YouTube

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవల భారత మార్కెట్లో ప్రారంభించిన తమ కొత్త తరం (5వ తరం) హోండా సిటీ కారును ఇక్కడి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ ఈ సెడాన్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌ను తయారు చేస్తోంది.

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

హోండా కంపెనీ తీసుకున్న ఈ చొరవ భారత ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ఆశయాన్ని బలోపేతం చేస్తుంది. గుజరాత్‌లోని పిపావావ్ నౌకాశ్రయం మరియు చెన్నైలోని ఎన్నోర్ ఓడరేవుల నుండి హోండా తమ ఫిఫ్త్ జనరేషన్ సిటీ సెడాన్‌ను మధ్యప్రాచ్య (మిడిల్-ఈస్ట్) దేశాలకు ఎగుమతి చేయడాన్ని ప్రారంభించింది.

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

హోండా గత ఆగస్ట్ 2020 నుండి దక్షిణాఫ్రికా దేశాలకు రైడ్ హ్యాండ్ డ్రైవ్ సిటీ కార్లను ఎగుమతి చేయడాన్ని ప్రారంభించగా, అక్టోబర్ 2020 పొరుగు దేశాలైన నేపాల్ మరియు భూటాన్లకు ఈ కారును ఎగుమతి చేయడం ప్రారంభించింది. కాగా, ఇప్పుడు తొలిసారిగా హోండా ఈ కారులో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్‌ని ఎగుమతి చేయటం ప్రారంభించింది.

MOST READ:ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో తయారైన హోండా సిటీ సెడాన్‌లోని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్‌ను కొత్త మార్కెట్లకు ఎగుమతి చేయటం ద్వారా భారత్‌లో తమ వ్యాపారాన్ని బలోపేతం చేసుకునే అవకాశం ఏర్పడిందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు సిఇఒ గకు నకానిషి అన్నారు.

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

హోండా ఈ కారుని రాజస్థాన్‌లోని తపుకర వద్ద ఉన్న ప్రపంచ స్థాయి ఉత్పాదక కేంద్రంలో తయారు చేస్తోంది. ఈ ప్లాంట్‌లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సిటీ మోడల్‌ని రూపొందించడానికి కంపెనీ కొత్త పెట్టుబడులను వెచ్చించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహకరిస్తుంది.

MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

హోండా తమ సిటీ సెడాన్‌తో పాటుగా అమేజ్ మరియు డబ్ల్యుఆర్-వి మోడళ్లను కూడా భారత్‌ను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. హోండా ఇటీవలే భారత మార్కెట్లో తమ ప్రీమియం మోడళ్లయిన సిఆర్-వి మరియు సివిక్ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించిన తర్వాత, ఇప్పుడు హోండా నుండి లభిస్తున్న ప్రీమియం మోడల్‌గా సిటీ మారింది.

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

ఇక కొత్త 2020 హోండా సిటీ సెడాన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కారు ముందు భాగంలో క్రోమ్ గ్రిల్ ఉంటుంది. అలాగే, ఇందులో షార్ప్ షోల్డర్ లైన్ ఉంటుంది, ఇది హెడ్‌లైట్ నుండి టెయిల్ లెట్ వరకూ ఉంటుంది.

MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

ఈ కారు కొత్త 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 121 బిహెచ్‌పి పవర్ మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టీరింగ్ వీల్‌తో 'హోండా సిటీ' ఏం జరుగుతోంది..?

ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త 2020 హోండా సిటీ సెడాన్‌లో 4 ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, అలెక్సా సపోర్ట్‌తో కూడిన 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Starts Left Hand Drive City Sedan Exports From India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X