మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'బొలెరో' లైనప్‌ను కంపెనీ ఇప్పుడు విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో, మహీంద్రా విక్రయించిన టియువి300 ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ బోలోరో నియోగా పేరు మార్చి విక్రయించనున్నట్లు సమాచారం.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

అప్‌గ్రేడ్ చేయబడిన మహీంద్రా బొలెరో నియా (అలియాస్ కొత్త టియూవి300) సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2021 నాటికి ఇది షోరూమ్‌లను చేరుకుంటుందని అంచనా. సరికొత్త స్టైలింగ్, ఆధునిక ఇంటీరియర్స్ మరియు లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ డెవలప్ చేస్తున్నారు.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

ఈ విభాగంలో ప్రస్తుతం మహీంద్రా విక్రయిస్తున్న ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 కన్నా తక్కువ ధరకే ఈ కొత్త మహీంద్రా బొలెరో నియో (టియూవి300 ఫేస్‌లిఫ్ట్) మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీని ధర సుమారు రూ.8.50 లక్షల నుంచి రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని అంచనా.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

ఈ కొత్త మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇప్పటికే ప్రొడక్షన్ రెడీ మోడల్‌గా పరీక్షించారు. ఇది టియువి300 మోడల్ మాదిరిగానే బాక్సీటైప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మహీంద్రా బొలెరో నియోలోని ఫ్రంట్ గ్రిల్‌ను మందపాటి క్రోమ్ స్లాట్స్‌తో రీడిజైన్ చేశారు.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, లో సెట్ ఎయిర్ డ్యామ్‌తో నవీకరించబడిన ఫ్రంట్ బంపర్, కొత్త హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు మరియు ముందు భాగంలో భిన్నంగా రూపొందించిన క్లామ్-షెల్ హుడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

ఎస్‌యూవీ వెనుక భాగంలో కూడా కొన్ని మార్పులు ఉన్నట్లు గతంలో లీకైన స్పై చిత్రాలు ధృవీకరిస్తున్నాయి. కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలో కొత్త రియర్ బంపర్, టెయిల్ లాంప్స్ మరియు టెయిల్ గేట్ మీద స్పేర్-వీల్ కవర్ వంటి మార్పులు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

ఇంటీరియర్స్‌లో ఈ ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అధునాతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కొత్త మహీంద్రా బొలెరో నియోలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసి యూనిట్, కొత్త డాష్‌బోర్డ్ వంటి మరిన్నో మార్పులను ఇందులో ఆశించవచ్చు.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

అంతేకాకుండా, ఇందులో ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫాక్స్ లెదర్ అప్‌హోలెస్ట్రీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, బహుళ ఎయిర్ బ్యాగ్స్ వంటి కంఫర్ట్ మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

ఇక చివరిగా, ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఎటువంటి ఆధునిక మార్పులు చేసే అవకాశం లేదు. కొత్త 2021 మహీంద్రా బొలెరో నియోలో బిఎస్-6 కంప్లైంట్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని మరియు 240 ఎన్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా బొలెరో నియో పేరుతో రానున్న కొత్త టియూవి300 ఫేస్‌లిఫ్ట్!

ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 లాంచ్ అయిన తర్వాత, కంపెనీ ఈ చిన్న ఎస్‌యూవీని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mahindra TUV300 Facelift Is Expected To Be Launched As New Mahindra Bolero Neo, Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X