మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న ఈకో వ్యాన్ యొక్క అంబులెన్స్ వెర్షన్ ధరలను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ మోడల్‌పై ఇప్పుడు గరిష్టంగా రూ.88,000 తగ్గింపు లభిస్తుంది.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

ధరల తగ్గింపు తర్వాత ఈ మోడల్ ఇప్పుడు రూ.6.16 లక్షల (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. అంబులెన్సులపై సవరించిన జిఎస్‌టి రేట్లే ఇందుకు ప్రధాన కారణం. ఇదివరకు అంబులెన్సులపై జిఎస్‌టి 28 శాతం ఉండగా, ఇప్పుడు దానిని 12 శాతానికి తగ్గించారు.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

అయితే, గమనించాల్సిన విషయం ఏంటంటే, తగ్గిన జిఎస్‌టి రేట్ల ఉపశమనం కేవలం సెప్టెంబర్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

తాజా ధరల సవరణ అనంతరం, మారుతి సుజుకి ఈకో అంబులెన్స్ ధర రూ.6.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అంతకు ముందు దీని ధర రూ.7.04 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లో రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా మారుతి సుజుకి ఈ విషయాన్ని వెల్లడించింది.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి పేర్కొన్న సమాచారం ప్రకారం "ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 05/2021 ప్రకారం, ఈకో అంబులెన్సులపై జిఎస్‌టి రేటు సెప్టెంబర్ 30, 2021 వరకు 28 శాతం నుండి 12 శాతానికి తగ్గించబడింది.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

దీని ప్రకారం, ఈకో అంబులెన్స్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో తగ్గింపు ఉంటుంది మరియు ఢిల్లీలో వర్తించే సవరించిన ఎక్స్-షోరూమ్ ధర రూ.6,16,875 అవుతుంది" అని పేర్కొంది.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

జూన్ 21, 2021 నుండి అమల్లోకి వచ్చే విధంగా డీలర్లకు ఇన్వాయిస్ చేసిన వాహనాలతో పాటు డీలర్‌షిప్‌ల ద్వారా ఇన్వాయిస్ చేయబడిన వాహనాలకు కూడా ఈ ధరల మార్పు వర్తిస్తుందని బిఎస్‌ఇ ఫైలింగ్‌లో మారుతి సుజుకి తెలిపింది.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

జూన్ 14న మారుతి ఇకో అంబులెన్స్ బుక్ చేసుకున్న వినియోగదారులకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక మారుతి సుజుకి ఈకో అంబులెన్స్ విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ ఈకో వ్యాన్‌లో లభించే అదే 1.2-లీటర్, ఫోర్ సిలిండర్ల ఇంజన్ ఉంటుంది.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి ఈకో అంబులెన్స్‌పై రూ.88,000 తగ్గింపు; కారణమేంటంటే..?

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 44వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో, కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ సమావేశంలో వివిధ రకాల మందులు, కోవిడ్ టెస్టింగ్ కిట్లు, మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు మరియు బై-పాప్ యంత్రాలతో సహా కోవిడ్-19 రిలీఫ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఉపయోగిస్తున్న నిర్దిష్ట వస్తువులపై జిఎస్‌టి రేట్లను ఈ కౌన్సిల్ తగ్గించింది.

Most Read Articles

English summary
Maruti Suzuki Eeco Ambulance Price Dropped After Government Reduces GST. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X