S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఒకటి. మారుతి సుజుకి కంపెనీ యొక్క మారుతి ఎస్-ప్రెస్సో దేశీయ మార్కెట్లో ఆనతి కాలంలోనే మంచి ఆదరణ పొందగలిగింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 2019 లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. విఫణిలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఇది మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో యొక్క కొత్త TVC ని విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో యొక్క కొత్త TVC ని కంపెనీ యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో దేశీయ మార్కెట్లో విడుదలైన కేవలం ఒక సంవత్సరంలో 75,000 యూనిట్లు విక్రయించబడ్డాయి. మారుతి సుజుకి ఈ మినీ ఎస్‌యూవీని సామాన్య ప్రజల కోసం అందుబాటు ధరలో విడుదల చేసింది. ఈ అధునాతన SUV మధ్య తరగతి ప్రజలను ఆకర్షించడంలో గొప్ప విజయం సాధించింది. ఈ కారణంగానే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. ఇప్పటికి కూడా ఇది మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

మారుతి ఎస్-ప్రెస్సో SUV లో 998 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బేస్ మోడల్ లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు హై-ఎండ్ మోడల్‌లో 5-స్పీడ్ ఆటో గేర్‌షిఫ్ట్ ఆప్సన్ అందుబాటులో ఉంటుంది.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

మారుతి ఎస్-ప్రెస్సో SUV అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఆకర్షణీయమైన గ్రౌండ్ క్లియరెన్స్, 14 ఇంచెస్ స్టీల్ వీల్‌హౌస్‌లు, స్లిక్ ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ ఇన్సర్ట్, హెడ్‌ల్యాంప్, ఎక్స్‌టెండెడ్ సెంటర్ ఎయిర్ ఇన్‌టేక్ మరియు టెయిల్‌గేట్ ఫీచర్ వంటివి ఉంటాయి.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

మారుతి ఎస్-ప్రెస్సో కారు లోపలి భాగంలో బాడీ కలర్ డాష్‌బోర్డ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ సెంటర్ కన్సోల్, టాకో మీటర్, ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ కార్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

ఇందులో కీలెస్ ఎంట్రీ, బ్లూటూత్ కనెక్టివిటీ, పవర్ విండో, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ విత్ ఈబిడి, స్పీడ్ వార్నింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రస్తుతం ఆరు ప్రధాన వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది మరియు కస్టమర్‌లు తమ డిమాండ్‌ను బట్టి వివిధ రకాల వేరియంట్‌లను ఎంచుకోవచ్చు. ఇది వాహన వినియోగదారులు చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

మారుతి సుజుకి (Maruti Suzuki)ఇటీవల కొత్త 2021 మారుతి సెలెరియో ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ కొత్త మారుతి సెలెరియో ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే మారుతి సెలెరియో యొక్క టాప్ మోడల్ ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. మారుతి సుజుకి ఈ కొత్త సెలెరియో కోసం బుకింగ్స్ ప్రారంభిచింది. కావున కొనుగోలు చేయాలనుకునే వారు 11,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు, డెలివరీలు త్వరలో ప్రారంభమౌతాయి.

మారుతి సుజుకి సెలెరియో 4 ట్రిమ్స్ 7 విభిన్న వేరియంట్‌లలో అందించబడుతుంది. అవి LXI, VXI, VXI AGS, ZXI, ZXI AGS, ZXI+ మరియు ZXI+ AGS వేరియంట్లు.

S-Presso TVC విడుదల చేసిన Maruti Suzuki: పూర్తి వివరాలు

కొత్త 2021 మారుతి సెలెరియోలో 1.0-లీటర్ K10C సిరీస్ త్రీ-సిలిండర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి పవర్ మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా పొందుతుంది. కొత్త సెలెరియో 26.68 కిమీ/లీ మైలేజీని అందించగలదని మారుతి సుజుకి పేర్కొంది. ఈ కొత్త మారుతి సెలెరియో దేశీయ మార్కెట్లో ఎలాటి అమ్మకాలను పొందుతుందో త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki released new television video commercial for the s presso
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X