లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన ఫ్రాంగం ఎంతగా ముందుకు సాగుతోందో, అందరికి తెలుసు. నేడు దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. చాలామందికి ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువ అవగాహన కలిగింది. కానీ భారతదేశంలో చాలా సంవత్సరాల క్రితం ఒక సంస్థ దేశానికి మొదటి ఎలక్ట్రిక్ కారును అందించిన సంగతి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

చాలా సంవత్సరాల క్రితం భారత మార్కెట్లో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు, అంతే కాకుండా దీని గురించి పెద్దగా చర్చ కూడా జరగలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ కారు అంతగా విజయవంతం కాలేదు. కానీ ఏదేమైనా ఈ ఎలక్ట్రిక్ కార్ తయారీదారు మాత్రం దేశానికీ ఎలక్ట్రిక్ కారుని అందించాలనే ద్యేయంతో తమవంతు ప్రయత్నం చేశారు.

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

1993 లో భారతీయ కంపెనీ ఎడ్డీ 'లవ్‌బర్డ్స్' అనే ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఈ కారు చూడటానికి నానో కారులాగా ఉంది. అంతే కాకుండా ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. జపాన్‌కు చెందిన యాస్కావా ఎలక్ట్రిక్ సహకారంతో కంపెనీ దీనిని నిర్మించింది.

MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

ఈ కారును మొదట ఈ కారును తమిళనాడులోని చాలకూడి, కేరళ మరియు కోయంబత్తూర్లలో తయారు చేశారు. రెండు సీట్ల లవ్‌బర్డ్ రీఛార్జిబుల్ పోర్టబుల్ బ్యాటరీతో నడిచే డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిక్ మోటారును అందించింది. బ్యాటరీ ప్యాక్‌లు అప్పటికి అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి, లీడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించబడింది.

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

బ్యాటరీ ఛార్జ్ చేయడానికి సౌకర్యంగా ఉంది, కాబట్టి ఇది పోర్టబుల్ గా తయారైంది, తద్వారా బ్యాటరీని ఇంటి లోపల కూడా ఛార్జ్ చేయవచ్చు. లీడ్ యాసిడ్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 8 గంటలు పట్టింది. ఎందుకంటే అప్పట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో లేదు. లవ్‌బర్డ్ ఎలక్ట్రిక్ కార్ ఒకే ఛార్జీతో 60 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

కారులోని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్‌కు సున్నితమైన అనుభవాన్ని అందించే విధంగా రూపొందించబడింది. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆ సమయంలో చాలా ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కారులో అమర్చారు.

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

ఈ కారులో ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ కారులో నాలుగు గేర్లు, అలాగే రివర్స్ గేర్ ఉన్నాయి. ఈ కారు ప్రధానంగా పట్టణ వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఇది చిన్న ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ, ఈ కారులో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి.

MOST READ:ఊపందుకున్న హీరో మోటోకార్ప్ సేల్స్.. భారీగా పెరిగిన డిసెంబర్ అమ్మకాలు

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

ఈ కారులో ఉన్న మొదటి సమస్య ఏమిటంటే అది తక్కువ శక్తి గల ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించడం, ఈ కారణంగా ఇది రోడ్లపై చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అంతే కాకుండా కొంత నిటారుగా ఉన్నరోడ్లపై ఇది కదలలేకపోయింది. ఇది ఈ కారు యొక్క అతిపెద్ద లోపం.

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

లవ్‌బర్డ్‌ ఎలక్ట్రిక్ కార్ ఎందుకు నిలిపివేయబడిందంటే..?

చాలా సంవత్సరాల క్రితమే భారతదేశంలో తయారైన లవ్‌బర్డ్ ఎలక్ట్రిక్ కార్ ఎక్కువ అమ్మకాలను సాగించలేకపోయింది. ఇంత తక్కువ అమ్మకాలు ఉన్నందున, మరియు ఎక్కువ ఆర్థిక పరమైన నష్టాలు రావడం వల్ల ఎడ్డీ దీనిని తయారుచేయడం నిలిపివేసింది. లవ్‌బర్డ్ వైఫల్యానికి అతి పెద్ద కారణం ఏమిటంటే, ఈ కారు భారతదేశంలో సమయానికి ముందే లాంచ్ చేయబడింది.

MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించిన టెక్నాలజీ అప్పట్లో చాలా కొత్తది, అది మాత్రమే కాకుండా చాలా కొద్ది మందికి ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసు. వాహనదారులకు ఎలక్ట్రిక్ కార్లు మరియు ఛార్జింగ్‌లో సమస్యలు తలత్తేవి. ఆ సమయంలో ప్రభుత్వం కారుపై ఇచ్చే సబ్సిడీ కూడా నిలిపివేసింది.

అదే సమయంలో మారుతి సుజుకి కంపెనీ మారుతి 800 వంటి చిన్న కారుని మరియు ఫ్యామిలీస్ ఉపయోగించే విధమైన కారుని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారణంగా వినియోగదారుల దృష్టి కాస్త ఎలక్ట్రిక్ కార్ల నుంచి సదాహరణ కార్లపైకి మళ్లింది. భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్ అయిన లవ్‌బర్డ్స్‌ 1993 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేయబడింది.

లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

భారతీయ మార్కెట్లో రేవా ప్రారంభించిన తరువాత, ఎలక్ట్రిక్ కార్ల శకం ప్రారంభమయింది. కానీ అది కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. మహీంద్రా రేవాను కొనుగోలు చేసిన తరువాత ఇ2O ప్రారంభించబడింది. ప్రస్తుతం టాటా, ఎంజి, హ్యుందాయ్ వంటి కంపెనీల యొక్క ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే రానున్న కాలంలో అనేక కొత్త కంపెనీలు కూడా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నాయి.

Image Courtesy: Electric Vehicles

Most Read Articles

English summary
Lovebird India’s First Electric Car Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X