రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

మహీంద్రా థార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ థార్ ధరలను భారీగా పెంచింది. వేరియంట్‌ను బట్టి కొత్త మహీంద్రా థార్ ధరలు రూ.20,000 నుండి రూ.40,000 మేర పెరిగాయి.

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

ప్రస్తుతం మహీంద్రా థార్ ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మూడు రకాల టాప్ ఆప్షన్స్ (ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్స్)లో అందుబాటులో ఉంది.

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

తాజా ధరల పెంపు తర్వాత మహీంద్రా థార్ ప్రారంభ ధర రూ.12.10 లక్షలకు పెరిగింది. గత నెలలో ఇది రూ.11.90 లక్షలుగా ఉండేది. అప్పటితో పోల్చుకుంటే ఈ వేరియంట్ ధర రూ.20,000 పెరిగింది.

MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

కాగా, మహీంద్రా థార్ టాప్-ఎండ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.40,000 మేర పెరిగి రూ.14.15 లక్షలకు చేరుకుంది. గతంలో దీని ధర రూ.13.75 లక్షలుగా ఉండేది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అప్‌డేట్ చేయబడిన మహీంద్రా థార్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి:

Variant New Price Old Price
AX (O) Petrol MT CT Rs12,10,337 Rs11,90,000
AX (O) Diesel MT CT Rs12,30,337 Rs12,10,000
AX (O) Diesel MT HT Rs12,40,337 Rs12,20,000
LX Petrol MT HT Rs12,79,337 Rs12,49,000
LX Diesel MT CT Rs13,15,336 Rs12,85,000
LX Diesel MT HT Rs13,25,337 Rs12,95,000
LX Petrol AT CT Rs13,85,337 Rs13,45,000
LX Petrol AT HT Rs13,95,336 Rs13,55,000
LX Diesel AT CT Rs14,05,336 Rs13,65,000
LX Diesel AT HT Rs14,15,338 Rs13,75,000

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ).

CT: కన్వర్టిబుల్‌ టాప్ & HT: హార్డ్ టాప్

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

కొత్త మహీంద్రా థార్‌లో ధరల పెరుగుదల మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. గతేడాది మార్కెట్లో విడుదలైన కొత్త తరం థార్, కొత్త సంవత్సరంలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా కొనసాగుతోంది. స్టైలిషన్ డిజైన్, సరికొత్త ఫీచర్స్ మరియు పవప్‌ఫుల్ ఇంజన్స్‌తో వచ్చిన ఈ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ ఇప్పుడు అనేక మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

మహీంద్రా థార్ ఎస్‌యూవీలోని ఎల్ఎక్స్ వేరియంట్ ప్రీమియం లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉండి, సిటీ ప్రయాణాలకు, రెగ్యులర్ కమ్యూటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే, ఇందులోని ఏఎక్స్ వేరియంట్ ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ఔత్సాహికులను టార్గెట్ చేసేలా ఉంటుంది. అయినప్పటికీ, ఈ రెండు వేరియంట్లు అత్యుత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి.

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

కొత్త మహీంద్రా థార్‌ను సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

ఇందులోని రెండు ఇంజన్ ఆప్షన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కానీ లభిస్తాయి. ఇవి రెండూ షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి.

రూ.40,000 వరకూ పెరిగిన మహీంద్రా థార్ ధరలు; కొత్త ప్రైస్ లిస్ట్

ఇటీవల గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో, కొత్త మహీంద్రా థార్ ఓవరాల్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. వయోజనుల సేఫ్టీ విషయంలో ఇది 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను సాధించగా, పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 41.11 పాయింట్ల స్కోరును సాధించింది.

MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

Most Read Articles

English summary
Mahindra Increased Thar Prices By Up To Rs 40,000; New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X