మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్ కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఆరేళ్లలో భారతదేశంలో 9 సరికొత్త ఎస్‌యూవీలను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. వీటిలో 6 ఎస్‌యూవీలు పూర్తిగా ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

మహీంద్రా ఇటీవల తమ 2021 వార్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కంపెనీ దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల కోసం తమ ప్రణాళికను వెల్లడి చేసింది. మహీంద్రా తీసుకురాబోయే కొత్త మోడళ్లలో ఎక్స్‌యూవీ700, డబ్ల్యూ620, వి201, ఎక్స్‌యూవీ300, బోర్న్ ఈవీ1 మరియు బోర్న్ ఈవీ2 మోడళ్లు ఉన్నాయి.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

బోర్న్ ఈవీ1, బోర్న్ ఈవీ2 ఎలక్ట్రిక్ వాహనాలు 2026లో ఎప్పుడైనా విడుదల కావచ్చని సమాచారం. కాగా, మిగిలిన ఎక్స్‌యూవీ700, డబ్ల్యూ620, వి201 మరియు ఎక్స్‌యూవీ300 మోడళ్లు మైల్డ్-హైబ్రిడ్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

ఈ తొమ్మిది కొత్త మోడళ్లలో ముందుగా ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ తమ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది ప్రస్తుత తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్థానాన్ని రీప్లేస్ చేయవచ్చని సమాచారం. ఈ కొత్త ఎస్‌యూవీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు అటానమస్ డ్రైవర్ అసిస్ట్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

మహీంద్రా ఎక్స్‌యూవీ700ను వివిధ రకాల పవర్‌ట్రైన్ ఆప్షన్స్‌తో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో పాటుగా మైల్డ్-హైబ్రిడ్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వంటి ఆప్షన్లు కూడా ఉండొచ్చని అంచనా. ఈ ఇంజన్లన్నీ కూడా మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

మహీంద్రా కేవలం ఈ 9 సరికొత్త మోడళ్లనే కాకుండా, ప్రస్తుతం విక్రయిస్తున్న మోడళ్లకు ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను మరియు నెక్స్ట్ జనరేషన్ మోడళ్లను కూడా విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే, మహీంద్రా ఇప్పుడు ఓ కొత్త తరం స్కార్పియో ఎస్‌యూవీపై కూడా పనిచేస్తోంది.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 మార్కెట్లో విడుదల అయిన తక్షణమే కంపెనీ తమ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ స్కార్పియో ఎస్‌యూవీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది మరియు వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది మార్కెట్లో లాంచ్ కావచ్చని అంచనా. ఈ కొత్త తరం స్కార్పియో ప్రస్తుత మోడల్ కంటే ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

కొత్త తరం మహీంద్రా స్కార్పియో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఈ కారుని పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్, సరికొత్త డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ మరియు ప్రీమియం ఇంటీరియర్స్‌తో తయారు చేస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో ఉపయోగించబోయే ఇంజన్లలో కూడా మార్పులు ఉంటాయని ఆశిస్తున్నారు.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

మహీంద్రా గతేడాది మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం మహీంద్రా థార్‌లో కనిపించినట్లుగానే, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడల్‌ను కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు, 4x4 డ్రైవ్ ఆప్షన్‌తో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

ఇక మహీంద్రా థార్ విషయానికి వస్తే, కంపెనీ ఈ పాపులర్ ఆఫ్-రోడర్‌లో కూడా ఓ 5-డోర్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇది 2023 లో ఎప్పుడైనా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ యొక్క 5-డోర్ల వెర్షన్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో సహా 3-డోర్ వెర్షన్‌లో కనిపించే అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, 5-డోర్ వెర్షన్‌ను కేవలం హార్డ్‌టాప్ రూఫ్‌తోనే విక్రయిస్తారని సమాచారం.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

మహీంద్రా అందిస్తున్న పాపులర్ మరియు చవకైన పెద్ద ఎస్‌యూవీ 'బొలెరో'లో కూడా కంపెనీ ఓ కొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. అప్‌డేటెడ్ బొలెరో 2025 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీని లాడర్-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌లో చేసిన మార్పులతో పాటు పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఇందులో కొత్త ఫీచర్లు మరియు పరికరాలు ఉంటాయని భావిస్తున్నారు.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

ఇక సరికొత్త డబ్ల్యూ620, వి201 మరియు కొత్త అప్‌డేటెడ్ ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లు కూడా 2024 మరియు 2026 మధ్యలో ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఈ ఉత్పత్తులన్నీ బ్రాండ్ యొక్క మోనోకోక్ నిర్మాణ శ్రేణిలో భాగంగా ఉంటాయి. ఇందులో డబ్ల్యూ620 బ్రాండ్ నుండి రాబోయే కొత్త కూప్ స్టైల్ ఎస్‌యూవీ అవుతుందని సమాచారం మరియు దీనిని కొత్త ఎక్స్‌యూవీ700 ఆధారంగా రూపొందించనున్నారు.

మహీంద్రా నుండి 9 కొత్త ఎస్‌యూవీలు; వీటిలో 6 మోడళ్లు ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వెర్షన్లే!

అలాగే, వి201 అనేది కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ కావచ్చు, ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా కంపెనీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్లాన్ చేస్తోంది. ఇకపోతే, చివరిగా బోర్న్ ఈవీ1 మరియు బోర్న్ ఈవీ2 రెండూ కూడా పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలుగా రానున్నాయి.

Most Read Articles

English summary
Mahindra To Launch 9 New SUVs By 2026; 6 Of Them Will Feature Electrification, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X