మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

ప్రస్తుతం, భారత ఆటోమొబైల్ పరిశ్రమలో వాహన లీజింగ్ విధానం లేదా సబ్‌స్క్రిప్షన్ విధానం క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు మాత్రమే పరిమితమైన వెహికల్ లీజింగ్ ట్రెండ్ ఇప్పుడు మనదేశంలో కూడా విస్తృతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే, మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ వంటి సంస్థలు లీజింగ్ ప్రక్రియలో తమ కార్లను కస్టమర్లకు అద్దెకు ఇస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కూడా ఈ లీజింగ్ ట్రెండ్ పాపులర్ అవుతోంది.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

తాజాగా, మహీంద్రా గ్రూపుకి చెందిన ఆర్థిక సేవల విభాగం మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (Mahindra & Mahindra Financial Services Ltd) కూడా తమ లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీ ఈ వ్యాపారాన్ని క్విక్లీజ్‌ (Quiklyz) అనే పేరుతో ప్రారంభించింది. క్విక్లీజ్ అనేది వాహనాల లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ కోసం మహీంద్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

నగరాల్లోని వినియోగదారులకు సులభమైన మొబిలిటీ సొల్యూషన్స్ (రవాణా పరిష్కారాలను) ను అందించాలనే ఉద్దేశ్యంలో క్విక్లీజ్ ను ప్రారంభించినట్లు మహీంద్రా పేర్కొంది. ఈ విధానం ద్వారా మహీంద్రా ఎంపిక చేసిన వాహనాలను లీజ్ ప్రాతిపదికన వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. ఆసక్తిగల కస్టమర్లు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా మహీంద్రా వాహనాలను లీజుకు తీసుకోవ్చచు. లీజు గడువు పూర్తయిన తర్వాత కస్టమర్లు ఈ వాహనాలను తిరిగి మహీంద్రాకు ఇచ్చేయవచ్చు లేదా ఆసక్తి ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు కూడా చేయవచ్చు.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

సాధారణంగా వాహనాలను రుణం ద్వారా కొనుగోలు చేయడం అంటే, సదరు వాహన విషయంలో కస్టమర్లు లాంగ్ టెర్మ్ కమిట్‌మెంట్ తీసుకున్నట్లే. అలా కాకుండా, కార్లను కొంత కాలం పాటు మాత్రమే ఉపయోగించుకోవాలనుకునే వారికి, ఈ సబ్‌స్క్రిప్షన్ లేదా లీజింగ్ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది. కస్టమర్లు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా కారు యాజమాన్యం, మెయింటినెన్స్ వంటి అంశాల గురించి చింతించకుండా కారును సొంతం చేసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను ఈ విధానం ద్వారా పొందవచ్చు.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

ఈ సబ్‌స్క్రిప్షన్ లేదా లీజింగ్ విధానం ద్వారా వాహనాలను లీజుకు తీసుకునే కస్టమర్లు డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇందులో ఫుల్ కార్ మెయింటినెన్స్, కంప్లీట్ ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను కంపెనీలు ఆఫర్ చేస్తాయి. కస్టమర్లు ఎంచుకునే సమయాన్ని బట్టి, 24, 36, 48 నెలల మరియు ఆపై కాలపరిమితితో ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

లీజు గడువు పూర్తయిన తర్వాత, కస్టమర్లు కావాలనుకుంటే దానిని పొడిగించడం లేదా వేరే వాహనానికి అప్‌గ్రేడ్ పొందడం చేయవచ్చు లేదా మార్కెట్ ధర వద్ద మిగిలిన మొత్తాన్ని చెల్లించి ఆ వాహనాన్ని ఎప్పటికీ సొంతం కూడా చేసుకోవచ్చు. ప్రారంభ దశలో భాగంగా, మహీంద్రా క్విక్లీజ్ సేవలు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై, నోయిడా, పూణే వంటి మెట్రో నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది నాటికి టైర్-II నగరాలతో సహా భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా ఈ సేవలను విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

మహీంద్రా ఫైనాన్స్ లాభదాయకమైన వ్యాపార నమూనాతో దాని వాటాదారులకు విలువను సృష్టించడానికి మరియు ఈ విభాగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాల నుండి బలమైన బ్యాలెన్స్ షీట్‌ను రూపొందించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపింది. క్విక్లీజ్ అనేది కార్ యూజర్‌షిప్‌ పై మొట్టమొదటి-రకం డిజిటల్ ప్రయాణమని, ఇది కస్టమర్ కార్ యాజమాన్యం యొక్క అన్ని అవసరాలను తీరుస్తూ, ఎలాంటి అవాంతరాలు లేకుండా సరికొత్త కారుకు యాక్సెస్ ని కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

క్విక్లీజ్ తమ సబ్‌స్క్రిప్షన్ సేవలను విస్తరించేందుకు అనేక ఆటోమోటివ్ OEM లతో కూడా చర్చలు జరుపుతోంది మరియు త్వరలోనే లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్‌ పై వారితో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటిస్తుందని మహీంద్రా ఫైనాన్స్ తన ప్రకటనలో తెలిపింది. క్విక్లీజ్ సేవలు కార్పొరేట్ మరియు రిటైల్ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

ఈ సందర్భంగా మహీంద్రా ఫైనాన్స్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ అయ్యర్ మాట్లాడుతూ, "కార్ లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో లాభదాయకమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. మేము ఈ వ్యాపారంలో వచ్చే మూడేళ్ల వ్యవధిలో సుమారు రూ. 10,000 కోట్ల పరిమాణాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. లాస్ట్ మైల్ మొబిలిటీ స్పేస్‌లో ముఖ్యంగా EV (ఎలక్ట్రిక్ వెహికల్) విభాగంలో ఈ వ్యాపారం గణనీయమైన వృద్ధిని చూస్తోంది, మేము కూడా ఈ వ్యాపార మాడ్యూల్ పై దృష్టి సారిస్తున్నాం" అని అన్నారు.

మహీంద్రా కార్లను అద్దెకు తీసుకోండి.. Quiklyz లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ సేవలు ప్రారంభం

భారతదేశంలో లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ మాడ్యూల్ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని, మహీంద్రా ఫైనాన్స్ ఈ విభాగంలో అగ్రగామిగా నిలుస్తుందని మహీంద్రా ఫైనాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రౌల్ రెబెల్లో తెలిపారు. మనదేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టొయోటా మరియు నిస్సాన్ వంటి కార్ కంపెనీలు మరియు ఈబైక్‌గో, రెవోట్రాన్ వంటి టూవీలర్ కంపెనీలు కూడా తమ వాహనాలను లీజింగ్ ప్రాతిపదికన అందిస్తున్నాయి.

Most Read Articles

English summary
Mahindra finance launches quiklyz vehicle leasing and subscription business
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X