Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎన్నో ఎన్నెన్నో వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో ఎక్కవమంది వాహన ప్రియులు ఆఫ్ రోడ్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే మహీంద్రా కంపెనీ థార్ ఎస్‌యువిని మరియు ఫోర్స్ కంపెనీ కొత్త 2021 గుర్ఖా ని విడుదల చేశాయి. ఇవి మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే Maruti Suzuki (మారుతి సుజుకి) కంపెనీ దేశీయ విఫణిలో కొత్త Suzuki Jimny (సుజుకి జిమ్నీ) విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

Suzuki Jimny ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇది త్వరలో దేశీయ మార్కెట్లో కూడా అరంగేట్రం చేసే ఆవకాశం ఉంది. ఈ కొత్త ఆఫ్ రోడర్ యొక్క టీజర్ వీడియోలు కూడా ఇదివరకే విడుదలయ్యాయి. కంపెనీ నుంచి విడుదలైన సమాచారం ప్రకారం కొత్త Jimny 3-డోర్ వెర్షన్‌గా ఉండే అవకాశం ఉంటుంది.

Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

మొదటి సారి Suzuki Jimny 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. ఆ సమయంలోనే ఎంతోమంది వాహన ప్రియుల మనసును దోచింది. కంపెనీ త్వరలో దీనిని ప్రారంభించడానికి చర్చలు జరిగాయి. భారతీయ మార్కెట్ కోసం కంపెనీ తన 5-డోర్ల వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తుంది.

Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

Maruti Suzuki (మారుతి సుజుకి) ఇప్పుడు తన కొత్త జిమ్నీని వచ్చే ఏడాది భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎస్‌యువి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది U- ఆకారపు మెషిన్డ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, బంపర్‌పై టెయిల్ ల్యాంప్స్ మొదలైనవి కలిగి ఉంటుంది.

Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

ఈ కొత్త Suzuki Jimny డ్యూయల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో చిఫ్ఫోన్ ఐవరీ మెటాలిక్, బ్రిస్క్ బ్లూ మెటాలిక్ మరియు సుపీరియర్ వైట్ వంటివి ఉన్నాయి. Jimny యొక్క జపనీస్ వెర్షన్ 1.5 లీటర్ VVT పెట్రోల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 102 బిహెచ్‌పి పవర్ మరియు 130 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది.

Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

అయితే భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న Suzuki Jimny ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్, 4-సిలిండర్ K15B SHVS పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది పెద్ద సైజు ల్యాడర్ చాసిస్ మీద నిర్మించనున్నారు. ఈ కారులో 4-వీల్ డ్రైవ్ సౌకర్యం ఉంది. ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 210 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఆఫ్ రోడర్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

అంతర్జాతీయ మార్కెట్‌లో అప్‌డేట్ చేయబడిన జిమ్నీలో టర్బో ఛార్జింగ్, మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ SUV అనేక కొత్త అధునాతన అప్డేట్స్ పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది చాలా కొత్తగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు.

మారుతి సుజుకి జిమ్నీ యొక్క లైట్ వెర్షన్ కొంతకాలం క్రితం వెల్లడైంది. ఈ కొత్త వేరియంట్ పేరు సుజుకి జిమ్నీ లైట్ మరియు ఇది మొదట ఆస్ట్రేలియాలో లాంచ్ చేయబడుతుంది. సుజుకి జిమ్నీ లైట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విక్రయించే స్టాండర్డ్ సుజుకి జిమ్నీ సియెర్రాలో స్టాండర్డ్ అయిన కొన్ని ఫీచర్లు మరియు పరికరాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది.

Jimny యొక్క మరో టీజర్ విడుదల చేసిన Suzuki.. లాంచ్ ఎప్పుడంటే?

ఇవి మాత్రమే కాకుండా ఈ కొత్త ఆఫ్ రోడర్ లో స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఇన్‌స్టాల్ చేయబడలేదు, కానీ కంపెనీ దానిలో 2-DIN ఆడియో సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది, ఇది భారతీయ మార్కెట్లో విక్రయించబడే మారుతి సుజుకి యొక్క మిడ్-స్పెక్ మోడళ్లలో ఉపయోగించబడుతుంది. మారుతి సుజుకి జిమ్నీ కంపెనీకి చెందిన ప్రముఖ ఎస్‌యూవీ మరియు దీనిని విదేశీ మార్కెట్లలో కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

భారత మార్కెట్లో సుజుకి జిమ్మీ మినీ ఎస్‌యూవీని లాంచ్ చేస్తే, మహీంద్రా థార్ ఎస్‌యూవీకి బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. అయితే త్వరలో లాంచ్ అవ్వనున్న ఈ ఆఫ్ రోడర్ ఎలాంటి ఆదరణ పొందుతుందనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki jimny new teaser india launch details
Story first published: Saturday, October 16, 2021, 10:03 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X