భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత పాపులర్ అయిన ఆఫ్-రోడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సుజుకి జిమ్నీని, మారుతి సుజుకి ఇటీవలే మనదేశంలో అసెంబ్లింగ్ చేయటాన్ని ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, భారతదేశంలో తయారైన సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని మారుతి సుజుకి తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయటాన్ని ప్రారంభించింది.

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

ఈ మేరకు, దేశంలో జిమ్నీ ఎస్‌యూవీ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైనట్లు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్‌ఐఎల్) ఓ ప్రకటనలో పేర్కొంది. మొదటి బ్యాచ్‌లో భాగంగా, భారతదేశంలో తయారైన ఎస్‌యూవీలను కొలంబియా మరియు పెరూ వంటి లాటిన్ అమెరికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

సుజుకి జిమ్నీ దాని సింపుల్ డిజైన్ మరియు కఠినమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది. ఇది అనేక అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతోంది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో జపనీస్ సుజుకి మోటార్ కార్పోరేషన్‌కి చెందిన జిమ్మీకి 2019లో ప్రతిష్టాత్మక వరల్డ్ అర్బన్ కార్ అవార్డ్ కూడా లభించింది.

MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

గ్లోబల్ మార్కెట్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి భారతదేశంలో కూడా ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. ఎడమచేతి వైపు స్టీరింగ్ (అమెరికా వంటి మార్కెట్ల కోసం) ఉన్న సుజుకి జిమ్నీ వాహనాలను కంపెనీ గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవు నుండి ఎగుమతి చేయటాన్ని ఈ చిత్రాలలో గమనించవచ్చు.

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

మొదటి బ్యాచ్‌లో భాగంగా మొత్తం 184 సుజుకి జిమ్నీ ఎస్‌యూవీలను కంపెనీ ఎగుమతి చేసింది. ఈ త్రీ డోర్ వెర్షన్ సుజుకి జిమ్నీని లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ మార్కెట్లకు భారతదేశం నుండి ఎగుమతి చేయనున్నట్లు మారుతి సుజుకి తన ప్రకటనలో తెలిపింది.

MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన సుజుకి జిమ్నీ ఎస్‌యూవీలో 1.5 లీటర్ కె15 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103.2 బిహెచ్‌పి శక్తిని, 138 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

గ్లోబల్ వెర్షన్ సుజుకి జిమ్నీలో కనిపించే విధంగా ఈ ఎస్‌యూవీలో ఫోర్-వీల్-డ్రైవ్ ట్రాన్స్‌ఫర్ కేస్ మరియు లో-రేంజ్ రేంజ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి), ట్రాక్షన్ కంట్రోల్ (టిసి), హిల్-హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, మరియు ఆరు-ఎయిర్‌బ్యాగులు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

ఇంటీరియర్స్‌లో కూడా కఠినమైన ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో ఉండాల్సిన అన్ని పరికరాలు, ఫీచర్లు ఇందులో ఉంటాయి. అలాగే, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ ఎప్పుడు?

గతంలో మారుతి సుజుకి అందించిన జిప్సీ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని ఈ సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. మనదేశంలో జిప్సీగా అమ్ముడైన ఎస్‌యూవీ అంతర్జాతీయ మార్కెట్లలో జిమ్నీగా అమ్ముడవుతోంది. కానీ, కొన్ని కారణాల వలన మారుతి సుజుకి తమ జిప్సీ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్ నుండి తొలగించి వేసింది.

MOST READ:స్పోర్ట్స్ కార్‌లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

అయితే, తాజా సమాచారం ప్రకారం భారత మార్కెట్లో ఆఫ్-రోడ్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, మారుతి సుజుకి ఈ కొత్త జిమ్నీ ఎస్‌యూవీ మన మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో సుజుకి జిమ్నీ 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్లలో లభిస్తోంది. మారుతి సుజుకి భారత మార్కెట్ కోసం 5-డోర్ వెర్షన్ జిమ్నీని తీసుకువచ్చే అవకాశం ఉంది.

భారత్ నుండి మారుతి సుజుకి జిమ్నీ ఎగుమతి ప్రారంభం; మరి మన సంగతేంటి?

భారత మార్కెట్లో సుజుకి జిమ్నీ విడుదలకు సంబంధించి ఇప్పటికీ స్పష్టమైన వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు. అయితే, ఇది 2021లో ఏ సమయంలోనైనా ఇక్కడి మార్కెట్లోకి రావచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈ విభాగంలో కొత్త తరం మహీంద్రా థార్‌కు గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki Starts Jimny Exports From India, First Batch SUVs Shipped To International Markets. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X