Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 20 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి కస్టమర్లకు షాక్.. రూ.34,000 మేర పెరిగిన ధరలు..
భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ మార్కెట్లో తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.5000 నుండి రూ.34,000 మేర పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

కాగా, మారుతి సుజుకి బ్రాండ్ నుండి ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా వంటి పాపులర్ మోడళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇందులో మారుతి టూర్ ఎస్ అత్యల్పంగా రూ.5,061 ధరల పెరుగుదలను అందుకుంది.

మారుతి సుజుకి అరేనా షోరూమ్ నుండి విక్రయించబడుతున్న స్మాల్ కార్ ఎస్-ప్రెస్సో ధరను రూ.7000 మేర పెంచారు. కాగా, ఈ జాబితాలో అత్యధికంగా మారుతి సుజుకి స్విఫ్ట్ రూ.30,000 మరియు మారుతి సుజుకి ఎర్టిగా రూ.34,000 మేర ధరల పెంపును అందుకుంది.
MOST READ:మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

ధరల పెరుగుదలను అందుకున్న ఇతర మోడళ్లలో విటారా బ్రెజ్జా, ఆల్టో, డిజైర్ మరియు వ్యాగన్ఆర్ కార్లు ఉన్నాయి. ఇందులో విటారా బ్రెజ్జా మరియు డిజైర్ ధరలు వరుసగా రూ.10,000 మరియు రూ.12500 మేర పెరిగాయి.

మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు ఆల్టో ధర రూ.14,000 మేర పెరిగింది. కంపెనీ అందిస్తున్న టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్ ధర రూ.23,000 మేర పెరిగింది.
MOST READ:కొత్త హోండా వెజెల్ ఎస్‌యూవీ టీజర్ విడుదల

మారుతి సుజుకి 2021 ప్రారంభం నుండి తమ మోడళ్ల ధరలను పెంచుతామని గత డిసెంబరులోనే ప్రకటించిన విషయం తెలిసినదే. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా వాహనాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది.

ఇప్పటికే భారతదేశంలో కియా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచిన విషయం తెలిసినదే. తాజాగా ఈ జాబితాలోకి మారుతి సుజుకి కూడా వచ్చి చేరింది.
MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ కంపెనీలు సరైన కారణం లేకుండానే, ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభంలో తమ వాహనాల ధరలను పెంచడాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కస్టమర్లు కూడా దీనిని అలవాటు చేసుకోవటంతో ఇది మామూలు విషయంగా మారిపోయింది. ఈ ఏడాది ఇదే మొదటి మరియు చివరి ధరాఘాతం కాదు, రానున్న రోజుల్లో ఇలాంటి చాలానే చూడాల్సి వస్తుంది.

ఇక మారుతి సుజుకి బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ అరేనా బ్రాండ్ కస్టమర్ల కోసం ఆన్‌లైన్ కార్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్మార్ట్ ఫైనాన్స్'ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది.
MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..

ఇప్పుడు కస్టమర్లు షోరూమ్‌లను సందర్శించాల్సిన అసరం లేకుండానే రుణం తీసుకోవటానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారానే చేయవచ్చు. - పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.