2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

ప్రముఖ దేశీయ యుటిలిటి వాహన తయారీ సంస్థ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) కోసం కంపెనీ నిన్న (అక్టోబర్ 7, 2021న) అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింన సంగతి తెలిసినదే. బుకింగ్స్ ప్రారంభించిన మొదటి గంట వ్యవధిలోనే ఈ మోడల్ కోసం 25,000 బుకింగ్స్ వచ్చాయి.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

రెండవ రోజు కూడా 25,000 బుకింగ్స్..

మొదటి రోజు 25,000 యూనిట్ల బుకింగ్‌లు పూర్తయిన తర్వాత, కంపెనీ తాత్కాలికంగా బుకింగ్‌లను నిలిపివేసింది. కాగా, నేడు (అక్టోబర్ 8, 2021న) కంపెనీ మరోసారి ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఇవాళ బుకింగ్‌లు ప్రారంభించిన 2 గంటల 8 నిమిషాల వ్యవధిలో ఎక్స్‌యూవీ700 మరో 25,000 యూనిట్ల బుకింగ్‌లను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

ఇప్పటి వరకూ మొత్తం 50,000 బుకింగ్స్..

అంటే, ఈ ఎస్‌యూవీ కోసం మొదటి రోజు 1 గంట వ్యవధిలో 25,000 యూనిట్లు మరియు రెండవ రోజు 2 గంటల వ్యవధిలో అదనంగా మరో 25,000 యూనిట్ల బుకింగ్‌లు వచ్చాయి. మొత్తంగా, ఇప్పటి వరకూ ఈ ఎస్‌యూవీ కోసం 50,000 బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. దీన్నిబట్టి చూస్తుంటే, కస్టమర్లు ఈ ఎస్‌యూవీని సొంతం చేసుకోవడానికి ఎంత ఆతృతగా ఉన్నారో ఇట్టే అర్థమైపోతుంది.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

అప్పుడే పెరిగిన Mahindra XUV700 ధరలు..

ఇదిలా ఉంటే, ఈ ఎస్‌యూవీని మొదటిగా బుక్ చేసుకునే 25,000 మంది కస్టమర్లకు మాత్రమే XUV700 యొక్క ప్రారంభ పరిచయ ధరలు (Introductory Price) వర్తిస్తాయని మహీంద్రా ప్రకటించింది. కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క పెట్రోల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 11.99 లక్షలు మరియు డీజిల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 12.49 లక్షల ప్రారంభ పరిచయ ధరతో విడుదల చేసింది. అయితే, ఈ ధరలు మొదటి 25,000 మంది కస్టమర్లకు మాత్రమే వరిస్తాయి.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

కాగా, ఆ తర్వాత నుండి బుక్ చేసుకునే కస్టమర్లకు మాత్రం పెరిగిన ధరలు వర్తిస్తాయి. మహీంద్రా ఇప్పటికే, తమ వెబ్‌సైట్‌లో కొత్త ధరలను కూడా అప్‌డేట్ చేసింది. వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌యూవీ700 యొక్క పెట్రోల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 12.49 లక్షలు మరియు డీజిల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 12.99 లక్షల ప్రారంభ పరిచయ ధరతో లభిస్తున్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

అంటే, మొత్తంగా చూసుకుంటే, ఈ రెండు వెర్షన్లపై గరిష్టంగా రూ. 50,000 వరకూ ధరలు పెరిగాయి. ఈ ధరల పెంపు కేవలం బేస్ (ఎమ్ఎక్స్) వేరియంట్లపై మాత్రమే కాకుండా, ఇతర వేరియంట్లపై కూడా వర్తిస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 లో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి వాటి ధరలు కనిష్టంగా రూ. 10,000 నుండి గరిష్టంగా రూ. 50,000 వరకూ పెరిగాయి.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

తాజా ధరల పెంపు తర్వాత, ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు రూ. 12.49 లక్షల నుండి రూ. 22.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. మరి ఈ వాహనాల డెలివరీ నాటికి మహీంద్రా ఇవే ధరలను కొనసాగిస్తుందో లేక పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ధరలను కూడా మరింత పెంచుతుందో వేచి చూడాలి.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

Mahindra XUV700 డెలివరీ అప్‌డేట్..

ప్రస్తుతానికి మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీల డెలివరీ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అక్టోబర్ 10, 2021 న కంపెనీ ఈ ఎస్‌యూవీ డెలివరీల సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ముందుగా, కంపెనీ పెట్రోల్ వెర్షన్ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను కస్టమర్లకు అందించగలదని, ఆ తర్వాతనే డీజిల్ వెర్షన్ డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

Mahindra XUV700 కోసం 2.6 లక్షల ఎంక్వైరీలు..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ అధికారికంగా ఆవిష్కరించినప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 2.6 లక్షలకు పైగా ఎంక్వైరీలు (విచారణలు) వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఈ ఎంక్వైరీలే చాలా వరకూ వాస్తవ బుకింగ్‌లుగా మారుతున్నాయి. ప్రస్తుతం, కంపెనీ తమ బుకింగ్ ప్రక్రియను మెరుగుపరచడంలో నిమగ్నమై ఉంది. కాబట్టి, ఈ వారం చివరి నాటికి ఎక్స్‌యూవీ700 బుకింగ్‌లు ఒక లక్ష మార్కును దాటే అవకాశం ఉంది.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగే అవకాశం..

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం వస్తున్న బుకింగ్‌లను చూస్తుంటే, ఈ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మహీంద్రా థార్ విషయంలో కూడా ఇలానే జరిగింది. కొత్త తరం థార్ కోసం మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్ రావటంతో, దాని వెయిటింగ్ పీరియడ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికీ థార్ డెలివరీ కోసం కస్టమర్లు నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

2వ రోజు 2 గంటల్లో మరో 25,000 యూనిట్లు.. ఇప్పటి వరకూ 50,000 పైగా బుకింగ్స్!

మరి, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్‌యూవీ700 డిమాండ్ అండ్ సప్లయ్ విషయంలో మహీంద్రా ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచి చూడాలి. ఒకవేళ మీరు కూడా ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయటం పట్ల ఆసక్తిగా ఉన్నట్లయితే, వెంటనే మహీంద్రా డీలర్‌షిప్‌ని కానీ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను కానీ సందర్శించి టోకెన్ అడ్వాన్స్ చెల్లించి క్యూ లైన్‌లో వేచి ఉండండి.

Most Read Articles

English summary
Mahindra xuv700 receives another 25000 bookings on second day in just 2 hours details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X