వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

కరోనా మహమ్మారి తర్వాత ఏర్పడిన పరిస్థితులు మరియు సెమీకండక్ట్ చిప్ షార్టేజ్ వంటి పలు కారణాల వలన భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా గత కొన్ని నెలలు కార్లను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. అయితే, వచ్చే త్రైమాసికం నాటికి వాహనాల ఉత్పత్తి మెరుగుపడుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. జనవరి-మార్చ్ 2022 త్రైమాసికం నాటికి కంపెనీ పూర్తిస్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేయవచ్చని మారుతి సుజుకి పేర్కొంది.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

మారుతి సుజుకి వాహనాల ఉత్పత్తి పరంగా, గత ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చ్ 2021) మెరుగ్గా ఉంది. ఆ సమయంలో కంపెనీ 4,92,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. కాగా, వచ్చే త్రైమాసికంలో (జనవరి-మార్చ్ 2022లో) దాదాపు 4,70,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సెమీ కండక్టర్ చిప్ సప్లయ్ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న కారణంగా కంపెనీ అమ్మకాలు కూడా మెరుగ్గా ఉంటాయని కంపెనీ భావిస్తోంది.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

చిప్ సరఫరా మెరుగపడటంతో మారుతి సుజుకి రాబోయే త్రైమాసికంలో సుమారు 4,70,000 యూనిట్ల నుండి 4,90,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేసింది. ఇదే గనుక జరిగితే, ఇది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద వార్షిక పెరుగుదల కావచ్చుని నిపుణులు భావిస్తున్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ విక్రయాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఏడాది అమ్మకాలు మెరుగ్గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతకుముందు 2011 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 23.5 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మారుతి సుజుకి 4,92,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పటి వరకూ 2,80,000 బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు కంపెనీ నివేదించింది. ఈ కారణంగా అనేక రకాల మారుతి సుజుకి కార్ల యొక్క వెయిటింగ్ పీరియడ్ సుమారు 3 నుండి 6 నెలల వరకూ ఉంటోంది. రాబోయే పండుగ సీజన్‌లో మారుతి సుజుకి వాహనాలకు డిమాండ్ మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఈ సమయంలో గనుక వాహనాల ఉత్పత్తి తగ్గితే, వాటి వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

వచ్చే త్రైమాసికంలో, మారుతి సుజుకి 85 శాతం నుండి 90 శాతం సామర్థ్యంతో తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిర్వహించే అవకాశం ఉంగి. కానీ, గత ఆగస్టు నుండి నవంబర్ వరకు కంపెనీ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం కోవిడ్-19 సెకండ్ వేవ్ మరియు ఆ తర్వాత ఏర్పడిన సెమీ కండక్టర్ చిప్ కొరతగా చెప్పుకోవచ్చు. కోవిడ్ వలన మరో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, మెటీరియల్‌ని తీసుకురావడానికి మరియు అదే సమయంలో సురక్షితంగా ఉండటానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని కంపెనీ తన విక్రేతలను కోరింది.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

ప్రస్తుతం, భారతదేశంలో ఒమైక్రాన్ వేరియంట్ చాప క్రింద నీరులా ప్రవహిస్తోంది. ఫిబ్రవరి 2022 నాటికి ఇది తీవ్రరూపం దాల్చవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే మార్కెట్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరంలో 8 నెలల వ్యవధిలో ఇప్పటివరకు 10.2 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. అంటే, కంపెనీ సగటున నెలకు 1,26,000 వాహనాలను ఉత్పత్తి చేసింది. అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో కలిపి కంపెనీ 2,80,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. కాగా, డిసెంబర్ 2021 నెలలో సుమారు 1,50,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తోంది. మరి కంపెనీ ఎంతమేర ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తుందో చూడాలి.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

నవంబర్ 2021లో మారుతి సుజుకి కార్ ప్రొడక్షన్

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి గడచిన నవంబర్ నెలలో 1,45,560 యూనిట్ల వాహనాలను తయారు చేసింది. నవంబర్ 2020లో ఉత్పత్తి చేయబడిన 1,50,221 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ 3 శాతం వార్షిక క్షీణతను నమోదు చేసింది. అయితే, అక్టోబర్ 2021లో ఉత్పత్తి చేయబడిన 1,34,779 వాహనాలతో పోలిస్తే మాత్రం కంపెనీ 8 శాతం నెలవారీ వృద్ధిని నమోదు చేసింది.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

ఈ సమయంలో ఆల్టో మరియు ఎస్-ప్రెస్సో వంటి మినీ హ్యాచ్‌బ్యాక్‌ల ఉత్పత్తి 19,810 యూనిట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేయబడిన 24,336 యూనిట్ల కంటే 18.5 శాతం తక్కువ. అదే సమయంలో వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో మరియు ఇగ్నిస్ వంటి ఇతర కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి గత నెలలో 74,283 యూనిట్లుగా ఉంది. ఇది నవంబర్ 2020లో తయారు చేసిన 85,118 యూనిట్లతో పోలిస్తే 14.5 శాతం క్షీణించింది.

వచ్చే త్రైమాసికం నాటికి మెరుగుపడనున్న కార్ల ఉత్పత్తి: Maruti Suzuki

గత నెలలో మారుతి సుజుకి సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ ఉత్పత్తి 2,453 యూనిట్లుగా ఉంది, ఇది ఒక సంవత్సరం క్రితం ఇదే సమయంలో తయారు చేయబడిన 1,192 యూనిట్లతో పోలిస్తే 51.4 శాతం పెరిగింది. ఇది కాకుండా, ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు ఎక్స్‌ఎల్ 6 వంటి యుటిలిటీ వాహనాల (యువి) ఉత్పత్తి కూడా 43.9 శాతం వృద్ధితో 35,590 యూనిట్లకు చేరుకుంది. గత నెలలో, కంపెనీ 9,889 యూనిట్ల ఈకో వ్యాన్‌లను తయారు చేసింది, ఇది నవంబర్ 2020లో తయారు చేసిన 11,212 యూనిట్లతో పోలిస్తే 13 శాతం క్షీణించింది.

Most Read Articles

English summary
Maruti suzuki car production to improve by next quarter details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X