,354 యూనిట్ల సొనెట్‌ ఎస్‌యూవీలను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది. ఒక్క మార్చి నెలలో మాత్రమే, కంపెనీ 8,498 యూనిట్ల సొనెట్‌ ఎస్‌యూవీలను విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

MOST READ:కరోనా కాటుకు బలైపోయిన మహిళను బైక్‌పై తరలించిన హృదయ విషాద గాథ.. ఎక్కడంటే?

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

అదే విధంగా ఫిబ్రవరిలో 7,997 యూనిట్లు, జనవరిలో 8,859 యూనిట్లు అమ్ముడయ్యాయి. సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉత్తమ-ఇన్-క్లాస్ ఫీచర్లు మరియు వినియోగదారులు ఇష్టపడే సరసమైన ధరతో సోనెట్ లభిస్తుందని కియా ఒక నివేదికలో నివేదించింది.

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

సొనెట్ ఎస్‌యూవీ యొక్క అమ్మకాల వల్ల కియా మోటార్స్ వార్షిక అమ్మకాలలో 50 శాతం పెరిగాయి. కియా మోటార్స్ త్వరలో కొత్త లోగోతో సొనెట్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇటీవల తెలిపింది. కియా సొనెట్‌ దేశీయ మార్కెట్లో రూ. 6.71 లక్షల నుంచి రూ. 12.89 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధర మధ్య అందుబాటులో ఉంటుంది.

MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

కియా సొనెట్ టెక్‌లైన్‌ మరియు జిటి లైన్ వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇందులో టెక్‌లైన్‌లో ఐదు వేరియంట్లు ఉన్నాయి. అవి హెచ్‌టిఇ, హెచ్‌టికె, హెచ్‌టికె ప్లస్, హెచ్‌టిఎస్, హెచ్‌టిఎస్ ప్లస్ వేరియంట్లు. అదే విధంగా జిటి లైన్‌లో ఒక వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది జిటిఎక్స్ ప్లస్ వేరియంట్.

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

కియా సొనెట్ మోనోటోన్ మరియు డ్యూయల్ టోన్ కలర్ అప్సన్లలో అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ జిటిఎక్స్ ప్లస్ మరియు HTX + వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

MOST READ:కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న కొత్త సొనెట్ & సెల్టోస్

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

కియా సొనెట్ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్‌ ఇంజిన్ తో సహా మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో, 1.0-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

కియా సొనెట్ చాలా స్టైలిష్ మరియు స్పోర్టి లుక్‌తో ఉండటమే కాకుండా చాలా వరకు మంచి ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంది. కియా సొనెట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్స్, సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్, 16 ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, హార్ట్ బీట్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, రిఫ్లెక్టర్ స్ట్రిప్, ఫాక్స్ డిఫ్యూజర్ ఉన్నాయి.

MOST READ:మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

ఇప్పటికి తగ్గని జోరు.. పరుగులు పెడుతున్న కియా సొనెట్ సేల్స్

కియా సెల్టోస్ తరువాత, సొనెట్ సంస్థ యొక్క రెండవ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ. కియా సొనెట్ ప్రారంభించిన ఒక నెలలోనే దాదాపు 50,000 యూనిట్లు బుక్ చేయబడ్డాయి. కియా సొనెట్ ఎస్‌యూవీలో కూడా 1.0-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కావున ఈ వేరియంట్ ఎక్కువ అమ్మకాలతో ముందుకు వెళ్తోంది.

Most Read Articles

English summary
Kia Sonet Sales Crosses 25,000 Units In Three Months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X