Just In
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 2 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 2 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
- 16 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
Don't Miss
- News
ప్రోనింగ్ : ఇలా చేస్తే కోవిడ్ పేషెంట్లు తేలిగ్గా శ్వాస తీసుకోవచ్చు... ఎలా చేయాలో తెలుసుకోండి..
- Finance
భారీ నష్టాలతో ప్రారంభమై, లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: బ్యాంక్, మెటల్ జంప్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Lifestyle
వేసవిలో జలుబు ఎందుకు వస్తుంది, కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్‌యూవీ XUV700; వివరాలు
ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో చాలా వాహనాలను విడుదల చేసింది. అయితే ఇప్పుడు మహీంద్రా ఇప్పటివరకు డబ్ల్యూ 601 ఫ్లాట్ ఫామ్ కింద టెస్ట్ చేస్తున్న తన కొత్త ఎస్‌యూవీ గురించి అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌యువి 700 గా విడుదల చేయనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మహీంద్రా నుంచి రానున్న కొత్త వాహనం మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. దీని కోసం అన్ని సన్నాహాలు సిద్ధంగా ఉన్నాయి. మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీని ప్రపంచ మార్కెట్‌లోకి తీసుకువస్తున్న సరి కొత్త ఎస్‌యూవీ అవుతుంది. ఇది పూర్తిగా కొత్తగా ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీలో అనేక లేటెస్ట్ టెక్నాలజీలు, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా మహీంద్రా కంపెనీ యొక్క వాహనాలన్నీ మంచి సాఫ్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కావున కొత్తగా రానున్న ఈ ఎస్‌యూవీ కూడా సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.
MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

మహీంద్రా ఎక్స్‌యువి 700 ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడుతుంది. దీనితో పాటు, ఎక్స్‌యూవీ 700 లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కూడా కంపెనీ ఇస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీని మహారాష్ట్రలోని చకాన్‌లోని ప్లాంట్‌లో కంపెనీ ఉత్పత్తి చేయబోతోంది.
మహీంద్రా కంపెనీ నివేదికల ప్రకారం ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ 2022 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రారంభించబడుతుంది. ఇది మునుపటి తన మోడల్స్ కంటే చాలా వరకు కొత్తగా ఉంటుంది. ఈ విధంగా తయారుచేయడానికి కంపెనీ అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

మహీంద్రా ప్రస్తుతం ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 500 వంటి ఎస్‌యూవీలను వరుసగా కాంపాక్ట్ ఎస్‌యూవీ, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లలో విక్రయిస్తోంది. అటువంటి పరిస్థితిలో, ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ వీటి కంటే పెద్ద మోడల్‌గా ఉంటుందని భావించవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కంపెనీ ప్రీమియం 7 సీటర్ మోడల్‌గా వచ్చే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరంలో ఇది కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుందని చెప్పవచ్చు. ఇది చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండేలాగా మరియు మంచి పర్ఫామెన్స్ అందించే విధంగా తయారుచేయబడుతుంది.

మహీంద్రా ఈ ఏడాది కొత్త తరం ఎక్స్‌యూవీ 500, కొత్త తరం స్కార్పియో వంటి మోడళ్లను తీసుకురానుంది. వీటి తరువాత కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌యువి 700 ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. దీనితో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యువి 700 ఒకసారి ప్రారంభించిన తర్వాత, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు ఎంజి గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?