మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, ఎక్స్‌యూవీ700 ('సెవన్ డబల్ ఓ' అని పలకాలి) పేరుతో ఓ కొత్త ఎస్‌యూవీని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇప్పటికే కంపెనీ ఈ మోడల్‌ను తమ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. ఆసక్తి గల కస్టమర్లు అందులో రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

కాగా, తాజా సమాచారం ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ అక్టోబర్ 2021 నాటికి మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది. ఈ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని మహీంద్రా ఎక్స్‌యూవీ500కి ఎగువన, కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా విక్రయించే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా మోడళ్ల నుండి ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్ శైలిని కలిగి ఉంటుందని చెబుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మరియు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ఇది మార్కెట్లోకి రాబోతోంది.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

కంపెనీ ఈ ఎస్‌యూవీని డబ్ల్యూ 601 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనుంది. మహీంద్రాకు ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ అవుతుంది. గతంలో వెల్లడైన స్పై చిత్రాల ప్రకారం, ఈ ఎస్‌యూవీలో మరింత నిటారుగా ఉండే ఫ్రంట్ గ్రిల్, ప్రత్యేకమైన ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన కొత్త సి-ఆకారపు హెడ్‌లైట్స్, కొత్త టెయిల్‌ లైట్స్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, మజిక్యులర్ బోనెట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700లోని డోర్ హ్యాండిల్స్ ఫ్లష్-మౌంటెడ్ లివర్లుగా ఉంటాయి. ఇవి ఎస్‌యూవీకి మరింత ఆధునిక రూపాన్ని జోడిస్తాయి. ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఎస్‌యూవీ విభాగంలో పోటీని తట్టుకొని, కస్టమర్లను తమ వైపుకు ఆకర్షించేందుకు మహీంద్రా ఇందులో అత్యాధునిక కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లను అందించనుంది.

MOST READ:2021 ఏప్రిల్ నెలలో హోండా కంపెనీ విక్రయించిన కార్లు; పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

మెర్సిడెస్ బెంజ్ వంటి హై-ఎండ్ లగ్జరీ కార్లలో కనిపించినట్లుగా, డ్యాష్‌బోర్డుపై ఇందులో డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుందని సమాచారం. ఇందులో ఒక స్క్రీన్‌ను ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగించనుండగా మరొక స్క్రీన్‌ను ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించబడుతుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ యాప్‌తో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి ఇతర యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ వేరియంట్ కోసం హిల్ హోల్డ్ అసిస్ట్, వివిధ డ్రైవ్ మోడ్‌లు మరియు పానోరమిక్ సన్‌రూఫ్, రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్‌లు మొదలైనవి లభ్యం కావచ్చని సమాచారం.

MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. ఇందులో లగ్జరీ మరియు కంఫర్ట్ కోరుకునే వారి కోసం మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో కూడిన 6-సీటర్ వెర్షన్ మరియు ఎక్కువ సీటింగ్ రూమ్ కోరుకునే వారి కోసం మధ్య వరుసలో బెంచ్ సీటుతో కూడిన 7-సీటర్ వెర్షన్ ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీలో కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను అందించే ఆస్కారం ఉంది. ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో కనిపించినట్లుగా, మహీంద్రా ఎక్స్‌యూవీ700లో కూడా లెవల్ - 1 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో డ్రైవర్ అవసరం లేకుండానే కారును కంట్రోల్ చేయవచ్చు మరియు ఆటోమేటిక్‌గా పార్క్ చేయవచ్చు.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

కొలతల పరంగా, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుత ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కన్నా విశాలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరచడానికి కంపెనీ దీని చాస్సిస్‌ను కూడా రీడిజైన్ చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

ఇంకా ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, మూడవ వరుసలో ప్రయాణీకుల సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ మరియు పుష్ బటన్ స్టార్ట్ మొదలైన ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ ఎప్పుడంటే..?

సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్ మొదలైనవి ఉండే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్, టాటా సఫారి మరియు త్వరలో రాబోయే హ్యుందాయ్ అల్కాజర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
All-new Mahindra XUV700 SUV Set To Launch In India By October 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X