సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

దేశంలో కెల్లా అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India), గత నెల వాహనాల ఉత్పత్తిలో భారీ క్షీణతను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, కంపెనీ సెప్టెంబర్ 2021లో కార్ల ఉత్పత్తిలో భారీ అంతరాయాన్ని ఎదుర్కుంది. రానున్న మరికొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి సెప్టెంబర్‌ 2021 లో 77,782 ప్యాసింజర్ వాహనాలతో కలిపి మొత్తం 81,278 వాహనాలను ఉత్పత్తి చేసింది. గత సెప్టెంబర్‌ 2020 లో కంపెనీ తయారు చేసిన 1,66,086 యూనిట్లతో పోల్చుకుంటే, గత నెలలో వాహనాల ఉత్పత్తి సుమారు 51 శాతానికి పడిపోయింది. ఇందుకు చిప్స్ కొరతే ప్రధాన కారణమని, కంపెనీ తమ రెగ్యులరేటరీ ఫైలింగ్ లో తెలిపింది.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

మారుతి సుజుకి సంస్థకు చెందిన హర్యానా మరియు గుజరాత్ ప్లాంట్లలో కంపెనీ గత నెలలో కేవలం 40 శాతం వాహన ఉత్పత్తిని మాత్రమే సాధించగలిగింది. దీని కారణంగా వాహనాల అమ్మకాలు కూడా ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. అక్టోబర్ 2021 నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కంపెనీ ఇటీవలే వెల్లడించింది. ఇదే గనుక జరిగితే, మారు సుజుకి కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

సెప్టెంబర్ 2020 లో మినీ విభాగానికి చెందిన ఆల్టో మరియు ఎస్-ప్రెస్సో వాహనాల ఉత్పత్తి 30,492 యూనిట్లు ఉండగా, ఈ సెప్టెంబర్ 2021 లో కేలలం 17,163 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి. అలాగే, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌లో గతేడాది సెప్టెంబర్ లో 90,924 యూనిట్లను చేయగా, గత నెలలో కేవలం 29,272 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి. ఈ విభాగంలో వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో మరియు డిజైర్ వంటి మోడళ్లు ఉన్నాయి.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

యుటిలిటీ వాహనాల విషయానికి వస్తే, ఈ సమయంలో వాటి ఉత్పత్తి 26,648 యూనిట్ల నుండి 21,873 యూనిట్లకు పడిపోయింది. అదే సమయంలో, మారుతి ఈకో వ్యాన్ ఎమ్‌పివి ఉత్పత్తి సెప్టెంబర్ 2020 లో 11,183 యూనిట్లుగా ఉంటే, సెప్టెంబర్ 2021 లో 8,025 యూనిట్లకు తగ్గింది. ఇకపోతే, కంపెనీ విక్రయిస్తున్న సూపర్ క్యారీ ఎల్‌సివి (లైట్ కమర్షియల్ వెహికల్) ఉత్పత్తి కూడా 3,496 యూనిట్లకే పరిమితం అయింది.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

అంతకు ముందు నెలలో చూస్తే, (ఆగస్ట్ 2021 లో) మారుతి సుజుకి మొత్తం 1,13,937 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఆగస్ట్ 2020 తో పోలిస్తే, ఆగస్ట్ 2021లో వాహనాల ఉత్పత్తి 8 శాతం క్షీణతను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, మారుతి సుజుకి అక్టోబర్ 2021 లో నిర్దేశించిన మొత్తం ఉత్పత్తిలో కేవలం 60 శాతాన్ని మాత్రమే సాధించనున్నట్లు తెలిపింది.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

ప్రస్తుతం, మారుతి సుజుకి సంస్థకు భారతదేశంలో మానేసర్, గుర్గావ్ లలో రెండు కార్ల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు ప్లాంట్లు సంవత్సరానికి 1.5 మిలియన్ కార్లను ఉత్పత్తి చేయగలవు. ఇది కాకుండా, గుజరాత్ లోని సుజుకి మోటార్ కంపెనీలో కూడా వాహనాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.50 లక్షల యూనిట్లు. ఇక్కడ తయారైన కార్లు పలు అంతర్జాతీయ మార్కెట్లకు సైతం ఎగుమతి చేయబడుతాయి.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

అధునిక కార్లలో అందిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్ల కారణంగా, వీటి తయారీలో ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్ కి తగినంత సరఫరా లేకపోవడంతో, కార్ల తయారీ సంస్థలు వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటున్నారు. ఈ సమస్య (చిప్ షార్టేజ్) దీర్ఘకాలం పాటు ఉండేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పండుగ సీజన్‌లో మారుతి సుజుకి తక్కువ ఉత్పత్తి కారణంగా, కంపెనీ విక్రయాలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

మారుతి సుజుకి గడచిన సెప్టెంబర్ 2021 నెలలో మొత్తం 66,415 యూనిట్ల వాహనాలను భారత మార్కెట్లో విక్రయించగా, టొయోటా కోసం 2400 యూనిట్లను (గ్లాంజా, అర్బన్ క్రూయిజర్) తయారు చేసింది మరియు ఇదే సమయంలో 17,565 యూనిట్లను భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. చిప్స్ లభ్యతే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్న మారుతి సుజుకి, ఈ పరిస్థితిని నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, అయినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని అంటోంది.

సగానికి తగ్గిన మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్, ఇలా అయితే కష్టమే మరి..!

గత నెలలో మారుతి సుజుకి కార్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, సెప్టెంబర్ 2021 లో కంపెనీ మొత్తం 86,380 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయం (సెప్టెంబర్ 2020 లో) కంపెనీ మొత్తం 160,442 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంతో పోలిస్తే కంపెనీ మొత్తం అమ్మకాలలో 46 శాతం క్షీణత నమోదైంది. అయితే, ప్రస్తుత పండగల సీజన్ కారణంగా కంపెనీకి విక్రయిస్తున్న కొన్ని మోడళ్లకు భారీ బుకింగ్‌లు లభించాయి. మరి వీటిని సకాలంలో కస్టమర్లకు డెలివరీ చేయడంలో కంపెనీ ఎంత మేర సఫలం అవుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Maruti suzuki car production drops 51 percent in september 2021 details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X