మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో, భారతదేశంలో తయారు చేస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌ను తాజాగా దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేసినట్లు తెలిపింది. మొదటి బ్యాచ్‌లో భాగంగా (760 యూనిట్లు), ఈ మేడ్ ఇన్ ఇండియా కారుని చెన్నై పోర్టు నుండి సౌత్ ఆఫ్రికా మార్కెట్‌కు పంపిణీ చేసినట్లు రెనో ఇండియా ప్రకటించింది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

రెనో ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లి మరియు కామరాజ్ పోర్ట్ లిమిటెడ్ (కెపిఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ పాలివాల్ ఐఏఎస్ ఈ బ్యాచ్ ఎగుమతులను ప్రారంభించారు. రెనో యొక్క రెండవ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ దక్షిణాఫ్రికా కాగా, మొదటిది నేపాల్.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

కొద్ది రోజుల క్రితమే రెనో ఇండియా, తమ కైగర్ ఎస్‌యూవీని నేపాల్‌కు కూడా ఎగుమతి చేసిన సంగతి తెలిసినదే. రెనో అనుబంధ సంస్థ అయిన నిస్సాన్ కూడా ఈ విభాగంలో విక్రయిస్తున్న మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని జూన్ 2021 నుండి ఈ రెండు మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

రెనో కైగర్ ఆవిష్కరణతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాన్ని రెనో ప్రారంభించిందని వెంకట్రామ్ అన్నారు. రెనో భారత ప్రభుత్వం యొక్క 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్' నినాదానికి కట్టుబడి ఉందని, కైగర్‌ను దక్షిణాఫ్రికా మరియు నేపాల్‌కు ఎగుమతి చేయడమే ఈ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

రెనో కైగర్ భారతదేశ రూపకల్పన, ఇంజనీరింగ్ మరియు ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. కస్టమర్ బేస్ పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీ తమ కైగర్‌ను ఇండోనేషియా, ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలు మరియు సార్క్ దేశాలతో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించాలని రెనో ఇండియా భావిస్తోంది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

కైగర్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఈ మోడల్ ఆర్ఎక్స్ఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌టి మరియు ఆర్ఎక్స్‌జి అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.5.64 లక్షల నుండి రూ.10.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉ్ననాయి.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

రెనో మరియు నిస్సాన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సిఎమ్ఎఫ్ఏ+ ప్లాట్‌ఫామ్‌పై కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు. రెనో కైగర్ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యువి300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

రెనో కైగర్ డిజైన్ ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో ఎల్‌ఈడి హెడ్‌లైట్ సెటప్, క్రోమ్ హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్లాట్ బోనెట్, ఈ కారుకి కూప్ బాడీ టైప్ డిజైన్‌ను ఇవ్వటం కోసం వెనుక వైపు వాలుగా డిజైన్ చేసిన పైకప్పు, బెటర్ ఆఫ్-రోడింగ్ కోసం 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మొదలైనవి ఉన్నాయి.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

మేడ్ ఇన్ ఇండియా రెనో కైగర్.. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా..

చివరిగా, ఇంజన్ విషయానికి వస్తే, రెనో కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. ఇవి రెండూ వరుసగా 72 బిహెచ్‌పి మరియు 100 బిహెచ్‌పివ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టి మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Made In India Renault Kiger Exports Began To South Africa, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X