ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

ప్రపంచ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారులలో ఒకటి లంబోర్ఘిని. లంబోర్ఘిని బ్రాండ్ కార్లు అత్యంత ఖరీదైనవి అవినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగి ఉన్నాయి. ఈ కార్లను ఎక్కువగా సెలబ్రెటీలు, క్రికెటర్లు మరియు బాగా డబ్బున్న ధనవంతులు కొనుగోలు చేస్తూ ఉంటారు.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

లంబోర్ఘిని కంపెనీ యొక్క వాహనాలలో అత్యంత ఆదరణ కలిగిన కార్ 'లంబోర్ఘిని ఉరుస్'. లంబోర్ఘిని కంపెనీ ఈ ఉరుస్‌ కారుని 2019 లో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇటీవల కంపెనీ వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం, లంబోర్ఘిని ఉరుస్ ఇప్పటికి మొత్తం 15,000 యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేసుకుందని తెలుస్తోంది.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

లంబోర్ఘిని ఉరుస్‌ ప్రస్తుతం బ్రాడ్ నుంచి అత్యధికంగా తయారైన ఎస్‌యూవీగా కీర్తి గడించింది. లంబోర్ఘిని ఉరుస్ విఫణిలోకి అడుగుపెట్టిన కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ఈ రికార్డ్ కైవసం చేసుకుంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తైన లగ్జరీ కార్ల జాబితాలో ఉరుస్ స్థానం దక్కించుకుంది.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

ఇప్పుడు ఎట్టకేలకు లంబోర్ఘిని కంపెనీ నుంచి 15,000 వాహనమైన ఉరుస్ విడుదలైంది. ఈ కార్ గ్రాఫైట్ క్యాప్సూల్ కలర్ అండ్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. అయితే ఈ కార్ యొక్క ఎక్స్టీరియర్ కలర్ గ్రిజియో కేర్స్ మాట్టే కలర్ షేడ్ లో ఉంటుంది. లోపలి భాగం డ్యూయల్ టోన్ నీరో అడే మరియు వెర్డే స్కాండల్ కలర్ లో ఉంది.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

లంబోర్ఘిని కంపెనీ తయారుచేసిన ఈ 15,000 ఉరుస్ కారు ప్రత్యేకంగా బ్రిటీష్ మార్కెట్ కోసం తయారుచేయబడినట్లు తెలిసింది. ఈ కార్ చాలా ఆకర్షణీయమైన కలర్ లో చూపరులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంది.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

భారత మార్కెట్లో విక్రయించబడుతున్న లంబోర్ఘిని ఉరుస్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం 3.1 కోట్ల రూపాయలు. లంబోర్ఘిని ఉరుస్ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉండి, మంచి పనితీరుకి అందిస్తుంది. అంతే కాకుండా ఈ కారు యొక్క ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైన్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీకి స్లిమ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, టెయిల్ లైట్లు లభిస్తాయి. ఈ కారు డిజైన్ లంబోర్ఘిని హురాకాన్ సూపర్ కార్ నుండి ప్రేరణ పొందింది. లంబోర్ఘిని ఉరుస్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 22 మరియు 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్సన్ లో కూడా అందుబాటులో ఉంది.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

లంబోర్ఘిని ఉరుస్ ఇంజిన్ విషయైకి వస్తే, ఈ ఎస్‌యూవీ 4-లీటర్ ట్విన్-టర్బో వి 8 ఇంజిన్ నుండి శక్తిని పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 650 బిహెచ్‌పి పవర్ మరియు 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అదేవిధంగా 12.8 సెకన్లలో 0 నుంచి 200 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

ఉరుస్ ఉత్పత్తిలో కొత్త మైలురాయి చేరుకున్న లంబోర్ఘిని.. మూడేళ్ళలో 15,000 యూనిట్లు

లంబోర్ఘిని ఉరుస్ యొక్క గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు. కారు అత్యధిక వేగంతో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే ఇటీవల రష్యాలోని బైకాల్ సరస్సు యొక్క మంచుతో నిండిన సరస్సుపై నిర్వహించిన కార్యక్రమంలో 298 కిలోమీటర్ల వేగంతో మంచు మీద ప్రయాణించి రికార్డ్ బద్దలు కొట్టింది.

Most Read Articles

English summary
Lamborghini Urus 15,000 Units Production Milestone. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X