Just In
- 11 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 15 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లోకి మారుతి సుజుకి సెకండ్ హ్యాండ్ కార్లు?
భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, దేశీయ విపణిలో చందా-ఆధారిత (సబ్స్క్రిప్షన్ బేస్డ్) లీజింగ్ వ్యాపారం కూడా క్రమంగా జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో, దేశీయ మరియు విదేశీయ కంపెనీలు కొత్త కార్ల విక్రయాలతో పాటుగా లీజింగ్ వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తున్నాయి.

ఈ వ్యాపారంలో ఇప్పటికే మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకి ఇండియా, ఇటీవలే తమ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లో భాగంగా కొత్తగా ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్లను జోడించిన సంగతి తెలిసినదే. కాగా, తాజా అప్డేట్ ప్రకారం, కంపెనీ ఇప్పుడు ప్రీ-ఓన్డ్ (వాడిన) కార్లను కూడా ఈ చందా ప్లాన్‌లో తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.

సబ్స్క్రిప్షన్ ఆధారిత లీజింగ్ వ్యాపారంలో ప్రస్తుత మార్కెట్ ధోరణిని పరిశీలించిన మారుతి సుజుకి తమ 'మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్' ప్లాన్ కింద ప్రీ-ఓన్డ్ (వాడిన) కార్లను అందించే విషయాన్ని అధ్యయనం చేస్తోంది. కంపెనీకి భారతదేశవ్యాప్తంగా ఉన్న రీటైల్ నెట్వర్క్ ద్వారా, మరిన్ని నగరాలకు ఈ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది.
MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

మారుతి సుజుకి సబ్స్క్రయిబ్ ప్లాన్‌లో భాగంగా ప్రస్తుతం, కంపెనీ స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ మరియు ఎక్స్ఎల్6 వంటి ప్రీమియం కార్లను అందిస్తోంది. ఇటీవలే ఇందులో కొత్తగా ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు వ్యాగన్ఆర్ వంటి అదనపు మోడళ్లను కూడా జోడించింది.

వాహనాల విషయంలో లాంగ్ టెర్మ్ కమిట్మెంట్ లేకుండా, నిర్దేశిత కాలం వరకూ వాటిని ఉపయోగించి ఆ తర్వాత మరో కొత్త కారును నడపాలనుకునే వారి కోసం ఈ సబ్స్క్రిప్షన్ (చందా) ప్లాన్ అనువుగా ఉంటుంది. కస్టమర్లు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా కారు యాజమాన్యం, మెయింటినెన్స్ వంటి అంశాల గురించి చింతించకుండా కారును సొంతం చేసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

కస్టమర్లు ఈ సబ్స్క్రిప్షన్ విధానం ద్వారా కారును లీజుకు తీసుకోవటం వలన డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇందులో ఫుల్ కార్ మెయింటినెన్స్, కంప్లీట్ ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను మారుతి సుజుకి చూసుకుంటుంది.

ఈ విధానం ద్వారా కారును లీజుకు తీసుకున్న కస్టమర్లు రీసేల్ గురించి చింతించాల్సిన అసరం లేదు. ఒకవేళ కస్టమర్ అదే కారును ఎప్పటికీ సొంతం చేసుకోవాలనుకుంటే మార్కెట్ ధర వద్ద దానిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

కస్టమర్లు ఎంచుకునే సమయాన్ని బట్టి, 24, 36, మరియు 48 నెలల కాలపరిమితితో ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. చందా కాలపరిమితి పూర్తయిన తర్వాత, కస్టమర్లు కావాలనుకుంటే దానిని పొడిగించడం లేదా వేరే వాహనానికి అప్‌గ్రేడ్ పొందడం చేయవచ్చు.

మారుతి సుజుకి అరేనా షోరూమ్‌లు మరియు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ ఈ చందా ఆధారిత స్కీమ్‌ను దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అందిస్తోంది. ఇందులో ఢిల్లీ, గుర్గావ్, పూణే, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ మరియు చెన్నై నగరాలు ఉన్నాయి.
MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు