శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన Mahindra & Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) కంపెనీ యొక్క కొత్త SUV XUV700. ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ గా నిలిచింది. ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్న కారణం ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

కంపెనీ యొక్క ఈ కొత్త SUV కోసం కంపెనీ బుకింగ్స్ ఓపెన్ చేసిన అతి తక్కవ సమయంలోనే దాదాపు 50,000 బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ మార్కెట్లో ఈ SUV కి ఏ స్థాయిలో డిమాండ్ ఉందొ అర్థమవుతుంది. అయితే కంపెనీ ఇప్పటికే ఈ SUV బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ నెల చివరికల్లా డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

మహీంద్రా XUV700 ఉత్పత్తిని కంపెనీ పూర్తి సామర్థ్యంతో ప్రారంభించింది. కంపెనీ యొక్క చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడుతోంది మరియు ఇటీవల ప్లాంట్ యార్డ్‌లో వందలాది యూనిట్లు నిలబడి ఉన్నట్లు తెలుస్తుంది. మహీంద్రా XUV700 కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది కావున ఉత్పత్తి కూడా వేగవంతం చేస్తుంది.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఆటో మొబైల్ రంగం చిప్స్ కొరతను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ ఈ SUV కి ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఉత్పత్తి వేగంగా సాగుతోంది. అయితే, ప్రతి నెలా మహీంద్రా XUV700 యొక్క ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేయబడతాయో అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

XUV700 యొక్క ఉత్పత్తి ప్రతి నెలా 4,000 నుంచి 5,000 యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే ఈ XUV700 కోసం10 నెలల కన్నా ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది, కావున అక్టోబర్ మరియు నవంబర్‌ నెలల్లో కంపెనీలు మరిన్ని అమ్మకాలు సాధించే అవకాశం ఉంటుంది.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

ఇక్కడ మీరు అనేక మహీంద్రా XUV700 లు నిలబడి ఉండటం చూడవచ్చు. అయితే ఇవి ఇంకా డీలర్లకు రవాణా చేయడానికి సిద్ధం కాలేదు. అయితే త్వరలో డీలర్లకు పంపిణీ చేయబడతాయి. XUV700 ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుందని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ లేటెస్ట్ ఫీచర్స్ కోసం ఇందులో ఎక్కువ మొత్తంలో చిప్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో డెలివరీ ఆలస్యం కావచ్చు, కావున వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉండవచ్చు.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, మహీంద్రా యొక్క చకన్ ప్లాంట్‌లో సుమారు 8,000 కార్లు ఉంచబడ్డాయి. మహీంద్రా XUV700 యొక్క పెట్రోల్ మోడల్ డెలివరీలు అక్టోబర్ చివరి వారం నుండి ప్రారంభమవుతాయి, డీజిల్ మోడల్ డెలివరీలు ఒక నెల తరువాత నవంబర్ చివరి వారం నుండి ప్రారంభమవుతాయి. కానీ ఇంకా ఈ తేదీని ప్రకటించలేదు.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పుడు Mahindra XUV700 ప్రారంభ ధర (పెట్రోల్ బేస్ వేరియంట్) రూ .12.49 లక్షలకు పెరిగింది (ఎక్స్-షోరూమ్). అదేవిధంగా డీజిల్ బేస్ వేరియంట్ ధర రూ .12.99 లక్షలకు పెరిగింది (ఎక్స్-షోరూమ్). దీని టాప్ వేరియంట్ AX7 లగ్జరీ డీజిల్ ఆటోమేటిక్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

Mahindra కంపెనీ తన కొత్త XUV700 SUV ని అక్టోబర్ 1 నుండి డీలర్‌షిప్‌లలో వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆసక్తి గల కస్టమర్లు డీలర్‌షిప్‌లను సందర్శించి దీనిని చూడవచ్చు. అంతే కాకుండా XUV700 యొక్క మొదటి దశ టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ 2 నుండి ప్రారంభించబడింది. మీరు బుకింగ్‌కు ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే, మీరు నేరుగా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టెస్ట్ డ్రైవ్‌ అవకాశాన్ని ఎంచుకోవచ్చు.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

శరవేగంగా సాగుతున్న Mahindra XUV700 ఉత్పత్తి.. డెలివరీస్ ఎప్పుడంటే?

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి. ఏది ఏమైనా కంపెనీ యొక్క అన్ని మోడల్స్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.

Source: Team BHP

Most Read Articles

English summary
Mahindra xuv700 production in full capacity delivery details
Story first published: Friday, October 15, 2021, 19:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X