Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఇటీవలి కాలంలో అద్భుతమైన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. అధునాతన టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ప్రవేశపెడుతున్న వాహనాలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కంపెనీ ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. మార్కెట్లోకి విడుదలైన అతికొద్ది రోజుల్లోనే ఇది 75,000 యూనిట్లకు పైగా బుకింగ్ లను దక్కించుకుంది.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

మహీంద్రా విడుదల చేసిన ఎక్స్‌యూవీ700 తో పాటుగా కంపెనీ అందిస్తున్న చవకైన 7-సీటర్ ఎస్‌యూవీ బొలెరో అమ్మకాలు జోరందుకోవడంతో గడచిన అక్టోబర్ నెలలో మహీంద్రా ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో మహీంద్రా మొత్తం 20,034 యూనిట్లను విక్రయించి, 2.2 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. అమ్మకాల పరంగా, గత అక్టోబర్ నెలలో మహీంద్రా దేశంలో అత్యధికంగా అమ్ముడైన నాల్గవ కార్ బ్రాండ్ గా అవతరించింది.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో వరుసగా మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు టాటా మోటార్స్ కంపెనీలు ఉన్నాయి. మహీంద్రా బొలెరో (Mahindra Bolero) గత అక్టోబర్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మహీంద్రా కారుగా నిలిచింది. గత నెలలో బొలెరో మరియు బొలెరో నియో రెండు మోడళ్లు కలిపి 6,375 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. సరసైన ధర, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం మరియు మెరుగైన ఫీచర్ల కారణంగా ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

మహీంద్రా బొలెరో స్టాండర్డ్ రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో అందించబడుతుంది. ప్రస్తుతం, మార్కెట్లో బొలెరో ఎస్‌యూవీ ధరలు రూ. 8.71 లక్షలు మరియు టాప్ వేరియంట్ ధర రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో B4, B6 మరియు B6 (O) వేరియంట్లు ఉన్నాయి.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ ప్రస్తుతం ఈ విభాగంలో ప్రత్యక్షంగా ఎలాంటి పోటీ లేదు. అయితే, ఇది ఈ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనో కైగర్ వంటి కార్లతో పోటీ పడుతుంది. బొలెరో సిరీస్ మహీంద్రా బొలెరో నియో పేరుతో ఓ కొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. ఇది కంపెనీ గతంలో విక్రయించిన మహీంద్రా టియూవీ300 మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, దాని కన్నా మెరుగైన డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్ పవర్ ను మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ. 8.77 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 10.99 లక్షలుగా ఉంటుంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ధరలు. మహీంద్రా బొలెరో నియో మాదిరిగానే, ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎక్స్‌యూవీ700 కూడా భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లు, అధునాతన ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా, దీని అత్యంత సరసమైన ధర కూడా ఈ మోడల్ అమ్మకాల పెరుగుదలకు కారణమైంది. ఊహించనిరీతిలో ఈ మోడల్ కు బుకింగ్ లు రావడంతో కస్టమర్లు ఇప్పుడు డెలివరీల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు సెమీకండక్టర్ చిప్‌ల కొరత కూడా కంపెనీ వాహనాల వెయిటింగ్ పీరియడ్ ను పెంచే అవకాశం ఉంది.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ అమ్మకాలు పెరగడానికి మరొక దాని సేఫ్టీ రేటింగ్. ఎక్స్‌యూవీ700 కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. పెద్దల సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రత విషయంలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి ఓవరాల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

ఈ క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. అయితే, ఈ కారులో సైడ్ బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు అన్ని సీటింగ్ పొజిషన్‌లలో త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా జోడించడం ద్వారా మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క ఓవరాల్ సేఫ్టీని మరింత మెరుగుపరచవచ్చని టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.

Mahindra Bolero అమ్మకాలు భేష్.. కొత్త మోడల్ రాకతో పెరిగిన సేల్స్..

భారతదేశంలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ ధరలు రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra october 2021 sales report bolero gets the top spot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X