అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ Lamborghini (లంబోర్ఘిని) ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది. భారతీయ మార్కెట్లో కూడా ఈ కంపెనీకి ఉన్న ఆదరణ తక్కువేమీ కాదు. అయితే Lamborghini భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 300 Lamborghini కార్లను డెలివరీ చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా 'లంబోర్ఘిని డే' రెండో ఎడిషన్‌ని ఈరోజు ముగించింది.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

Lamborghini కంపెనీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా తన వినియోగదారులను లగ్జరీ డ్రైవ్ ఈవెంట్ కోసం ఆహ్వానించింది. కంపెనీ అందించిన ఈ ఆహ్వానంతో, భారతదేశంలోని చాలా మంది కస్టమర్లు తమ విలాసవంతమైన లంబోర్ఘిని కార్లతో చేరారు.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

ఈ డ్రైవ్ ఈవెంట్‌కు హాజరయ్యే లంబోర్ఘిని వాహనదారులు ఒక ప్రత్యేక మార్గంలో కారును డ్రైవ్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. Lamborghini (లంబోర్ఘిని) యొక్క సూపర్ కార్లలో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగాదారులకు ఒక విలాసవంతమైన అనుభూతిని అందిస్తాయి.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

Lamborghini కంపెనీ ఈ 'లంబోర్ఘిని డే' ను భారతదేశంలోని మూడు ప్రదేశాలలో నిర్వహించింది. అవి ముంబై-పూణే, బెంగుళూరు-హంపి మరియు న్యూఢిల్లీ-జేవార్లలో జరుపుకున్నారు. ఈ గ్రాండ్ డ్రైవింగ్ ఈవెంట్‌లో చాలామంది వాహన ప్రియులు పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

ఇందులో పాల్గొన్న వారు ప్రతి వారాంతంలో తమ విలాసవంతమైన లంబోర్ఘిని కారుతో పయనమయ్యారు. అంతే కాకుండా ఈ డ్రైవింగ్ ఒక మధురమైన అనుభవాన్ని అందించింది. లంబోర్ఘిని వాహనదారులందరూ కూడా దాదాపు 1,350 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ ముగిసాయి.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

కంపెనీ నిర్వహించిన ఈ ఈవెంట్ జరిగిన ప్రాంతాల్లో (పూణే, హంపి మరియు ఢిల్లీ) ఇందులో పాల్గొనే వారికోసం ప్రత్యేకమైన వసతి కూడా కంపెనీ ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ కూడా ఈ ఈవెంట్లో పాల్గొనే వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్ సందర్భంగా 'Lamborghini India' హెడ్ Sharad Agarwal (శరద్ అగర్వాల్) మాట్లాడుతూ, ఇప్పటికి భారతదేశంలో 300 లంబోర్ఘిని కార్లను డెలివరీ చేసినందుకు చాలా సంతోషితున్నాము. మా కస్టమర్ల యొక్క సహకారంతో పొందిన ఈ విజయంతో కంపెనీ ఈ వేడుకలు జరుపుకుంటోంది.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

ఇది భారతదేశంలో మా ప్రయాణాన్ని మరింత ముందుకు సాగేలా చేస్తుంది. ఈ సంవత్సరం మేము హురాకాన్ EVO RWD స్పైడర్, ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ మరియు ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌తో పాటు భారతదేశంలో హురాకాన్ STO ప్రారంభించాము. అంతే కాకుండా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశంలో 100 వ ఉరస్ ప్రారంభించాము. ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

లంబోర్ఘిని కంపెనీ భారతదేశంలోని తన కస్టమర్‌లకు ఈ సూపర్ కార్లను ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్‌ ద్వారా అందిస్తుందని, తద్వారా కస్టమర్ మరియు బ్రాండ్ మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరుచుకుంది. కంపెనీ ముందు ముందు మరింత వేగంగా మరియు మరింత ఉత్సాహంతో ముందుకు సాగడానికి కస్టమర్ల ఆదరణ చాలా ఉపయోగపడుతుంది.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

భారతదేశంలో లంబోర్ఘిని అడుగుపెట్టి దాదాపు 12 సంవత్సరాలు ముగిశాయి. కంపెనీ ఇప్పటివరకు అందించిన 300 లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో 100 కార్లు ఉరుస్ ఎస్‌యూవీలు. 'Lamborghini Urus' కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన SUV. Lamborghini Urus భారతీయ మార్కెట్లో 2019 లో ప్రారంభించబడింది.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

Lamborghini కంపెనీ యొక్క Urus చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా, అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది. Lamborghini Urus ఎస్‌యూవీ 4-లీటర్ ట్విన్-టర్బో వి 8 ఇంజిన్ నుండి శక్తిని పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 650 బిహెచ్‌పి పవర్ మరియు 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అదేవిధంగా 12.8 సెకన్లలో 0 నుంచి 200 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు.

అట్టహాసంగా ముగిసిన 'లంబోర్ఘిని డే' సెలబ్రేషన్స్; వివరాలు

Lamborghini Urus దాని లంబోర్ఘిని హురాకాన్ సూపర్‌కార్ స్ఫూర్తితో రూపొందించబడింది. Urus SUV స్టైలిష్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 22 ఇంచెస్ మరియు 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఆప్షన్‌గా పొందవచ్చు. Lamborghini Urus ధర భారతీయ మార్కెట్లో రూ. 3.15 కోట్లు (ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
Lamborghini celebrates milestone delivery of 300 cars in india concludes lamborghini day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X