Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

Mahindra & Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి. కంపెనీ ఇటీవల Mahindra XUV700 SUV ని విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే కంపెనీ ఇది వరకే ఒలంపిక్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకి కొత్త Mahindra XUV700 SUV ని ప్రకటించారు. అంతే కాకుండా పారాలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన సాధించిన మొదటి మహిళా భారతీయురాలైన 'దీపా మాలిక్' కి కూడా ఆనంద్ మహీంద్రా Mahindra XUV700 ప్రకటించారు.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

అయితే దీపా మాలిక్ తనకు Mahindra XUV700 ఒక ప్రత్యేకమైన సీటుతో కావాలని కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన ఆనంద్ మహింద్ర ఆమె కోసం ఒక స్పెషల్ సీటుతో కొత్త Mahindra XUV700 తయారు చేసారు. ఈ స్పెషల్ సీటు కలిగిన Mahindra XUV700 SUV ఫోటోలను మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతున్నాయి.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

కొన్ని రోజుల క్రితం మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ మరియు MG ని ట్యాగ్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో, కారులోకి సులభంగా ఎక్కడానికి మరియు దిగడానికి వీలుగా సీటును అందించాలని వారు సూచించారు. ఈ విధమైన సౌకర్యం కల్పిస్తే నేను మీ కంపెనీ కారును మాత్రమే కొనుగోలు చేస్తాను. ప్రతిసారీ నేను కారు ఎక్కి దిగడం చాలా కష్టం. దయచేసి ప్రత్యేక సీటింగ్ కెపాసిటీతో కూడిన కారును డిజైన్ చేయాలని ఆమె అభ్యర్థించారు.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

దీపా మాలిక్ అభ్యర్థనకు ప్రతిస్పందనగా, మహీంద్రా తన సరికొత్త XUV 700 SUV లో ప్రత్యేక సీటును ఆఫర్ చేసింది. ప్రత్యేక సీటింగ్ కారును ఉపయోగిస్తున్నప్పుడు దీపా మాలిక్ తీసిన వీడియో మరియు ఫోటోలు ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ప్రసారం అవుతున్నాయి.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

దీపా మాలిక్ విజ్ఞప్తి చేసిన రెండు నెలల తర్వాత మహీంద్రా ఈ ప్రత్యేక సీటింగ్‌ను అందించింది. ఈ ప్రత్యేక సీటు ప్రత్యేక వ్యక్తులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ సీటులో కూర్చున్న తర్వాత వారు తమ సీటును కంట్రోల్ చేయవచ్చు. ఈ సీటుని ఉపయోగించడానికి ఒక ప్రత్యేకమైన రిమోట్ ఉంటుంది. ఈ రిమోట్ ఉపయోగించడం ద్వారా ఈ సీటుని ఉపయోగించుకోవచ్చు.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

మహీంద్రా అండ్ మహీంద్రా తమ XUV 700 SUVని ఆగస్టు 14న భారతదేశంలో ఆవిష్కరించింది. ఈ SUV యొక్క ప్రీ-బుకింగ్ మొదటి రోజు కేవలం 57 నిముషాల సమయంలో 25,000 యూనిట్లు బుకింగ్స్ స్వీకరించబడ్డాయి. ఇది నిజంగా ఒక అరుదైన రికార్డ్. అదే విధంగా రెండవ రోజు రెండు గంటల్లో 25,000 కంటే ఎక్కువ యూనిట్లు బుక్ చేయబడ్డాయి. ఈ SUV కి ఇప్పటివరకు 65,000 బుకింగ్‌లు వచ్చాయి.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

మహీంద్రా XUV 700 SUV పెట్రోల్ మరియు డీజిల్ మోడల్‌లలో అందుబాటులో ఉంది. ఈ SUV పెట్రోల్ మోడల్ డెలివరీ 2021 అక్టోబర్ 30 నుండి ప్రారంభించనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలిపింది. అయితే డీజిల్ మోడల్ డెలివరీలు 2021 నవంబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయి.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

ఈ కారు లాంచ్ చేసినప్పుడు ప్రకటించిన ధరకు మొదటి 25 వేల యూనిట్లు అందించబడతాయి. ఆ తరువాత బూకీ చేసుకున్న కార్లు ఖరీదైనవి అవుతాయి. ఈ SUV 5 సీటర్ మరియు 7 సీటర్ మోడళ్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కొత్త SUV యొక్క 7 సీటర్ మోడల్‌లో 2 + 3 + 2 సీటింగ్ ఉంది. 5 సీట్ల మోడల్ 2 + 3 సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

Mahindra XUV 700 SUVలో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 198 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

Mahindra XUV700 ఇప్పుడు స్పెషల్ సీటుతో.. ఇది వారికి మాత్రమే

మహీంద్రా XUV 700 SUV ఫ్రంట్ ఫాసియా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సి టైప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, సిల్వర్ కోటింగ్‌తో కూడిన ఫ్లక్స్ స్కిడ్ ప్లేట్, 18-ఇంచెస్ డ్యూయల్ టోన్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో అందించబడుతుంది. మహీంద్రా XUV 700 SUVని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో కూడా తీసుకురావడానికి కంపెనీ తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది.

Most Read Articles

English summary
Mahindra research valley design special seat for paralympian details
Story first published: Monday, October 25, 2021, 16:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X