మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే, తమ సరికొత్త బొలెరియో నియో ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కేవలం రూ.8.48 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ ఈ 7-సీటర్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. గతంలో మహీంద్రా ఆఫర్ చేసిన టియూవీ300 స్థానంలో కంపెనీ ఈ కొత్త బొలెరో నియో ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

మహీంద్రా బొలెరో నియో ఎన్4, ఎన్8, ఎన్10 మరియు ఎన్10 (ఓ) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీని ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా టెస్ట్ డ్రైవ్ చేసింది. అయితే, మనం ఇప్పటి వరకూ టాప్-ఎండ్ వేరియంట్ బొలెరో నియో ఫీచర్ల గురించే తెలుసుకున్నాం కానీ, బేస్ వేరియంట్ (ఎన్4)లో లభించే ఫీచర్ల గురించి తెలుసుకోలేదు.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

ఈ నేపథ్యంలో, అమర్ డ్రయాన్ అనే యూట్యూబర్ తన ఛానెల్‌లో మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్‌లో లభించే ఫీచర్ల వివరాలను వీడియో రూపంలో తెలియజేశారు. నిజానికి ఇది (ఎన్4) బేస్ వేరియంట్ అయినప్పటికీ, కంపెనీ ఈ కారులో డీసెంట్ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇతర 7-సీటర్ వాహనాలతో పోల్చుకుంటే, రూ.8.48 లక్షల ధర వద్ద మహీంద్రా బొలెరో నియో అత్యంత సరసమైన 7-సీటర్ ఎస్‌యూవీగా ఉంటుంది. మరి ఈ వేరియంట్‌లో లభించే ఫీచర్ల వివరాలేంటో తెలుసుకుందాం రండి.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

మహీంద్రా బొలెరో నియోలో లభించే ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే, ఎన్4 వేరియంట్‌లో బయటవైపు క్రోమ్ గార్నిష్ ఉండదు. ఫ్రంట్ గ్రిల్ మరియు సైడ్ మిర్రర్స్ అన్నీ కూడా పియానో బ్లాక్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో 15 ఇంచ్ స్టీల్ వీల్స్ మాత్రమే లభిస్తాయి మరియు వాటిపై వీల్ క్యాప్స్ కూడా ఉండవు.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

ముందు వైపు స్టాండర్డ్ హాలోజెన్ లైట్లు మరియు అందులోనే అమర్చిన టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. డైటైమ్ రన్నింగ్ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్ మరియు సైడ్ ఫుట్‌స్టెప్ ఉండదు. మ్యాన్యువల్ సెంట్రల్ లాకింగ్ మాత్రమే ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఉండదు. వెనుక వైపు హై-మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది కానీ స్పాయిల్, వైపర్ మరియు వాషర్ ఫీచర్లు ఉండవు.

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, నాలుగు విడోలు కూడా పవర్ విండోస్ రూపంలో ఉంటాయి. డ్రైవర్ సీటుకు ఎత్తు సర్దుబాటు ఫీచర్ ఉండదు. వెనుక ప్యాసింజర్ల కోసం ఏసి వెంట్స్ కూడా ఇందులో ఉండవు. టిల్ట్ స్టీరింగ్, ఎకో మోడ్‌తో కూడిన ఏసి, 12 వోల్ట్ చార్జింగ్ పాయింట్, బేజ్ కలర్ ఇంటీరియర్స్, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లే, బ్లాక్ కలర్ డ్యాష్‌బోర్డ్ మరియు వైనల్ సీట్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బేస్ వేరియంట్ బొలెరో నియోలో ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్క్ అసిస్ట్, సీట్ బెల్ట్ ఆడియో రిమైండర్, స్పీడ్ అలెర్ట్ ఆడియో వార్నింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. కానీ, ఇందులో ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మాత్రం ఉండవు.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 260 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో 50 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో ఎన్4 బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లు

కొలతల పరంగా చూస్తే, మహీంద్రా బొలెరో నియో 3995 మిమీ పొడవును, 1795 మిమీ వెడల్పును మరియు 1817 ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2680 మిమీ మరియు బూట్ స్పేస్ 384 లీటర్లుగా ఉంటుంది. ఇది 2+3+2 సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. అంటే, ముందు వరుసలో ఇద్దరు, మధ్య వరుసలో ముగ్గురు మరియు వెనుక వరుసలో 2 ఇద్దరు ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra Bolero Neo N4 Base Variant Features Explained In Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X