కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా కార్పోరేషన్ (Kia Corporation) తమ సరికొత్త ఐదవ తరం 2022 కియా స్పోర్టేజ్ (Kia Sportage) ఎస్‌యూవీని అమెరికన్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గడచిన జూన్ నెలలో కంపెనీ ఈ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

మునుపటి తరం కియా స్పోర్టేజ్ తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2022 కియా స్పోర్టేజ్ గణనీయమైన డిజైన్ మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లను అందుకుంది. అలాగే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా, కంపెనీ ఎస్‌యూవీ అనేక అధునాత పరికరాలను మరియు లేటెస్ట్ కనెక్టింగ్ ఫీచర్లను జోడించింది.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

అమెరికన్ మార్కెట్లో కొత్త 2022 Kia Sportage ఎస్‌యూవీని ఎక్స్-లైన్ మరియు ఎక్స్-ప్రో అనే రెండు ట్రిమ్ లలో విక్రయించనున్నారు. త్వరలోనే ఇందులో ఓ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా విడుదల చేయనున్నట్లు కియా కార్పోరేషన్ తెలిపింది. కొత్త కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీని బ్రాండ్ యొక్క లేటెస్ట్ 'ఆపోజిట్స్ యునైటెడ్' అనే డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించారు.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

ఈ కొత్త మోడల్ గతంలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగా కాకుండా, పూర్తి డిజైన్‌కు లోనైంది. అంతేకాకుండా, ఇది దాని మునుపటి మోడల్ కంటే 180 మిమీ ఎక్కువ పొడవు మరియు 70 మిమీ ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ కార్లలో మాదిరిగా, ఈ కొత్త 2020 కియా స్పోర్టేజ్ కూడా డ్యాష్‌బోర్డుపై ఒకే ప్యానెల్ లో అమర్చిన రెండు స్క్రీన్లతో లభిస్తుంది. వీటిలో ఒకదానిని ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొక దానిని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించబడుతుంది.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

నెక్స్ట్ జనరేషన్ కియా స్పోర్టేజ్ ముందు భాగంలో విభిన్నమైన ఫెండర్ ప్యాటర్న్, శాటిన్ క్రోమ్ ఫినిషింగ్, హై-గ్లోస్ బ్లాక్ యాక్సెంట్స్, బూమరాంగ్ ఆకారంలో ఉన్న కొత్త ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు హెడ్‌లైట్‌లు, కంపెనీ యొక్క సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, మజిక్యులర్ వీల్ ఆర్చెస్, షార్ప్ షోల్డర్ లైన్, మరియు రైజ్డ్ రూఫ్ రెయిల్‌ల కలయికతో ఈ వాహనం మరింత ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ రగ్గడ్ లుక్‌ను కలిగి ఉంటుంది.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

కొత్త 2022 స్పోర్టేజ్ యొక్క అన్ని వేరియంట్‌లు కూడా స్టాండర్డ్ ఆల్-వీల్ డ్రైవ్ ఫీచర్ తో లభిస్తాయి. ఇందులోని X-లైన్ వెర్షన్ ప్రామాణిక టైర్‌ లతో 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. కాగా, X-Pro వెర్షన్ ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ టైర్‌ లతో 17 ఇంచ్ వీల్స్‌ను పొందుతాయి.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

కియా స్పోర్టేజ్ ఎక్స్-ప్రోలో ఎల్ఈడి ఫాగ్ లైట్లు, హీటెడ్ విండోస్ మరియు వేరియబుల్ డ్రైవ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్-ప్రో ప్రెస్టీజ్ వేరియంట్ లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్-అడ్జస్టబుల్ ప్యాసింజర్ సీట్ మరియు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

ఈ కొత్త తరం 2020 స్పోర్టేజ్ ఎస్‌యూవీకి సంబంధించిన అన్ని వివరాలను కియా ఇంకా వెల్లడి చేయలేదు. అయితే, స్పోర్టేజ్ యొక్క బేస్ ఇంజన్ స్థానంలో టర్బోచార్జ్డ్ యూనిట్ కు బదులుగా 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ని అందించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

ఇది స్పోర్టేజ్ యొక్క ప్రస్తుత మోడళ్లలో ఉపయోగిస్తున్న 2.4 లీటర్ ఇంజన్ కంటే కొంచెం పెద్దది మరియు శక్తివంతమైనదిగా ఉంటుంది. ఈ కొత్త ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయగలదు. స్పోర్టేజ్ ఎస్‌యూవీలో ఓ హైబ్రిడ్ వెర్షన్ కూడా త్వరలో రాబోతుందని కియా ధృవీకరించింది.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

ఈ కొత్త ఇంజన్ గేర్‌బాక్స్ లో కంపెనీ మార్పులు చేసింది. కొత్త తరం కియా స్పోర్టేజ్ ఇప్పుడు మునుపటి 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను పొందుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీకి చాలా ప్రత్యేమైన డిమాండ్ ఉంది. మరి ఇంతటి ఖరీదైన పాపులర్ స్పోర్టేజ్ మోడల్ ని కియా భారత దేశానికి తీసుకు వస్తుందో లేదో వేచి చూడాలి.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

యానివర్స్‌రే ఎడిషన్ కియా సోనెట్ (Kia Sonet) విడుదల..

కియా బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, భారత మార్కెట్లో కియా సోనెట్ (Kia Sonet) కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ వార్షికోత్సవ ఎడిషన్ (Anniversary Edition) ను మార్కెట్లో విడుదల చేసింది. కియా సోనెట్ లో వచ్చిన మొదటి యానివెర్సరీ ఎడిషన్ ఇది.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

దేశీయ మార్కెట్లో కియా సోనెట్ యానివర్స్‌రే ఎడిషన్ (Kia Sonet Anniversary Edition) ధర రూ. 10.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది నాలుగు గేర్‌బాక్స్ (మాన్యువల్, ఆటోమేటిక్, IMT మరియు DCT) ఆప్షన్లతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

కొత్త తరం Sportage ఎస్‌యూవీని విడుదల చేసిన Kia; ఇది భారత్‌కు వచ్చేనా..?

మిడ్-స్పెక్ HTX వేరియంట్ ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ వార్షికోత్సవ ఎడిషన్ కియా సోనెట్ ను రూపొందించింది. స్టాండర్డ్ వేరియంట్ తో పోల్చుకుంటే, ఈ వార్షికోత్సవ ఎడిషన్ ధర రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ నుండి ఈ స్పెషల్ ఎడిషన్ ను వేరు చేయడానికి కంపెనీ ఇందులో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Kia unveils bigger and better sportage suv with fully loaded features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X