ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) గత ఆగస్టు నెల ఉత్పత్తి గణాంకాలను విడుదల చేసింది. గత నెలలో, మహీంద్రా మొత్తం 16,417 యూనిట్ల యుటిలిటీ వాహనాలను (UV లు) ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

వార్షికంగా చూసుకుంటే, గడచిన ఆగస్టు 2020 నెలలో కంపెనీ మొత్తం 13,895 యూనిట్ యుటిలిటీ వాహనాలను ఉత్పత్తి చేసింది. దీంతో పోల్చి చూస్తే గత నెలలో వాహనాల ఉత్పత్తి 18 శాతం మేర వార్షిక వృద్ధిని కనబరిచింది. అయితే, గడచిన జూలై 2021 లో మహీంద్రా ఉత్పత్తి చేసిన 22,016 యుటిలిటీ వాహనాలతో పోలిస్తే, గత నెలలో నెలవారీ ప్రాతిపదికన (MoM) కంపెనీ యొక్క యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 25.4 శాతం క్షీణించింది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

Mahindra ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉంది..

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న సెమీకండక్టర్ చిప్ కొరత, ఇప్పుడు మహీంద్రా సంస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తమ కంపెనీ ఇప్పుడు ఈ చిప్ క్రైసిస్ ను ఎదుర్కొంటోందని, ఫలితంగా ఇది సెప్టెంబర్ 2021 నెలలో కూడా వాహనాల ఉత్పత్తిలో 20 నుండి 25 శాతం వరకూ ఉత్పత్తి కోతకు దారితీస్తుందని Mahindra ఇటీవల ప్రకటించింది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

Mahindra వాణిజ్య వాహనాల ఉత్పత్తిలోనూ తగ్గుదల..

కేవలం ప్యాసింజర్ వాహనాలే కాకుండా, కంపెనీ తమ వాణిజ్య వాహనాల ఉత్పత్తిలో కోతను ఎదుర్కుంది. గడచిన ఆగస్టు 2021 నెలలో కంపెనీ తమ వాణిజ్య వాహనాల అమ్మకాలు 14.1 శాతం క్షీణించినట్లు తెలిపింది. ఆగస్టు 2021 లో Mahindra వాణిజ్య వాహనాల ఉత్పత్తి 13,404 యూనిట్లుగా ఉండగా, ఆగస్టు 2020 లో ఇది 15,603 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ నివేదించింది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

గత ఏడాది ఇదే నెలలో (ఆగస్ట్ 2020 లో) ఉత్పత్తి చేసిన 237 యూనిట్‌లతో పోలిస్తే కంపెనీ గత నెలలో (ఆగస్ట్ 2021 లో) 931 యూనిట్ల త్రీ వీలర్స్ మరియు లైట్ కమర్షియల్ వాహనాలను ఉత్పత్తి చేసింది. అయితే, జూలై 2021 లో తయారైన 1,516 యూనిట్లతో పోలిస్తే, నెలవారీ ప్రాతిపదికన కంపెనీ ఈ విభాగంలో 38 శాతానికి పైగా క్షీణతను నమోదు చేసింది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

ఇక ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విషయానికి వస్తే, గత నెలలో (ఆగస్ట్ 2021 లో) మొత్తం 1321 యూనిట్ల ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు ఉత్పత్తి చేయబడ్డాయి. కాగా, ఇదే సంవత్సరం జూలై (2021) నెలలో ఉత్పత్తి చేయబడిన 843 యూనిట్లతో పోల్చితే ఇది ఇది 55.5 శాతం ఎక్కువగా ఉంది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

ఆగస్ట్ 2021లో ఫర్వాలేదనిపించిన మహీంద్రా సేల్స్

Mahindra ఆగస్ట్ 2021 లో మొత్తం 30,585 యూనిట్ల వాహనాలను విక్రయించింది, ఆగస్ట్ 2020 లో విక్రయించిన 30,399 వాహనాలతో పోలిస్తే, ఇవి వార్షిక ప్రాతిపదికన 17 శాతం వృద్ధిని సాధించాయి. Mahindra గత నెలలో మొత్తం 15,786 యూనిట్ల యుటిలిటీ వాహనాలను (UV లు) విక్రయించి 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకు ముందు సంతవ్సరం ఇదే సమయంలో ఇవి 13,407 యూనిట్లుగా ఉన్నాయి.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

ఇక ఎగుమతుల విషయానికి వస్తే, Mahindra గత నెలలో (ఆఘస్ట్ 2021 లో) మొత్తం 3,180 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020 లో) ఎగుమతి చేసిన 1,169 యూనిట్‌లతో పోలిస్తే, కంపెనీ ఎగుమతులు ఏకంగా 172 శాతం పెరిగాయి.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2021 నుండి ఆగస్టు 2021 వరకూ గల అమ్మకాలను చూస్తే, ఈ సమయంలో Mahindra మొత్తం 80,221 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో విక్రయించిన వాహనాల సంఖ్య 36,618 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 119 శాతం పెరిగాయి.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

సెమీకండక్టర్ల కొరతతో వారం రోజుల పాటు Mahindra ప్లాంట్స్ బంద్..

సెమీకండక్టర్ల కొరత Mahindra భారతదేశంలోని తమ ప్లాంట్లలో ఏడు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నెలలో కంపెనీ తమ చాకన్, నాసిక్, కాందివాలి, జహీరాబాద్ మరియు హరిద్వార్‌ నగరాల్లో ఉన్న తయారీ ప్లాంట్లలో ఒక వారం రోజుల పాటు వాహన తయారీని నిలిపివేయనుంది. అయితే, ఈ ఉత్పత్తి అంతరాయం వలన తాము కొత్తగా విడుదల చేయబోయే ఎస్‌యూవీ Mahindra XUV700 పై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ తెలిపింది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

సెమీకండక్టర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న ఇతర ఆటోమొబైల్ కంపెనీలు

సెమీకండక్టర్ల కొరత కారణంగా Mahindra సంస్థే కాదు దేశంలోని ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ Maruti Suzuki కూడా ఉత్పత్తి తగ్గింపుపై సూచనలు ఇచ్చింది. ఇదే కోవలం Tata Motors, Nissan వంటి ఇతర ప్రధాన తయారీదారులు కూడా ఈ చిప్ కొరత సమస్యను ఎదుర్కుంటున్నారు. ఫలితంగా ఆయా సంస్థల కార్ల ఉత్పత్తి కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతోంది.

ఆగస్ట్ నెలలో 26 శాతం తగ్గిన Mahindra కార్ ప్రొడక్షన్, కారణం అదే..

ప్రపంచవ్యాప్తంగా చూస్తే, Ford, General Motors, TOyota, Nissan వంటి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇప్పటికే సెమీకండక్టర్ సంక్షోభం కారణంగా ఉత్పత్తి కోతలను లేదా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

Most Read Articles

English summary
Mahindra utility vehicle production declines 26 percent in august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X