వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు. కొత్త వాహనాల విషయంలో డిజిటల్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు మహారాష్ట్ర రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిజిటల్ వాహనాల నమోదును ప్రవేశపెట్టింది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

ఈ కొత్త ప్రక్రియ ద్వారా వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడం ఇప్పుడు పూర్తిగా కాంటాక్ట్‌లెస్ ప్రక్రియగా మారుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫాడా (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) కూడా స్వాగతించింది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

ఈ విధానంలో కొత్త వాహనాలకు సంబంధించిన పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించబడతాయి. అనంతరం, పత్రాలను విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత వాహన సంఖ్య (వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్) జనరేట్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ విధానం పూర్తిగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లను మాత్రమే వర్తిస్తుంది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

ఈ మేరకు మహారాష్ట్ర రవాణా కమిషనర్ డాక్టర్ అవినాష్ ధకనే జూన్ 8, 2021వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారిక ఉత్తర్వుల ప్రకారం, డీలర్లు వాహన రిజిస్ట్రేషన్ ఫారంలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సమర్పిస్తారు. ఇకపై పూర్తిగా తయారైన కొత్త మోటార్‌సైకిళ్ళు మరియు కార్ల యొక్క మొదటి రిజిస్ట్రేషన్ కోసం భౌతిక ధృవీకరణ ఉండదు.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలోనే వాహన డీలర్లు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కావల్సిన అన్ని పత్రాలను సేకరించి, ఆన్‌లైన్‌లో సమర్పిస్తారు. ఆ తర్వాత డీలర్ల కస్టమర్ నుండి ఇ-సంతకాన్ని డిజిటల్‌గా సేకరిస్తారు. ఇలా వాహనాలను విజయవంతంగా నమోదు చేసిన తరువాత, డీలర్‌షిప్‌ల వద్ద వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

అయితే, తమ వాహనాలను ప్రత్యేకమైన లేదా ఫ్యాన్సీ నెంబర్ కోరుకునే కస్టమర్లు మాత్రం తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టడానికి మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖతో తాము నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఫడా తెలిపింది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

కొత్త వాహనాల విషయంలో డిజిటల్ వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇబ్బంది లేకుండా చేయడానికి ఫడా తమ ఇన్‌పుట్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, దేశంలో డిజిటల్ మరియు కాంటాక్ట్‌లెస్ సేవలకు ప్రధాన్యత సంతరించుకుంది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

ఇందులో భాగంగానే, కొత్త వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్లు, తమ వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆ ప్రక్రియను మొత్తం పూర్తిగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా డిజిటలైజ్ చేయబడింది. మహారాష్ట్ర బాటలోనే దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే, ఆర్టీఓ కార్యాలయాల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటల్ చేయటం ద్వారా, రాష్ట్రంలో కార్ల వ్యాపారం మరింత సులభతరం అవుతుంది. కస్టమర్లు షోరూమ్‌ల నుండి తమ వాహనాలను వేగంగా మరియు ఇబ్బంది లేకుండా డెలివరీ చేయడానికి మరియు వారి విలువైన సమయాన్ని ఆదా చేయడానికి ఈ ప్రక్రియ అనుమతినిస్తుంది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఆర్టీఓ కార్యాయాల వద్ద అనవసరమైన రద్దీని నివారించడానికి, తద్వారా ఆర్టీఓల పనితీరును పెంచడానికి కొన్ని ఆర్టీఓ సేవలను ఆన్‌లైన్ చేసింది. లెర్నర్స్ లైసెన్స్ పొందటం, డ్రైవర్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవటం మరియు కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవటం మొదలైన 18 రకాల ఆర్టీఓ సేవలను ఆన్‌లైన్ చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వాహనాల రిజిస్ట్రేషన్ కోసం అర్టీఓ చుట్టూ తిరగాల్సిన పని లేదు; అంతా ఆన్‌లైన్‌లోనే..

ఈ మేరకు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసి నోటిఫికేషన్‌లో పేర్కొన్న 18 రకాల సేవలను పొందటానికి వినియోగదారులు ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదని, అయితే వారు ఈ సేవలను పొందాలంటే తప్పనిసరిగా ఆధార్‌ను కలిగి ఉండాలని వివరించింది. - వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maharastra Government Introduces Digital Vehicle Registration Process, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X