ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ సంస్థగా ఉన్న, మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల ఇండియన్ ఆర్మీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మహీంద్రా డిఫెన్స్ లిమిటెడ్ (ఎండిఎస్ఎల్) ఇండియన్ ఆర్మీకి 1,300 లైట్ స్పెషలిస్ట్ వాహనాలను అందించే ఒప్పందంపై సంతకం చేసింది. వీటి కొనుగోలుకయ్యే మొత్తం ఖర్చు 1,056 కోట్లు.

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

ఈ వాహనాలను ఇండియన్ ఆర్మీకి నాలుగేళ్లలో సరఫరా చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మహీంద్రా యొక్క లైట్ స్పెషలిస్ట్ వాహనాన్ని మహీంద్రా డిఫెన్స్ లిమిటెడ్ స్వదేశంలోనే అభివృద్ధి చేయనున్నట్లు కూడా తెలిసింది.

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

మహీంద్రా లైట్ స్పెషలిస్ట్ వాహనాలను మహీంద్రా డిఫెన్స్ తయారు చేస్తుంది. ఈ వాహనాన్ని ఏ యుద్ధ ప్రాంతంలోనైనా ఉపయోగించవచ్చు. ఇది బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాబట్టి బుల్లెట్ల నుంచి కూడా కాపాడుతుంది. దేశ సరిహద్దు భద్రత మరియు పెట్రోలింగ్ కోసం భారత సైన్యం దీనిని ఉపయోగిస్తుంది.

MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

ఈ వాహనం చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది, అంతే కాకుండా ఇది తేలికైన వాహనం కూడా, ఈ కారణంగా ఈ వాహనాలు నిటారుగా ఉన్న మార్గాలు మరియు కొండలలో సులభంగా నడపవచ్చు. ఈ వాహనం నాలుగు వైపులా బుల్లెట్ ప్రూఫ్ తో కట్టుదిట్టం చేయబడింది. ఇది గ్రనేడ్లు మరియు చిన్న ల్యాండ్ మైన్స్ పేలుళ్లను కూడా తట్టుకునేవిధంగా తయారుచేయబడింది.

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

మహీంద్రా లైట్ స్పెషలిస్ట్ వాహనం ఆధునిక అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వాహనంలో అనేక ఆయుధాలను ఉంచవచ్చు. ఇందులో చిన్న మెషిన్ గన్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్, గ్రనేడ్ లాంచర్ల వంటి అనేక చిన్న ఆయుధాలను అమర్చవచ్చు.

MOST READ:లారా రా బండెక్కు, అవును నీ హెల్మెట్ ఏది?: సచిన్ టెండూల్కర్

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

ఈ ఆర్మీ వాహనం యొక్క ముందు మరియు కిటికీలలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కలిగి ఉంటుంది. ఈ కరంగా ఇది ఏ మాత్రం బుల్లెట్లకు ప్రభావితం కాదు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వాహనాన్ని పూర్తి భద్రతా పరికరాలతో కొనుగోలు చేస్తుంది.

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

ఈ ఒప్పందాలు భారతదేశ రక్షణ పరికరాలలో స్వయం సమృద్ధిని ప్రతిబింబిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ భద్రతా ఒప్పందం స్వావలంబన భారతదేశం మరియు మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఈ వాహనాలు భారత దేశ రక్షణలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని వారు అన్నారు.

MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

మహీంద్రా డిఫెన్స్ ప్రెసిడెంట్ ఎస్పీ శుక్లా మాట్లాడుతూ, ఇది కంపెనీకి చాలా ముఖ్యమైన ఒప్పందం. భారత సైన్యం కోసం దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ వాహనాలను మేము సరఫరా చేస్తుండటం మాకు గర్వకారణంగా ఉంది. మహీంద్రా స్వదేశీ వాహనాల తయారీలో పాలుపంచుకుంటోంది.

కొత్త వాహనాలను అందించడానికి ఇండియన్ ఆర్మీతో ఒప్పందం కుదుర్చుకున్న మహీంద్రా

మహీంద్రా కంపెనీ ఇండియన్ ఆర్మీ కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుకూలీకరించిన సాయుధ వాహనాలను తయారు చేస్తుంది. ఇప్పటికే కంపెనీ భారత సైన్యానికి 4X4 వాహనాలను అందించిన సుదీర్ఘ చరిత్ర ఉంది. సంస్థ అనేక పెద్ద యుద్ధాలలో సైన్యానికి వాహనాలను అందించింది. ఇప్పుడు మరో మారు ఈ అవకాశం లభించింది. కావున దేశ రక్షణ కోసం మా వంతు కూడా బలమైన వాహనాలను తయారుచేసి సకాలంలో అందించడానికి కృషి చేస్తాము.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
Mahindra Signs Deal With Indian Army To Supply 1,300 Light Speciality Vehicles. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X