Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో ఇప్పటికి చాలా మోడల్స్ ప్రవేశపెట్టింది. అయితే కంపెనీ ప్రవేశపెట్టిన వాటిలో అత్యధికంగా మ్ముడైన కారు మారుతి స్విఫ్ట్. కంపెనీ 2.3 మిలియన్ యూనిట్లకు పైగా స్విఫ్ట్ కారును అమ్మినట్లు ఇటీవల ప్రకటించింది. 2020 సంవత్సరంలో కూడా మారుతి స్విఫ్ట్ దాదాపు 1,60,700 యూనిట్లు అమ్మకాలను సాధించి కంపెనీకి ఉత్తమ అమ్మకాల గణాంకాలను ఇచ్చింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ మొట్టమొదట 2005 లో భారత మార్కెట్లో ప్రారంభించబడింది. మారుతి స్విఫ్ట్ చాలా కాలంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న స్విఫ్ట్ 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టబడింది.

మారుతి సుజుకి ఇప్పుడు కొత్త మైలురాయిని సాధించడం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) 'శశాంక్ శ్రీవాస్తవ' మాట్లాడుతూ, మారుతి సుజుకి స్విఫ్ట్ 15 సంవత్సరాలుగా 2.3 మిలియన్లకు పైగా కస్టమర్లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అని తెలిపారు.
MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

కరోనా మహమ్మారి అధికంగా ప్రబలినప్పుడు కూడా మారుతి స్విఫ్ట్ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది. స్విఫ్ట్ కారుపై కస్టమర్లు పెంచుకున్న అభిమానానికి ధన్యవాదాలు. నిరంతర కస్టమర్ మద్దతుతో, స్విఫ్ట్ భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లను విజయవంతంగా సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

మారుతి సుజుకి ఈ కొత్త స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారును మునుపటికంటే కొంత అప్డేట్ అయ్యి ఉంటుంది. ఇందులో కొత్త రేడియేటర్ గ్రిల్ డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా, బ్లాక్ రూఫ్ మరియు డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి.
MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. వెల్లడైన ఫోటోల ప్రకారం కొత్త మారుతి ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతానికి పెద్ద మార్పులు కనుగొనబడలేదు. ఇందులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని మేము ఊహిస్తున్నాము. ఇది ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో స్మార్ట్ స్టూడియో 2.0 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 89 బిహెచ్పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు స్పీడ్ ఎఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందిస్తుంది.
MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి