కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

2021 సెప్టెంబర్ నెల ముగిసింది. ఈ నేపథ్యంలో ఆటో పరిశ్రమలోని దాదాపు అన్ని కంపెనీలు తమ సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు అతి పెద్ద వాహన తయారీ సంస్థ Maruti Suzuki (మారుతి సుజుకి) కూడా సెప్టెంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

Maruti Suzuki (మారుతి సుజుకి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 2021 లో మొత్తం 86,380 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం కంపెనీ ఇదే నెలలో మొత్తం 1,60,442 యూనిట్లు విక్రయించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు మునుపటికంటే కూడా 46% తగ్గుదలను నమోదు చేసింది.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

భారతదేశంలో పండుగ సీజన్ మొదలైంది, కావున ప్రస్తుతం కంపెనీ మంచి బుకింగ్స్ పొందే అవకాశం ఉంటుంది. కావున ఈ నెలలో మంచి అమ్మకాలను నమోదు చేసి ముందుకు సాగుతుందని భావిస్తున్నాము.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

Maruti Suzuki (మారుతి సుజుకి) యొక్క మొత్తం అమ్మకాల విషయానికి వస్తే, 2021 సెప్టెంబర్ నెలలో 66,415 యూనిట్ల వాహనాలను భారత మార్కెట్లో విక్రయించగా, 17,565 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. ఎక్కువ వాహనాలను తాయారు చేయకపోవడానికి భారత మార్కెట్లో చిప్స్ కొరత ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని కంపెనీ తెలిపింది.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

కంపెనీ యొక్క ఉత్పత్తి తగ్గినప్పటికీ, అమ్మకాలు మాత్రం సెప్టెంబర్ నెలలో బారీగ్గా తగ్గుదలను నమోదు చేశాయి. అయితే కంపెనీ నివేదికల ప్రకారం ఎక్కువా సంఖ్యలో బుకింగ్లను స్వీకరిస్తుంది, కానీ మిలియన్ల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రపంచమంతా సెమీకండక్టర్ల కొరతతో కొట్టుమిట్టాడుతోంది, ఈ కారణంగా ఆధునిక కార్ల ఉత్పత్తిలో మరియు విక్రయాలలో క్షీణత ఏర్పడింది. ఈ సమస్య మరిన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఇది త్వరలో పరిష్కరించబడే సూచన కనిపించడం లేదు.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

Maruti Suzuki అమ్మకాలలో అందులోనూ మినీ సెగ్మెంట్లో 14,396 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు, కాంపాక్ట్ సెగ్మెంట్‌లో 20,891 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో కాంపాక్ట్ సెగ్మెంట్‌ అమ్మకాలు 298,246 యూనిట్లుగా ఉన్నాయి. నెలవారీ అమ్మకాలలో ఈ విభాగం ఎక్కువగా ప్రభావితమైందని కంపెనీ స్పష్టం చేసింది.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

Maruti Suzuki యొక్క మిడ్ సైజ్ విభాగంలో కేవలం 981 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఈ సమత్సరం మొదటి అర్ధభాగంలో ఈతి అమ్మకాలు 7095 యూనిట్లు. అదే సమయంలో యుటిలిటీ వాహనాల విషయానికి వస్తే, సెప్టెంబర్ నెలలో 18,459 యూనిట్లు విక్రయించబడ్డాయి.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

Maruti Suzuki యొక్క వ్యాన్ విభాగంలో, Maruti Eco అమ్మకాలు 7844 యూనిట్లు. గత ఆరు నెలల్లో Maruti Eco యొక్క మొత్తం అమ్మకాలు 50,350 యూనిట్లు. ఇక LCV విభాగంలో 3304 యూనిట్ల వాహనాలు విక్రయించబడ్డాయి. మొత్తానికి ఈ నెలలో కంపెనీ చాలా తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

Maruti Suzuki యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ మొత్తం 17,565 యూనిట్లు ఎగుమతి చేసినట్లు తెలిపింది. అయితే కంపెనీ 2021 అక్టోబర్‌లో 1,60,000 నుండి 1,80,000 కార్లు మరియు SUV ల ఉత్పత్తికి సిద్ధంగా ఉండాలని దాని కాంపోనెంట్స్ సప్లయర్‌లను కోరడంతో, వచ్చే నెలలో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నాము.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

మారుతి సుజుకి బహుళ మార్గాల ద్వారా చిప్స్ సరఫరాను భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తోంది. చిప్స్ సరఫరా పూర్తయితే మరియు మారుతి సుజుకి సరఫరాదారుల లక్ష్యం నెరవేరితే, అక్టోబర్ నెలలో ఉత్పత్తి సెప్టెంబర్ కంటే 60 నుండి 80 శాతం ఎక్కువగా ఉండవచ్చని యోచిస్తున్నారు.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

భారతదేశంలోని ప్రతి రెండు ప్యాసింజర్ వాహనాలలో ఒకదాన్ని విక్రయించే దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ నెలలో ఉత్పత్తిని 1,00,000 యూనిట్లకు పరిమితం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సెమీకండక్టర్ల కొరత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉంది. ఈ కొరత వాహన ఉత్పతులను దాదాపు తగ్గిస్తోంది.

కలిసిరాని సెప్టెంబర్; భారీగా తగ్గిన Maruti Suzuki అమ్మకాలు.. కారణం ఇదే?

భారతదేశంలో చిప్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం వల్ల, బుకింగ్స్ వచ్చినప్పటికీ ఆ స్థాయిలో వాహనాలను విక్రయించలేకపోయింది. ప్రస్తుతం పండుగ సీజన్ కారణంగా Maruti Suzuki లక్షల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ చిప్స్ కొరత ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది, కావున ఇకపై కూడా ఎలాంటి అమ్మకాలను నమోదు చేయగలుగుతుంది, అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki car sales september 86380 units magnite details
Story first published: Friday, October 1, 2021, 15:57 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X