ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లను టొయోటా ఇప్పటి వరకూ రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తుండగా, ఇప్పుడు టొయోటా కార్లను మారుతి సుజుకి రీబ్యాడ్జ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రెండు ఇండో-జపాన్ కంపెనీల మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందంలో భాగంగా, ఇరు కంపెనీలు ఒకరికి చెందిన ఉత్పత్తులను మరొకరు ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్) రూపంలో వాహనాలను కొనుగోలు చేసి, బాడీ ప్యానెళ్లను మరియు కొద్దిపాటి ఫీచర్లను మార్చి రీబ్యాడ్జ్ చేసి విక్రయించే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

ఈ విధానం ద్వారా టొయోటా (Toyota) ఇప్పటికే మారుతి సుజుకి నుండి బాలెనో మరియు విటారా బ్రెజ్జా వాహనాలను కొనుగోలు చేసి వాటిని గ్లాంజా మరియు అర్బన్ క్రూయిజర్ పేర్లతో విక్రయిస్తోంది. భవిష్యత్తులో సియాజ్ ఆధారంగా బెల్టా మరియు ఎర్టిగా ఎమ్‌పివి ఆధారంగా ఓ టొయోటా బడ్జెట్ ఎమ్‌పివిలు కూడా రీబ్యాడ్జ్ వెర్షన్లుగా భారత మార్కెట్లోకి రావచ్చని సమాచారం. ఇదిలా ఉంటే, ఇప్పుడు మారుతి సుజుకి కూడా ఇదే కోవలో, టొయోటా నుండి ఓ ఎస్‌యూవీని కొనుగోలు చేసి, దానిని రీబ్యాడ్జ్ చేసి భారత మార్కెట్లో విక్రయించనున్నట్లు వినికిడి.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

నిజానికి, మారుతి సుజుకి సంస్థకు ఎస్‌యూవీ విభాగంలో విటారా బ్రెజ్జా మినాహా వేరే ఏ ఇతర మోడల్ అందుబాటులో లేదు. ఈ కంపెనీ పూర్తిగా డీజిల్ కార్లను నిలిపివేయడంతో విటారా బ్రెజ్జా ప్రస్తుతం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది. దీంతో మారుతి సుజుకి నుండి ఓ మంచి ఎస్‌యూవీ కోసం చూసే కస్టమర్లకు విటారా బ్రెజ్జా తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఫలితంగా, మారుతి సుజుకి భారత ఎస్‌యూవీ విభాగంలో పట్టును సాధించలేకపోతోంది.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

మారుతి సుజుకి చిన్న కార్ల విషయంలో కస్టమర్ల నుండి లభిస్తున్న స్పందన, కంపెనీ ఎస్‌యూవీ విషయంలో కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో భారత ఎస్‌యూవీ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఈ విభాగంలో ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా అగ్రగామిగా ఉంటే, ఆ తర్వాతి స్థానాల్లో కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి పలు ఇతర మోడళ్లు ఉన్నాయి.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల తయారీలో అగ్రగామిగా పరిగణించబడుతున్న మారుతి సుజుకి ఇప్పుడు మరింత ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్‌లో ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో తన వాటాను పెంచుకోవాలని యోచిస్తోంది. భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్‌లకు ధీటుగా కొత్త మోడల్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఈ విభాగంలో ఓ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని చూస్తోంది.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

అయితే, మారుతి సుజుకి ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని పూర్తిగా మొదటి దశ నుంచి తయారు చేయాలంటే, కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. అందుకే, తెలివిగా టొయోటాతో ఉన్న ఒప్పందంలో భాగంగా, మారుతి సుజుకి ఆ కంపెనీ నుండి ఓ ఎస్‌యూవీని కొనుగోలు చేయటం లేదా దాని అభివృద్ధిలో టొయోటా సహకారం తీసుకోవటం ద్వారా వీలైనంత త్వరలోనే ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

ఆ నివేదిక ప్రకారం, మారుతి సుజుకి భారతదేశంలో తన కొత్త మోడళ్ల తయారీ లేదా అభివృద్ధి కోసం టొయోటాతో చేతులు కలపవచ్చని తెలుస్తోంది. మారుతి సుజుకి యొక్క తదుపరి పెద్ద ప్రకటన ఈ రెండు కార్ల తయారీదారులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎస్‌యూవీ కావచ్చు. కేవలం మారుతి సుజుకి మాత్రమే అదే మిడ్-సైజ్ ఎస్‌యూవీ టొయోటా కూడా భారతదేశంలో విక్రయించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ కొత్త ఎస్‌యూవీ ఈ విభాగంలో ఇరు కంపెనీలకు ఖచ్చితంగా కొత్త అవకాశాలను అందించవచ్చు.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

మారుతి సుజుకి మాదిరిగానే టొయోటాకు కూడా మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఎలాంటి ఉత్పత్తి లేదు. ప్రస్తుతం, కొరియన్ కార్ బ్రాండ్లు ఆదిపత్యం చెలాయించే మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను సంగ్రహించడానికి టొయోటా మరియు మారుతి సుజుకి సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా, టొయోటా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా విక్రయిస్తున్న ఆర్ఏవి4 (RAV4) మిడ్-సైజ్ ఎస్‌యూవీని భారతదేశంలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

ఈ నేపథ్యంలో, మారుతి తన కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేయడానికి ఈ టొయోటా RAV4 బేస్ కావచ్చని తెలుస్తోంది. మారుతి యొక్క జపనీస్ భాగస్వామి అయిన సుజుకి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లలో 'అక్రాస్' (Suzuki Across) అనే చిన్న ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఇది ఎక్కువగా టొయోటా ఆర్ఏవి4 ఎస్‌యూవీపై ఆధారపడి ఉంటుంది. మారుతి మరియు టొయోటా సంస్థలు కూడా అదే మోడల్‌ను అనుసరించి త్వరలో భారతదేశం కోసం తయారు చేయబడిన కొత్త ఎస్‌యూవీని పరిచయం చేసే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ టొయోటా కాపీ కొట్టింది.. ఇప్పుడు మారుతి సుజుకి వంతు..!!

ప్రస్తుతానికి, మారుతి సుజుకి కానీ లేదా టొయోటా సంస్థ కానీ ఈ కొత్త ఎస్‌యూవీ లాంచ్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఈ కొత్త ఎస్‌యూవీ మార్కెట్లోకి రావడానికి సుమారు మరో ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్, ప్రయాణ ఆంక్షలు మరియు సెమీకండక్టర్ చిప్స్ లభ్యత వంటి అనేక అంశాలు కూడా ఈ కొత్త ఉత్పత్తిని ప్రభావితం చేసే పరిస్థితి ఉంది.

Most Read Articles

English summary
Maruti suzuki may bring toyota rebadged compact suv in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X