కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న కొత్త సొనెట్ & సెల్టోస్

దక్షిణ కొరియా కార్ బ్రాండ్ అయిన కియా మోటార్స్ తన బ్రాండ్ యొక్క కొత్త లోగోను భారతదేశంలో ఆవిష్కరించింది. అంతే కాకూండా ఈ సందర్భంగానే కంపెనీ తన భవిష్యత్ ప్రణాళికను కూడా ప్రకటించింది. కియా మోటార్స్ వచ్చే నెలలో కొత్త సెల్టోస్ మరియు సోనెట్ ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

ఈ కొత్త వెహికల్స్ 2022 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇకపై కియా మోటార్స్ ఇండియా, కియా ఇండియా అని పిలువబడుతుంది. త్వరలో విడుదలకానున్న కొత్త సెల్టోస్ కొత్త లోగోతో పాటు ఇక్కడ చూడవచ్చు.

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

కియా మోటార్స్ వచ్చే ఏడాది విడుదల కానున్నకొత్త సెగ్మెంట్స్ గురించి మాట్లాడుతూ, కొత్త విభాగంలో తన కొత్త మోడల్‌ను విడుదల చేయబోతునన్నట్లు తెలిపింది. కియా మోటార్స్ యొక్క గ్రీన్ ఫ్యూచర్ త్వరలో 7 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

MOST READ:మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

ఇందులో భాగంగా 2026 నాటికి 11 ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ తన లైనప్‌లో చేర్చబోతోంది. కియా మోటార్స్ 2030 నాటికి 1.6 మిలియన్ పర్యావరణ అనుకూల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

కంపెనీ యొక్క సెల్టోస్‌ ఎస్‌యూవీని 2019 తీసుకువచ్చింది. కియా మోటార్స్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో సెల్టోస్‌ ఒకటిగా నిలిచింది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పటివరకు 2.50 లక్షల కార్లను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది.

MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

ప్రస్తుతం కియా మోటార్స్ సోనెట్, కార్నివాల్ మరియు సెల్టోస్ వంటి మోడళ్లను విక్రయిస్తుంది. కియా సొనెట్ ఎస్‌యూవీకి మార్కెట్లో వినియోగదారుల నుండి అద్భుతమైన స్పందనను వస్తోంది. కంపెనీ ఈ విభాగంలో విక్రయించే 6 వ కాంపాక్ట్ ఎస్‌యూవీ సొనెట్.

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

కంపెనీ నివేదికల ప్రకారం మార్కెట్లో ప్రతి 2 నిమిషాలకు ఒక కారు అమ్ముడవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న సమయంలో కియా మోటార్స్ కూడా కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయబోతోంది.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

ప్రస్తుతం కంపెనీ తమ లావాదేవీలన్నీ కాంటాక్ట్‌లెస్ మరియు పేపర్‌లెస్‌గా చేసింది. కియా మోటార్స్ తన పరిధిని దేశవ్యాప్తంగా మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. దీని కోసం కియా మోటార్స్ ఈ ఏడాది చివరి నాటికి 200 నగరాల్లో 350 టచ్ పాయింట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త లోగో ఆవిష్కరించిన కియా మోటార్స్.. త్వరలో రానున్న సొనెట్ & సెల్టోస్

కియా మోటార్స్ ప్రకారం కేవలం 22 నెలల్లో 2.50 లక్షల కార్లను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది. కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన లోగో విషయానికి వస్తే, ఇది సెల్టోస్ ముందు, స్టీరింగ్ వీల్ మీద మరియు చక్రం మీద కనిపిస్తాయి. కంపెనీ యొక్క అప్డేటెడ్ సెల్టోస్ మరియు సొనెట్‌లు నిరంతరం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ వీటిని డీలర్‌షిప్‌లకు పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తుంది.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

Most Read Articles

English summary
New Kia Logo Unveiled In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X