XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ SUV మహీంద్రా ఎక్స్‌యువి700 (Mahindra XUV700) అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ కారణంగానే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 3 గంటల్లోనే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. అయితే ఇప్పటివరకు 70,000 బుకింగ్స్ పొందగలిగింది. అయితే కంపెనీ ఇప్పుడు సెమికండక్టర్ కొరత వల్ల డెలివరీలను కొంత ఆలస్యం చేస్తోంది.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

ఇందులో భాగంగానే మహీంద్రా ఇటీవల XUV700 యొక్క డెలివరీ టైమ్‌లైన్ ను వెల్లడించింది. కంపెనీ తమ వినియోగదారులకు SMS లేదా ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది. మహీంద్రా XUV700 అక్టోబర్‌లో బుక్ చేసుకున్న వారికి 2022 మే నెలలో డెలివరీ చేయనున్నట్లు దీని ద్వారా తెలిసింది.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త కస్టమర్‌లు ఇప్పుడు కనీసం 6 నుంచి 7 నెలలు వేచి ఉండవలసి ఉంటుంది. అయితే ఈ డెలివరీ అనేది ఇంజిన్, వేరియంట్ మరియు కలర్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది. ఫేస్‌బుక్ గ్రూప్‌లో డెలివరీ టైమ్‌లైన్ సమాచారాన్ని షేర్ చేస్తున్నప్పుడు, చాలా మంది కస్టమర్‌లు ఈ SUV ని అక్టోబర్‌లో బుక్ చేసుకున్నారని మరియు డెలివరీ మే 2022లో జరుగుతుందని రాశారు.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

అయితే ఇటీవల బుక్ చేసుకున్న కస్టమర్‌లు జూన్, జూలైలలో డెలివరీ పొందే అవకాశం ఉంటుంది. డీఐ డెలివరీ టైమ్ అత్యధికంగా 2022 ఆగష్టు వరకు ఉటుంది. దీన్ని బట్టి చూస్తే, కొత్త కస్టమర్లు ఈ కొత్త SUV డెలివరీ కోసం దాదాపు 10 నెలల వరకు వేచి ఉండవలసి వస్తుంది.ఇది కస్టమర్లలో చాలా నిరాశను కలిగిస్తుంది.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మహీంద్రా ప్రత్యర్థి అయిన టాటా సఫారీ వంటి SUV లను కస్టమర్లు బుక్ చేసుకుంటున్నారు. మార్కెట్లో మహీంద్రా కంపెనీ మాత్రమే కాకూండా టాటా మోటార్స్ వంటి కంపెనీలు కూడా సెమికండక్టర్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగా డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. కస్టమర్లు దీనిని తప్పకుండా గుర్తించాలి.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో XUV700 యొక్క పెట్రోల్ మోడల్ డెలివరీలు ఇప్పటికే ప్రారంభించింది. అయితే నవంబర్ చివరి నుండి డీజిల్ మోడల్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ SUV యొక్క 700 కంటే ఎక్కువ యూనిట్లు దీపావళి సమయంలో డెలివరీ చేయబడతాయని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా 2022 జనవరి 14 లోపు 14,000 యూనిట్లను డెలివరీ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలిపింది.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

2021 అక్టోబర్ నెలలో కంపెనీ 3,400 యూనిట్ల వాహనాలను డెలివరీ చేసింది. ఈ క్రమంలో నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో కూడా అదే వేగంతో వాహనాలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. కంపెనీ సగటున 3,500 యూనిట్లను డెలివరీ చేయబోతోంది. దీని ప్రకారం, ఇటీవల బుక్ చేసుకున్న వినియోగదారులు XUV700 డెలివెరీ చేసుకోవడానికి ఇప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

మహీంద్రా కంపెనీ తన XUV700 SUV ని రూ. 12.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది. ఇందులో టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. అవి MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

కొత్త మహీంద్రా XUV700 SUV అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

XUV700 డెలివరీ టైమ్‌లైన్ వెల్లడించిన Mahindra: ఇక వారికి డెలివరీ అప్పడే

ఇటీవల మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లను స్కోర్ చేసింది. అలాగే, పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసి మొత్తానికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కైవసం చేసుకుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 delivery timeline revealed waiting period revealed
Story first published: Sunday, November 28, 2021, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X