మహీంద్రా కస్టమర్లకు గుడ్ న్యూస్.. వెహికల్ వారంటీ టైమ్ ఇప్పుడు జులై 31 వరకు

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా అధికంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. అంతే కాకుండా ఎంతోమంది ప్రజలు ఈ కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది.

వెహికల్ వారంటీ టైమ్ ఇప్పుడు జులై 31 వరకు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విధించబడిన కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ కంపెనీలు మరియు డీలర్‌షిప్‌లు మూసివేయబడ్డాయి. ఈ పరిస్థితిలో మహీంద్రా కస్టమర్లు ఇబ్బందిపడకూడదనే ఉదేశ్యంతో మహీంద్రా వారంటీ వ్యవధిని జూలై 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై ఇప్పటికే వారెంటీని పొడిగించాయి. అంతే కాకుండా రోజు రోజుకి ఈ లాక్ డౌన్ వ్యవధి పొడిగిస్తున్న కారణంగా ఈ వారంటీ వ్యవధి కూడా పొడిగిస్తూ ఉంది. ఈ విధంగా పొడిగించడం వల్ల తమ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కంపెనీలు ఈ చర్య తీసుకోవడం ప్రారంభించాయి.

ఇప్పుడు ఇటువంటి కంపెనీల జాబితాలో తన కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ థార్, బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యువి 300, ఎక్స్‌యువి 500 వంటి మోడళ్లతో సహా జూలై వరకు తమ వారంటీని పొడిగిస్తున్నట్లు మహీంద్రా ప్రకటించింది.

మహీంద్రా కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి, టాటా మోటార్స్, ఎంజి మోటార్, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా వారెంటీలను పొడిగిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం కూడా కరోనా విస్తరణ కారణంగా ఇదే విధమైన ప్రకటన చేయబడి దాదాపు వారంటీని 2 నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించింది.

ప్రస్తుతం మరింత కఠినంగా మారుతున్న కరోనా పరిస్థితుల్లో మహీంద్రా కంపెనీ కూడా తమ వంతు సహాయం హేయడానికి ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లో ఆక్సిజన్ ఆన్ వీల్స్ సర్వీస్ ప్రారంభించింది. దీని ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏడు ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయబడతాయి.

Most Read Articles

English summary
Mahindra Extends Warranty On Suv Till July 31. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X