Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) అందిస్తున్న చిన్న కార్లలో సెలెరియో (Celerio) చాలా ప్రత్యేకమైనది. చూడటానికి చాలా ప్రీమియంగా కనిపించే ఈ చిన్న కారు ధరకు తగిన విలువను కలగి ఉంటుంది. ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

నిజానికి భారత మార్కెట్‌కు ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వ్యవస్థను పరిచయం చేసిన మొదటి కార్లలో సెలెరియో కూడా ఒకటి. ప్రస్తుతం Maruti Celerio మూడు ట్రిమ్ లలో మొత్తం 12 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో 6 మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుండగా 4 ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో లభిస్తున్నాయి. మిగిలిన 2 వేరియంట్లు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ తో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో లభిస్తున్నాయి.

Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

ఒకవేళ మీరు మారుతి సెలెరియోలో బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ (LXi) ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, సదరు వేరియంట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి. Maruti Celerio LXi బేస్ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ యొక్క ధర, లభించే ఫీచర్లు, ఇంటీరియర్ డీటేల్స్, ఎక్స్‌టీరియర్ హైలైట్స్, ఇంజన్ స్పెసిఫికేషన్స్, కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ మరియు మైలేజ్ వంటి వివరాలు ఇలా ఉన్నాయి:

Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

Maruti Celerio LXi ధరలు:

  • Maruti Celerio LXi పెట్రోల్ - రూ. 4.65 లక్షలు
  • Maruti Celerio LXi (O) పెట్రోల్ - రూ. 4.71 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఈ రెండు వేరియంట్లు కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో మాత్రమే లభిస్తాయని గమనించండి.)

    Maruti Celerio LXi ఫీచర్లు:

    • బాడీ కలర్ లో ఉండ్ బంపర్స్
    • బాడీ కలర్ డోర్ గార్నిష్
    • వీల్ కవర్స్ కోసం సెంటర్ క్యాప్
    • 5 స్థానాల్లో బాటిల్ హోల్డర్లు
    • ఎయిర్ కండీషనర్ (ఏసి)
    • పవర్ స్టీరింగ్
    • Maruti Celerio LXi సేఫ్టీ ఫీచర్లు:

      • డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్
      • సీట్ బెల్ట్ రిమైండర్ (డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్)
      • ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
      • ఇంజన్ ఇమ్మొబిలైజర్
      • వెనుక తలుపులపై చైల్డ్ ప్రూఫ్ లాక్
      • హై స్పీడ్ అలెర్ట్ సిస్టమ్
      • రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
      • పాదచారుల భద్రత
      • Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

        Maruti Celerio LXi ఇంజన్ స్పెక్స్:

        మారుతి సుజుకి సెలెరియో లోని అన్ని వేరియంట్లు కూడా ఒకేరకమైన పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తాయి. ఇందులోని 998 సిసి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్‌ను మరియు 90 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, Celerio LXi వేరియంట్ కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది.

        Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

        అలాగే, ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ తో కూడిన సిఎన్‌జి వెర్షన్ కావాలనుకుంటే అది కేవలం రెండు వేరియంట్లలో విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ (ఆప్షనల్) మాత్రమే లభిస్తుంది. సిఎన్‌జి వెర్షన్‌లోని అదే ఇంజన్ 59 బిహెచ్‌పి పవర్‌ను మరియు 78 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ లో ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారు మాత్రం విఎక్స్ఐ లేదా జెడ్స్ఎక్స్ఐ (VXi or ZXi) వేరియంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

        Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

        Maruti Celerio LXi మైలేజ్:

        ఇక మైలేజ్ విషయానికి వస్తే, మారుతి సుజుకి (Maruti Suzuki Celerio) హ్యాచ్‌బ్యాక్ యొక్క పెట్రోల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరు పెట్రోల్‌కు గరిష్టంగా 21.63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. అలాగే, ఎస్-ఎన్‌జి టెక్నాలజీతో కూడిన సిఎన్‌జి వెర్షన్ సెలెరియో కేజీకి 30.47 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 35 లీటర్లు మరియు సిఎన్‌జి వెర్షన్ సిలిండర్ సామర్థ్యం 60 లీటర్లుగా ఉంటుంది.

        Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

        Maruti Celerio LXi కలర్ ఆప్షన్స్:

        ఈ వేరియంట్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది, వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

        • ఆర్కిటిక్ వైట్
        • సిల్కీ సిల్వర్
        • గ్లిస్టెనింగ్ గ్రే
        • బ్లేజింగ్ రెడ్
        • టార్క్ బ్లూ
        • టాంగో ఆరెంజ్
        • Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

          Maruti Celerio LXi వీల్స్, బ్రేక్స్, సైజ్

          ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క అన్ని వేరియంట్లు 155/80R13 ప్రొఫైల్ తో కూడిన వీల్స్ మరియు ట్యూబ్‌లెస్ టైర్స్ తో వస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్‌ లలో ముందు వైపు డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. సెలెరియో పొడవు 3695 మిమీ, వెడల్పు 1600 మిమీ, ఎత్తు 1560 మిమీ మరియు వీల్‌బేస్ 2425 మిమీ ఉంటుంది. ఇందులో 235 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

          Maruti Celerio LXi వేరియంట్ కొనేముందు ఇది చదవడం మర్చిపోకండి..

          డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

          ఇదివరకు చెప్పుకున్నట్లుగా Maruti Celerio కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి ఏఎమ్‌టి ఆటోమేటిక్ కారు. అయితే, దీని బేస్ వేరియంట్లో అన్ని ఫీచర్లు అందుబాటులో లేవు. బేస్ వేరియంట్ కన్నా కాస్తంత మెరుగైన ఫీచర్లు కావాలనుకునే వారు LXi వేరియంట్‌కు బదులుగా మిడ్ VXi వేరియంట్ లేదా టాప్ ZXi వేరియంట్లను ఎంచుకోవడం మంచిదనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Maruti suzuki celerio lxi base variant details price specs features mileage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X