రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ300' ధరలను కంపెనీ భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ మోడల్ ధరలు రూ.39,000 వరకూ పెరిగాయి.

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

అంతేకాకుండా, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్‌లో కంపెనీ కొన్ని ఫీచర్లను కూడా తొలగించింది. ఈ మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది, ఈ రెండు వెర్షన్ల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను ఎక్స్-షోరూమ్ నుండి ఆన్-రోడ్‌కు పోల్చి చూస్తే అవి సుమారు రూ.90,000 వరకు ప్రభావితం చేస్తాయి.

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 వేరియంట్ లైనప్‌లో పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.1000 నుండి రూ.36,000 వరకూ పెరగగా, డీజిల్ వెర్షన్ ధరలు రూ.27,000 నుండి రూ.39,000 వరకూ పెరిగాయి. కంపెనీ ఈ మోడల్ ధరలను పెంచడమే కాకుండా, ఇందులో ఆఫర్ చేసే కొన్ని ఫీచర్లను కూడా తొలగించింది.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

అప్‌డేట్ చేయబడిన మహీంద్రా ఎక్స్‌యూవీ300లో ఇప్పుడు రెండ వరుసలో రెండు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లను మాత్రమే ఉంచింది. అంటే, మిడిల్ ప్యాసింజర్‌కు కేవలం ల్యాప్‌బెల్ట్ మాత్రమే ఉంటుంది. అలాగే, ఇప్పటి వరకూ ఈ కారులో ఆఫర్ చేసిన హీటెడ్ సైడ్ మిర్రర్స్ ఫీచర్‌ను కూడా కంపెనీ తొలగించింది.

Mahndra XUV300 Petrol Variant Prices
Variant New Price Old Price
W4 ₹7.96 Lakh ₹7.95 Lakh
W6 ₹9.70 Lakh ₹9.40 Lakh
W6 AMT ₹10.25 Lakh ₹9.95 Lakh
W8 ₹10.31 Lakh ₹10.00 Lakh
W8 (O) ₹11.47 Lakh ₹11.12 Lakh
W8 (O) AMT ₹12.13 Lakh ₹11.77 Lakh
రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

ధరల సవరణ అనంతరం మహీంద్రా ఎక్స్‌యూవీ300 డబ్ల్యూ 4 పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ధర రూ.7.96 లక్షలు కాగా, డబ్ల్యూ 6 మరియు డబ్ల్యు6 ఏఎమ్‌టి ధరలు వరుసగా రూ.9.70 లక్షలు, రూ .10.25 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Mahndra XUV300 Diesel Variant Prices
Variant New Price Old Price
W4 ₹8.97 Lakh ₹8.70 Lakh
W6 ₹10.00 Lakh ₹10.31 Lakh
W6 AMT ₹10.95 Lakh ₹9.62 Lakh
W8 ₹11.50 Lakh ₹11.15 Lakh
W8 (O) ₹12.27 Lakh ₹11.90 Lakh
W8 (O) AMT ₹12.94 Lakh ₹12.55 Lakh

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

అలాగే, మహీంద్రా ఎక్స్‌యూవీ300 డబ్ల్యూ 8 పెట్రోల్ ఇంజన్ ధర రూ.10.31 లక్షలు, డబ్ల్యూ 8 (ఓ) ధర రూ.11.47 లక్షలు మరియు దాని ఏఎమ్‌టి వేరియంట్‌ ధర రూ.12.13 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

డీజిల్ వేరింట్ల ధరల విషయానికి వస్తే, డబ్ల్యూ 4 ధర రూ.8.97 లక్షలు, డబ్ల్యూ 6 ధర రూ.10.31 లక్షలు, డబ్ల్యూ 6 ఏఎమ్‌టి వేరియంట్ ధర రూ.10.95 లక్షలుగా ఉన్నాయి. అలాగే, డబ్ల్యూ 8 ధర రూ.11.50 లక్షలు, డబ్ల్యూ 8 (ఓ) ధర రూ.12.27 లక్షలు, ఎఎమ్‌టి వేరియంట్‌ ధర రూ.12.94 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

మొత్తంగా చూసుకుంటే, ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ ధరలను రూ.1,000 నుంచి రూ.39,000 మధ్యలో పెంచారు. ఈ కారులో లభించే కొన్ని కీలకమైన ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్ మరియు సైడ్ మిర్రర్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క డబ్ల్యూ 6 వేరియంట్‌లో ఏబిఎస్ విత్ ఇబిడి, 2 ఎయిర్‌బ్యాగులు, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

ఇక ఇంజన్ పరంగా చూసుకుంటే, ఇందులోని 1.5 లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రూ.39,000 మేర పెరిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్టులో మహీంద్రా ఎక్స్‌యూవీ300 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకొని, భారతదేశంలో లభిస్తున్న కార్లలో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఈ క్రాష్ టెస్టులో అడల్ట్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ లభించగా, చైల్డ్ సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్ లభించింది. ఇది గ్లోబల్ ఎన్‌సిఎపి పరీక్షించిన భారత కార్లలోనే అత్యధిక సేఫ్టీ రేటింగ్.

Most Read Articles

English summary
Mahindra XUV300 Price Increased Upto INR 39000, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X