Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఈ నవంబర్ నెలలో తమ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మహీంద్రా కార్లపై ఆఫర్లను క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, యాక్ససరీలు మరియు కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో పొందవచ్చు. ఈ నెలలో మహీంద్రా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ. 81,500 వరకు ఆదా చేసుకోవచ్చు. మరి ఏయే మోడల్ పై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

తాజా సమాచారం ప్రకారం, మహీంద్రా బొలెరోపై రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు మరియు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వబడుతోంది. అయితే ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన బొలెరో నియోపై మాత్రం ఎటువంటి ఆఫర్ లేదు. ఎమ్‌పివి సెగ్మెంట్ విషయానికి వస్తే, మహీంద్రా విక్రయిస్తున్న మరాజో యొక్క మూడు ట్రిమ్‌లు - M2, M4 ప్లస్ మరియు M6 ప్లస్ లపై కంపెనీ ఈ నెలలో రూ. 20,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,200 కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

మహీంద్రా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 పై కంపెనీ ఈ నెలలో రూ. 15,000 వరకు నగదు తగ్గింపు, రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. ఇదే మోడల్ పై కంపెనీ రూ. 5,000 వరకు ఇతర ఆఫర్‌లను కూడా అందిస్తోంది. మహీంద్రా యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన అల్ట్యూరాస్ జి4 ఎస్‌యూవీపై కంపెనీ ఈ నెలలో అత్యధికంగా ప్రయోజనాలను అందిస్తోంది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

మహీంద్రా అల్ట్యూరాస్ జి4 ఎస్‌యూవీపై రూ. 50,000 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 11,500 వరకు కార్పొరేట్ తగ్గింపు మరియు రూ. 20,000 వరకు ఇతర అదనపు ఆఫర్‌లు ఉన్నాయి. మహీంద్రా ప్రోడక్ట్ లైనప్ లో అత్యంత సరసమైన మోడల్ KUV100 NXT ఎస్‌యూవీపై కంపెనీ రూ. 38,055 వరకు నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఆఫర్ చేస్తోంది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీపై కంపెనీ రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 వరకు కార్పొరేట్ తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్‌లు అన్నీ నవంబర్ 30, 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా, ప్రస్తుత వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది, కాబట్టి ఈ మోడల్ పై ఎలాంటి ఆఫర్లు లేవు. అయితే, డీలర్‌స్థాయిలో స్టాక్ క్లియరెన్స్ లో భాగంగా దీనిపై ఏవైనా ఆఫర్లు లభించే అవకాశం ఉంది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

అలాగే, మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 పై కూడా కంపెనీ ఎలాంటి ఆఫర్లను అందించడం లేదు. ఏ ఆఫర్లు లేనప్పటికీ, ఈ ఎస్‌యూవీ అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ మోడల్ మార్కెట్లో అమ్మకానికి వచ్చి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాకముందే, ఇప్పటికే 70,000 యూనిట్లకు పైగా బుకింగ్ లను దక్కించుకుంది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన అక్టోబర్ 2021 నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 19,286 ప్యాసింజర్ వాహనాలను తయారు చేసింది. అక్టోబర్ 2020 నెలలో తయారు చేసిన 18,931 యూనిట్లతో పోల్చుకుంటే, గత నెలలో మహీంద్రా తమ వాహనాల తయారీలో 1.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అలాగే, సెప్టెంబర్ 2021 నెలలో కంపెనీ తయారు చేసిన 15,220 వాహనాలతో పోలిస్తే, కంపెనీ నెలవారీ వాహన ఉత్పత్తి 26.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కుంటున్న సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్ 2021) మహీంద్రా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో 32,000 యూనిట్ల నష్టాన్ని చవిచూసినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే, మహీంద్రా గ్రూపుకి చెందిన ఆర్థిక సేవల విభాగం మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తాజాగా వెహికల్ లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

మహీంద్రా ఈ వ్యాపారాన్ని క్విక్లీజ్‌ (Quiklyz) అనే పేరుతో ప్రారంభించింది. క్విక్లీజ్ అనేది మహీంద్రా వాహనాల లీజింగ్ మరియు సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్. నగరాల్లో నివసించే వినియోగదారులకు సులభమైన మొబిలిటీ సొల్యూషన్స్ (రవాణా పరిష్కారాలను) ను అందించాలనే ఉద్దేశ్యంలో క్విక్లీజ్ సేవలను ప్రారంభించినట్లు మహీంద్రా పేర్కొంది. ఈ విధానం ద్వారా మహీంద్రా ఎంపిక చేసిన వాహనాలను లీజ్ ప్రాతిపదికన వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది.

Mahindra కార్లపై నవంబర్ 2021 ఆఫర్లు.. మోడల్ వారీగా డిస్కౌంట్ వివరాలు..

ఆసక్తిగల కస్టమర్లు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా మహీంద్రా వాహనాలను లీజుకు తీసుకోవ్చచు. లీజు గడువు పూర్తయిన తర్వాత కస్టమర్లు ఈ వాహనాలను తిరిగి మహీంద్రాకు ఇచ్చేయవచ్చు లేదా ఆసక్తి ఉంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు కూడా చేయవచ్చు. ఈ విధానం ద్వారా వాహనాలను లీజుకు తీసుకునే కస్టమర్లు డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇందులో ఫుల్ కార్ మెయింటినెన్స్, కంప్లీట్ ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను కంపెనీలు ఆఫర్ చేస్తాయి.

Most Read Articles

English summary
Mahindra suv discount and offers november 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X