మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

గత నెలలో భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడైన చిన్న కారు మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో కంపెనీ తాజాగా ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. 'వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్' పేరిట మారుతి సుజుకి ఈ కొత్త మార్కెట్లో ప్రవేశపెట్టింది. మార్కెట్లో దీని ధరలు రూ.5.35 లక్షల నుండి రూ.5.71 లక్షల మధ్యలో ఉన్నాయి.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

మారుతి సుజుకి అందిస్తున్న మిడ్-స్పెక్ వ్యాగన్ఆర్ విఎక్స్ఐ వేరియంట్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ ఎడిషన్ వ్యాగన్ఆర్ 1-లీటర్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

స్టాండర్డ్ వ్యాగన్ఆర్ విఎక్స్ఐ వేరియంట్‌తో పోల్చుకుంటే, ఈ ప్రత్యేకమైన వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్‌లో కొన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఈ ఫీచర్లను కంపెనీ యాడ్-ఆన్ యాక్ససరీల రూపంలో అందిస్తోంది. వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ వేరియంట్‌లో మొత్తం 13 అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

మార్కెట్లో వ్యాగన్ఆర్ విఎక్స్ఐ మరియు వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ల ధరలు ఇలా ఉన్నాయి:

* వ్యాగన్ఆర్ 1.0 లీటర్ విఎక్స్ఐ మ్యాన్యువల్ - రూ.5.13 లక్షలు

* వ్యాగన్ఆర్ 1.2 లీటర్ విఎక్స్ఐ మ్యాన్యువల్ - రూ.5.48 లక్షలు

* వ్యాగన్ఆర్ 1.0 లీటర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ - రూ.5.35 లక్షలు

* వ్యాగన్ఆర్ 1.2 లీటర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ - రూ.5.71 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్‌లో కంపెనీ అందిస్తున్న యాక్ససరీల కిట్ విలువ రూ.22,900 గా ఉంటుంది. ఈ యాక్ససరీలన్నింటినీ విడివిడిగా కొనుగోలు చేస్తే సుమారు రూ.30,000 వరకూ ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. కాబట్టి, వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్‌ను కొనుగోలు చేయటం ద్వారా కస్టమర్లు సుమారు రూ.7,000 వరకూ ఆదా చేసుకోవచ్చు.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా వేరియంట్‌లోని ఎక్స్‌టీరియర్ కిట్‌లో ఫ్రంట్ మరియు రియర్ బంపర్ ప్రొటెక్టర్స్, సైడ్ స్కర్ట్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, బాడీ సైడ్ మౌల్డింగ్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, అప్పర్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, రియర్ డోర్ క్రోమ్ గార్నిష్, నంబర్ ప్లేట్ గార్నిష్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ వంటి స్టైలింగ్ యాక్సెసరీస్ ఉన్నాయి.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

అంతేకాకుండా, ఇందులో డిజిటల్ ఎయిర్ ఇన్‌ఫ్లేటర్, ట్రంక్ ఆర్గనైజర్ మరియు కార్ ఛార్జర్ ఎక్స్‌టెండర్ యాక్ససరీలను కూడా కంపెనీ అందిస్తోంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్‌లో ఈ అదనపు స్టైలింగ్ మరియు కన్వీనెంట్ యాక్ససరీస్ మినహా కంపెనీ ఇందులో ఎలాంటి డిజైన్ లేదా మెకానికల్ మార్పులు చేయలేదు.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

ప్రస్తుతం మార్కెట్లో వ్యాగన్ఆర్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో మొదటిది 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్‌ను మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.2 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 82 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

వీటిలో 1.0 లీటర్ పెట్రోల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. కాగా, 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్ ఎక్స్‌ట్రా ఎడిషన్ విడుదల.. ఈ కారులో అన్ని ఎక్స్‌ట్రానే..

వ్యాగన్ఆర్‌లో లభించే సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే, ఈ కారులో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Maruti suzuki launches limited edition wagonr xtra edition price and features
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X