లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గడచిన జూన్ 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కరోనా లాక్‌డౌన్, కర్ఫ్యూల సమయంలో కూడా కంపెనీ గత నెలలో అత్యధికంగా 1,24,280 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, దేశంలో అమ్మకాల పరంగా తన మొదటి స్థానాన్ని అలానే నిలుపుకుంది.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గడచిన జూన్ 2021 నెలలో గరిష్టంగా 1,24,280 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే, ఈ అమ్మకాలు 142 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జూన్ 2020లో కంపెనీ కేవలం 51,274 యూనిట్ల కార్లను మాత్రమే విక్రయించగలిగింది.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

మారుతి సుజుకి అందిస్తున్న వివిధ విభాగపు కార్ల అమ్మకాలను పరిశీలిస్తే, జూన్ 2021లో మినీ ప్యాసింజర్ వెహికల్ విభాగంలో మొత్తం అమ్మకాలు 17,439 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగంలో ఆల్టో మరియు ఎస్-ప్రెసో వంటి మోడళ్లు ఉన్నాయి. జూన్ 2020లో ఈ అమ్మకాలు 10,458 యూనిట్లుగా ఉన్నాయి.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

కాంపాక్ట్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో పాపులర్ వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ మరియు టూర్ ఎస్ వంటి కార్లు ఉన్నాయి. జూన్ 2021లో కంపెనీ ఈ విభాగంలో మొత్తం 68,849 యూనిట్ల కార్లను విక్రయించగా, జూన్ 2020 నెలలో 26,696 యూనిట్లను విక్రయించింది.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

అంతే కాకుండా, గత నెలలో కంపెనీ తమ పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ మారుతి సియాజ్‌ను 602 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్‌లో ఇవి 553 యూనిట్లుగా ఉన్నాయి. గడచిన నెలలో కంపెనీ యొక్క యుటిలిటీ వాహన అమ్మకాలు కూడా భారీ వృద్ధిని కనబరిచాయి. ఈ విభాగంలో జిప్సీ, ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు ఎక్స్‌ఎల్6 మోడళ్లు ఉన్నాయి.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

గత నెలలో ఈ విభాగంలో కంపెనీ మొత్తం 28,172 యూనిట్ల యుటిలిటీ వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయం (జూన్ 2020)లో ఇవి 9,764 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న లైట్ కమర్షియల్ వెహికల్ సూపర్ క్యారీ ఎల్‌సివి గత నెలలో 1,916 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

గత సంవత్సరం, ఇదే సమయంలో సూపర్ క్యారీ అమ్మకాలు 1,026 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే, దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ప్యాసింజర్ మరియు ఎల్‌సివి వాహనాల అమ్మకాలు రెండూ కలిపి జూన్ 2021 నెలలో 1,26,196 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 52,300 యూనిట్లుగా ఉన్నాయి.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

గడచిన నెలలో మారుతి సుజుకి ఇండియా ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. జూన్ 2021లో మారుతి సుజుకి మొత్తం 17,020 యూనిట్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (జూన్ 2020లో) ఇవి 4,289 యూనిట్లుగా ఉన్నాయి. గత నెలలో కంపెనీ ఎగుమతులతో కలిపి మొత్తం 1,47,368 యూనిట్లను విక్రయించింది.

లాక్‌డౌన్ సమయంలోనూ అదరగొట్టిన మారుతి సుజుకి, అమ్మకాలు భేష్..

మారుతి వాహనాలపై ఫ్రీ-సర్వీస్, వారంటీల పొడగింపు

ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి నేపథ్యంలో, ఉచిత సేవ (ఫ్రీ సర్వీస్), వారంటీ మరియు పొడిగించిన (ఎక్స్‌టెండెడ్) వారంటీ సేవలను వినియోగించుకోలేకపోయిన కస్టమర్ల కోసం కంపెనీ ఈ సేవలను జూలై 31, 2021వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti Suzuki India Reports 1,24,280 Unit Sales In June 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X