భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ Mercedes-Benz (మెర్సిడెస్ బెంజ్) భారతీయ మార్కెట్లో తన కొత్త 2021 Mercedes-Benz S-Class (మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌) విడుదల చేసింది. ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త వేరియంట్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

Mercedes-Benz తన S-Class ను S-Class 350d మరియు S-Class s450 అనే రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది. వీటి ధరల విషయానికి వస్తే, S-Class 350d ధర రూ. 1.57 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, S-Class s450 వేరియంట్ ధర రూ. 1.62 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త లగ్జరీ కార్స్ కొనుగోలు చేసిన వారికి కంపెనీ సర్వీస్ ప్యాకేజ్ కూడా అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రస్తుతం 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ను రెండు వేరియంట్లలో విక్రయిస్తోందని, ఇందులో S400d 4Matic మరియు S450 4Matic ఉన్నాయి. వీటి ధరలు S400d 4Matic ధర రూ 2.17 కోట్లు కాగా, S450 4Matic ధర రూ 2.19 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇవన్నీ కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉండి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 Mercedes-Benz S-Class దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ మోడల్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు ముందు భాగంలోని గ్రిల్ బ్లాక్ లో ఉంటుంది, అయినప్పటికి కూడా ఇది చాలా చోట్ల సాఫ్ట్ లైన్స్ మరియు క్రోమ్ ఎలిమెంట్‌లను పొందుతుంది. కావున ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

Mercedes-Benz S-Class డిజిటల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లను పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యమైన ఫీచర్స్ దాని ఫ్లష్-ఫిట్డ్ డోర్ హ్యాండిల్స్. కారు యొక్క కీని కారు దగ్గరకి తరలించిన తర్వాత మాత్రమే ఈ డోర్ హ్యాండిల్స్ బయటకు వస్తాయి. ఇది చాలా అద్భుతమైన ఫీచర్. ఇవన్నీ కూడా కారు యొక్క ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని చాలా మెరుగుపరుస్థాయి.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

2021 Mercedes-Benz S-Class యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో త్రీ అపోల్స్ట్రే ఆప్సన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి వైట్, సియన్నా బ్రౌన్ మరియు బ్లాక్ కలర్స్. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

Mercedes-Benz S-Class యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 12.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ MID మరియు సెకండ్ జనరేషన్ MBUX వాయిస్ అసిస్ట్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఇందులో సెకండ్ రో వెంటిలేటెడ్ సీటు మరియు మసాజ్ ఫంక్షన్, సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్‌పై టాబ్లెట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్ మరియు బర్మీస్టర్ 4 డి సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి అనేక అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

Benz S-Class రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో ఒకటి 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌.

ఇందులోని 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 367 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక ఇందులో ఉన్న 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 286 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 48-వోల్ట్ లైట్ వెయిట్ హైబ్రిడ్ సిస్టం కూడా దాని పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడింది. రెండు ఇంజన్‌లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. అంతే కాకుండా 4 మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ప్రామాణికంగా పొందుతాయి.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

2021 Mercedes-Benz S-Class అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటుంది. ఇందులో 10 ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, స్టెబిలిటీ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, సైడ్ కొలీషియన్ మానిటరింగ్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహనదారుల యొక్క భద్రతను నిర్దేశిస్తాయి.

భారత్‌లో విడుదలైన కొత్త Mercedes-Benz S-Class: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 Mercedes-Benz S-Class, BMW 7 Series మరియు Audi A8 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో విడుదలైన కొత్త Benz S-Class ఎలాంటి ఆదరణ పొందుతుంది, ఎలాంటి అమ్మకాలతో ముందుకు వెళుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Made in india 2021 mercedes benz s class launched price variants features details
Story first published: Thursday, October 7, 2021, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X