జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, అంతర్జాతీయ మార్కెట్ల కోసం తమ జిమ్నీ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీని ఇక్కడే స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ భారత్‌ను తమ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చుకుంది. సుజుకి జిమ్నీకి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

మనదేశంలో కూడా ఎస్‌యూవీలు మరియు ఆఫ్-రోడ్ వాహనాలకు గిరాకీ జోరందుకోవటంతో మారుతి సుజుకి ఈ లేటెస్ట్ ఆఫ్-రోడ్ ఎస్‌‌యూవీని భారత మార్కెట్లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, మారుతి సుజుకి తమ జిమ్నీ ఆఫ్-రోడర్‌ను జులై 2022 నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది.

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్లలో అమ్ముడవుతోంది. ఇందులో 5-సీటర్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. జపాన్ మార్కెట్లో 3-డోర్ వెర్షన్ ఎక్కువగా అమ్ముడవుతుంది. మనదేశం కోసం మారుతి సుజుకి ప్రత్యేకంగా 5-డోర్ వెర్షన్ జిమ్నీని రూపొందించనుంది. ఇటీవలే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

మారుతి సుజుకి తయారు చేయనున్న 5-డోర్ వెర్షన్ జిమ్నీ ఎస్‌యూవీ 3,850 మిమీ పొడవును, 1,645 మిమీ వెడల్పును, 1,730 మిమీ ఎత్తును మరియు 2,550 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుందని సమాచారం. అదే, 3-డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీ కొలతలను గమనిస్తే, ఇది 3,550 మిమీ పొడవును మరియు 2,250 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బ్లాక్ హనీకోంబ్ గ్రిల్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌కు పక్కనే గుండ్రటి టర్న్ ఇండికేటర్స్, గుండ్రటి ఫాగ్‌ల్యాంప్స్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన బ్లాక్ కలర్ ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. వెనుక వైపు హై మౌంటెడ్ స్టాప్ లాంప్ మరియు బ్లాక్ రియర్ బంపర్‌లు కూడా ఇందులో గమనించవచ్చు.

MOST READ:ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే.. మీకు తెలుసా?

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

ఈ ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్ చాలా మినిమలిస్టిక్‌గా ఉంటుంది. బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్‌తో కూడిన పెద్ద వీల్ ఆర్చెస్, యు-ఆకారపు మెషీన్డ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో స్పేర్ వీల్‌ను మహీంద్రా థార్ మాదిరిగానే వెనుక వైపు టెయిల్‌గేట్‌పై అమర్చబడి ఉంటుంది. రియర్ బ్రేక్ లైట్స్ మరియు రివర్స్ గైడ్ లైట్లను వెనుక బంపర్లో అమర్చబడి ఉంటాయి.

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

సుజుకి జిమ్నీ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, 5-డోర్ వెర్షన్‌లో 1.5 లీటర్, 4-సిలిండర్, కె15బి, డిఓహెచ్‌సి 16 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 101 బిహెచ్‌పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఫ్రీ వ్యాక్సిన్ సర్వీస్ ప్రారంభించిన ఎంజి మోటార్.. కేవలం వారికీ మాత్రమే

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి, సియాజ్ సెడాన్ మరియు విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఇప్పటికే ఈ ఇంజన్‌ను ఉపయోగిస్తోంది. ఇదే ఇంజన్‌ను కొత్త సుజుకి జిమ్నీలోనూ కొనసాగించే అవకాశం ఉంది.

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

ప్రస్తుతం భారతదేశంలో తయారైన సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. సుజుకి జిమ్మీ యొక్క జపనీస్ వెర్షన్ విషయానికి వస్తే, ఇందులో 1.5-లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 102 బిహెచ్‌పి శక్తిని మరియు 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

జులై 2022 నాటికి మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో విడుదల కావచ్చు: రిపోర్ట్!

మారుతి సుజుకి ఇండియా ఇటీవలి కాలంలో, భారత మార్కెట్లో విడుదల చేసిన ఐదవ తరం మోడళ్లను కంపెనీ తమ తేలికపాటి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫాంపై నిర్మిస్తోంది. అయితే, కొత్తగా రానున్న సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని మాత్రం భారీ లాడర్-ఫ్రేమ్ చాస్సిస్‌పై తయారు చేయనున్నారు. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో పాటుగా కఠినమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Jimny SUV India Launch Expected By July 2022: Reports. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X