కొత్త సంవత్సరంలో కూడా షాక్ ఇవ్వనున్న Maruti Suzuki.. అదేంటో తెలుసా?

దేశీయ మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి (Maruti Suzuki) విక్రయాల పరంగా కూడా అంతే ప్రధాన్యతను కలిగి ఉంది. కంపెనీ రానున్న కొత్త సంవత్సరం (2022) ప్రారంభం నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. అయితే ధర పెరుగుదలకు సంబంధించి సమాచారం అందుబటులో లేనప్పటికీ వివిధ వేరియంట్ల ధరలు వివిధరకాలుగా ఉంటాయి.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

కంపెనీ అందించిన నివేదికల ప్రకారం, గత ఒక సంవత్సరంలో, వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా వాహనాల ధరలు కూడా పెరగటం జరిగింది. ఇప్పటికే చాలా కంపనీలు తమ వాహనాల ధరలను పెంచిన విషయం తెలిసిందే, ఆ ధరలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

మారుతి సుజుకి 2022 జనవరి నాటికి ధరలను పెంచడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ధరలు వివిధ వేరియంట్లపైన వివిధ రకాలుగా ఉంటాయి. కంపెనీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మారుతి ఆల్టో హ్యాచ్‌బ్యాక్ నుండి మారుతి ఎస్-క్రాస్ SUV వరకు అనేక ఆధునిక మోడల్స్ విక్రయిస్తోంది.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

మారుతి సుజుకి ఇప్పటికే 2021 సంవత్సరంలో ఏకంగా మూడుసార్లు తమ వాహనాల ధరలను పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం చొప్పున మొత్తం 4.9 శాతం ధరలను పెంచడం జరిగింది. ఇప్పుడు రానున్న కొత్త సంవత్సరంలో మళ్ళీ ధరలను పెంచినట్లైతే వరుసగా నాలుగవ సారి అవుతుంది.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

ధరల పెరుగుదల గురించి, మారుతి సుజకి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 'శశాంక్‌ శ్రీవాస్తవ' మాట్లాడుతూ.. ఒక సంవత్సర కాలంగా వాహనతయారీకి కావలసిన ముడిసరుకులైన స్టీల్‌, అల్యూమినియం, కాపర్‌ మరియు ప్లాస్టిక్‌ వంటి వాటి ధరలు అమాంతం పెరిగాయి. ఈ కారణంగానే ధరలు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

మారుతి సుజుకీ ఇటీవల 2021 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం కంపెనీ మొత్తం అమ్మకాలు మునుపటికంటే తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కంపెనీ గత నెలలో 9 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

2021 నవంబర్ నెలలో కంపెనీ 1,39,184 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 1,53,233 యూనిట్లను విక్రయించింది. గత నెలలో మారుతి విక్రయించిన 1,09,726 ప్యాసింజర్ వెహికల్స్ లో 70 శాతానికి పైగా సహకారం మినీ మరియు కాంపాక్ట్ వెహికల్ సెగ్మెంట్స్ వల్ల వచ్చింది. ఇందులో ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో, స్విఫ్ట్ మరియు ఇతర మారుతీ కార్లు ఉన్నాయి.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

కాంపాక్ట్ వెహికల్ సెగ్మెంట్‌తో పోలిస్తే, సియాజ్, ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్6తో కూడిన మిడ్-సైజ్ మరియు యుటిలిటీ వెహికల్ విభాగాలు గత నెలలో జరిగిన మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో 25 శాతం వాటాను అందించాయి. మారుతి గత నెలలో 1,089 సియాజ్ యూనిట్లను విక్రయించగా, ఎర్టిగా, జిప్సీ, ఎస్-క్రాస్ విటారా బ్రెజ్జా మరియు ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలు మొత్తం 24,574 యూనిట్లను అందించాయి.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

అక్టోబర్ 2021తో పోల్చితే నవంబర్ 2021 అమ్మకాలలో స్వల్ప పెరుగుదల ఉంది. అక్టోబర్ 2021లో, కంపెనీ 1,38,335 యూనిట్లను విక్రయించింది. సెమీకండక్టర్ల కొరత కారణంగా డిసెంబర్‌లో కూడా ఉత్పత్తి 15 నుంచి 20 శాతం తగ్గే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. కంపెనీల యొక్క అమ్మకాలపైన సెమీకండక్టర్ల కొరత పెద్ద మహమ్మారిగా మారింది.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

మారుతి ఇటీవల కొత్త సెలెరియో హ్యాచ్‌బ్యాక్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ కొత్త మారుతి సెలెరియో ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే మారుతి సెలెరియో యొక్క టాప్ మోడల్ ధర రూ. 6.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

రానున్న 2022 సంవత్సరంలో కూడా సెమీకండక్టర్ల కొరత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. గ్లోబల్ చిప్ కొరత 2022 లో కూడా ఏడాది పొడవునా కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు వస్తున్న మరో కొత్త వైరస్ కారణంగా మళ్ళీ ఆటోమోటివ్ రంగం నష్టాలను చవి చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

Maruti వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. 2022 లో ధరలు మరింత పైకి

మారుతి సుజుకి 2021 సెప్టెంబర్‌లో 40 శాతం, అక్టోబర్‌లో 60 శాతం, నవంబర్‌లో 85 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలిగింది. అయితే కంపెనీ ఇక రానున్న రోజుల్లో డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలివేయనున్నట్లు కూడా తెలిపింది. కంపెనీ దేశంలో బిఎస్ 6 ప్రమాణాలు ప్రారంభమ కాకముందే 2019 వ సంవత్సరంలోనే ఈ డీజిల్ ఇంజిన్ మోడల్స్ తయారీని నిలిపివేసింది.

Most Read Articles

English summary
Maruti suzuki to hike prices by january 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X