మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ మరియు ఫుల్లీ టెక్ లోడెడ్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ఈ శ్రేణిలోనే అత్యుత్తమ ఫీచర్లు కలిగిన మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. దేశీయ కస్టమర్ల నుండి ఈ కొత్త మోడల్‌కు ఊహించని ఆదరణ లభించడంతో ఇది భారతదేశంలో అతి తక్కువ సమయంలో అత్యుత్తమ విజయం సాధించిన మోడల్ గా నిలిచింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీపై మహీంద్రా డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్, లెవెల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్ (ఏడిఏఎస్), లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో సహా పలు లేటెస్ట్ సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫీచర్లకు సంబంధించిన సమాచారాన్ని, ఇందులోని డ్యాష్ బోర్డులో అమర్చిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సాయంతో తెలుసుకోవచ్చు. ఇప్పటికే వెల్లడించిన ఫీచర్లతో పాటు, డెలివరీ చేయబడిన XUV700 మోడల్ యజమానులతో కంపెనీ క్రమం తప్పకుండా పంచుకునే కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

తాజా సమాచారం ప్రకారం, మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700 యజమానులతో ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త XUV700 టచ్‌స్క్రీన్ సిస్టమ్ యొక్క కనెక్ట్ చేయబడిన యాప్ సెట్టింగ్‌లలో ఓ యజమాని వాణిజ్య ప్రకటన ఆప్షన్ ను గుర్తించారు. అయితే, ఈ ఆప్షన్‌ని ఎనేబుల్ చేస్తే ఎటువంటి ప్రకటనలు (యాడ్స్) వస్తాయో అనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు కానీ, వాహన యజమానులు కావాలనుకుంటే, ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో యాడ్స్‌ను డిసేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

దీన్నిబట్టి చూస్తుంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ పై ప్రకటనలను ప్రదర్శించడానికి కంపెనీ ఒక కార్యాచరణను రూపొందించిందని తెలుస్తోంది. అయితే, యాజమాన్యాల అభిమతానికి అనుగుణంగా యాడ్స్‌ను డిసేబుల్ చేసేందుకు కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రకటనలు లేదా పాప్-అప్‌లు కొత్త లేదా రాబోయే మహీంద్రా ఉత్పత్తులకు సంబంధించినవి కావచ్చు లేదా వాహనం యొక్క వారంటీ లేదా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) పొడిగింపు కోసం రిమైండర్ కావచ్చని తెలుస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ మోడల్‌కి కొన్ని విలువ ఆధారిత సేవలను (తమ స్వంత మ్యూజిక్ స్ట్రీమింగ్, ట్రాఫిక్ అప్‌డేట్‌లు మొదలైనవి) జోడించే అవకాశం కూడా ఉంది. ఇవి కొన్ని రకాల ప్రకటనలతో నిండి పూర్తిగా ఉచితంగా ఉండవచ్చు లేదా ప్రకటనలు లేకుండా కాస్తంత చందా మొత్తాన్ని చెల్లించి పొందవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, మహీంద్రా ఈ ఎస్‌యూవీ దాదాపు 75,000 ల యూనిట్లకు పైగా బుకింగ్‌లను పొందింది. కంపెనీ ఇప్పుడు 2022 జనవరి మధ్య నాటికి 14,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

అయితే, ఇది విడిభాగాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. మహీంద్రా ఇప్పటికే పెట్రోల్ వేరియంట్స్ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీల డెలివరీని గడచిన నెలలోనే ప్రారంభించింది. డీజిల్ వెర్షన్ ఎక్స్‌యూవీ700 డెలివరీలు నవంబర్ 2021 చివరి వారంలో ప్రారంభమవుతాయని కంపెనీ గతంలో ప్రకటించింది. మహీంద్రా ఇప్పటికే XUV700 బుక్ చేసుకున్న వారికి డెలివరీ తేదీలను ఇవ్వడం ప్రారంభించింది. అయితే భారీ జాప్యం కారణంగా కొందరు యజమానులు సంతోషంగా లేరనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

చాలా మంది కస్టమర్లు ఈ ఎస్‌యూవీని మొదటి రెండు రోజుల్లోనే బుకింగ్ చేసుకున్నారు. అయితే, సప్లయ్ కి మించి డిమాండ్ ఉండటంతో కంపెనీ వీటిని డెలివరీ చేయడంలో సమస్యలు ఎదుర్కుంటుంన్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ వినియోగదారులకు ఎస్ఎమ్ఎస్ లేదా ఇ-మెయిల్ ద్వారా వారి వాహనాల డెలివరీ సమాచారాన్ని అందిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ని గత అక్టోబర్‌ 2021 నెలలో బుక్ చేసుకున్న వారికి మే 2022 నెలలో డెలివరీ చేయనున్నట్లు కంపెనీ సందేశాలను పంపిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

తాజా సమాచారం ప్రకారం, కొత్తగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని బుక్ చేసుకునే కస్టమర్లు సుమారు 6 నుంచి 7 నెలల వరకూ వేచి ఉండవలసి ఉంటోంది. అయితే, ఈ డెలివరీ టైమ్‌లైన్ లేదా వెయిటింగ్ పీరియడ్ అనేది ఈ ఎస్‌యూవీ విషయంలో కస్టమర్లు ఎంచుకునే ఇంజన్, వేరియంట్ మరియు కలర్ ఆప్షన్స్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, మహీంద్రా థార్ విషయంలో జరిగినట్లుగానే ఈ కొత్త ఎక్స్‌యూవీ700 డెలివరీల విషయంలో కూడా భారీ జాప్యం జరుగుతోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మొదట్లో విడుదల చేసినప్పుడు దాని బేస్ వేరియంట్ (ఎమ్ఎక్స్ 5 సీటర్ వేరియంట్) ధరను కంపెనీ రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్)కే విడుదల చేసింది. అయితే, ఈ ప్రారంభ ధరను కంపెనీ కేవలం మొదటి 25,000 యూనిట్ల బుకింగ్ లకు మాత్రమే అందించింది. ఆ తర్వాత బుక్ చేసుకునే కస్టమర్లకు ఈ మోడల్ యొక్క పెట్రోల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను కంపెనీ సుమారు రూ.50,000 మేర పెంచి రూ. 12.49 లక్షలు మరియు డీజిల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 12.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

అంటే, ఈ రెండు వెర్షన్ల ధరలు గరిష్టంగా రూ. 50,000 వరకూ పెరిగాయి. ఈ ధరల పెంపు కేవలం బేస్ (ఎమ్ఎక్స్) వేరియంట్లపై మాత్రమే కాకుండా, ఇతర వేరియంట్లపై కూడా వర్తిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి వాటి ధరలు కనిష్టంగా రూ. 10,000 నుండి గరిష్టంగా రూ. 50,000 వరకూ పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత, ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు రూ. 12.49 లక్షల నుండి రూ. 22.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ప్రకటనలు.. కొత్త స్ట్రాటజీనా..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటి 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ 200 బిహెచ్‌పి పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 185 బిహెచ్‌పి పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అలాగే, ఆల్-వీల్ (4x4) డ్రైవ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra allows ads on touchscreen display unit in xuv700 suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X