లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థల్లో ఒకటి లంబోర్ఘిని (Lamborghini). ఈ ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ప్రపంచ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతూనే ఉంది. అయితే ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను విఫణిలోకి విడుదల చేయలేదు. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేస్తున్నాయి. ఈ తరుణంలోనే లంబోర్ఘిని కంపెనీ కూడా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

నివేదికల ప్రకారం, సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని 2027 సంవత్సరంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కారుని విడుదల చేస్తామని కంపెనీ ధ్రువీకరించింది. కావున కంపెనీ తన ఉత్పత్తులను దశలవారీగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లుగా మారుస్తుందని తెలిపింది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

లంబోర్ఘిని CEO స్టెఫాన్ వింకెల్‌మాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల గురించి మాట్లాడుతూ.. లంబోర్ఘిని యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ 2027 లేదా 2028 లో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. అంతే కాకూండా అంతకుముందు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లు విడుదల చేయబడతాయని చెప్పారు.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

ఆర్టిఫీషియల్ గా తయారు చేసిన ఇంధనంతో నడపగలిగే వాహనాలను తయారు చేసేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఆర్టిఫీషియల్ ఫ్యూయెల్ ఉపయోగించడం వల్ల, అలాంటి వాహనాలు పెట్రోల్ లేదా డీజిల్ కంటే చాలా తక్కువ కార్బన్ డయాక్సైడ్ (CO2) ను విడుదల చేస్తాయి.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

లంబోర్ఘిని యొక్క ఈ కార్లు కార్బన్ న్యూట్రల్‌గా ఉంటాయి, ఇది పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. ఈ సంవత్సరం ప్రారంభంలో లంబోర్ఘిని $1.5 బిలియన్ల పెట్టుబడితో దాని ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. కావున కంపెనీ 10 సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టగలదని దీని ద్వారా తెలుస్తుంది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

నివేదికల ప్రకారం, లాంబోర్ఘిని యొక్క మొదటి ఎలక్ట్రిక్ కారు 4-సీటర్‌గా ఉండే GT వేరియంట్‌లో తీసుకురాబడుతుంది అని తెలుస్తుంది. లంబోర్ఘిని ఈ మోడల్‌ను అభివృద్ధి చేయడంలో పోర్స్చే కూడా సహాయం చేస్తోంది. కావున కంపెనీ త్వరలో లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కారుని విడుదల చేస్తుంది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

కంపెనీ ఇప్పటికే అందించిన నివేదికల ప్రకారం లంబోర్ఘిని తన సూపర్ SUV ఉరుస్ యొక్క 10,000 వ యూనిట్ ఉత్పత్తిని పూర్తి చేసింది. కంపెనీ 2018 లో ఉరుస్ ఎస్‌యూవీ యొక్క ఉత్పత్తిని ప్రారంభించింది. 2020 జూన్ నెలలో కంపెనీ ఉరుస్ కోసం కొత్త పెర్ల్ క్యాప్సూల్ మరియు కార్బన్ ఫైబర్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

లంబోర్ఘిని కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలను చేసుకున్న చేపట్టిని SUV లలో ఉరుస్ ఒకటి. ఇది ప్రపంచ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించడంలో ఉపయోగపడింది. భారతీయ మార్కెట్లో కూడా ఇది మంచి అమ్మకాలను పొందింది. లంబోర్ఘిని యొక్క ఈ ఉరుస్ కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

భారతదేశంలో 50 యూనిట్లకు పైగా లంబోర్ఘిని ఉరస్‌లు విక్రయించబడ్డాయి. గత ఏడాది భారతదేశంలో ఆటోమొబైల్ రంగం మందగించినప్పటికీ, ఈ కంపెనీ యొక్క ఈ మోడల్ మాత్రం మంచి అమ్మకాలను నమోదు చేసింది. లంబోర్ఘిని కంపెనీ యొక్క ఉరుస్ కారు ఎక్కువమంది వాహనవినియోగదారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తుంది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

లంబోర్ఘిని ఉరుస్ SUV 4.0-లీటర్ 8-సిలిండర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌తో 641 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లంబోర్ఘినికి చెందిన అత్యంత శక్తివంతమైన కార్లలో ఇది ఒకటి. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. అయితే ఈ కారు యొక్క గరిష్ట వేగం 305 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

భారతదేశంలోని చాలా మంది సినీ తారలు మరియు వ్యాపారవేత్తలు లంబోర్ఘిని ఉరస్ కారును కలిగి ఉన్నారు. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, దేశంలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా ఈ కార్లను కలిగి ఉన్నారు. ఈ కారులో ఆఫ్-రోడింగ్ కోసం వివిధ డ్రైవింగ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి. లంబోర్ఘిని ఉరస్ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క MLB Evo ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది.

లంబోర్ఘిని ఎలక్ట్రిక్ కార్ వచ్చేస్తుందోచ్.. 2027 కల్లా రెడీ

లంబోర్ఘిని ఉరుస్ SUV స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్లను పొందుతుంది. ఈ కారు రూపకల్పన లంబోర్ఘిని దాని హురాకాన్ సూపర్‌కార్ నుండి ప్రేరణ పొందింది. లంబోర్ఘిని ఉరస్ విలాసవంతమైన 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌పై అందించబడుతుంది. మేలో ప్రపంచ ప్రీమియర్‌లో లాంబోర్ఘిని తన కొత్త కారు హురాకాన్ ఎవో స్పైడర్‌ను విడుదల చేసింది. లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పైడర్ ఒక సూపర్ ఫాస్ట్ స్పోర్ట్స్ కారు, ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు.

Most Read Articles

English summary
Lamborghini to launch its first electric supercar by 2027 details
Story first published: Thursday, December 9, 2021, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X