'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

ఒకప్పుడు కార్లలో మనకు తెలిసిన ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) రకాలు రెండే రెండు. అవి: మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్. కానీ, ఆటోమేటిక్‌లో అనేక రకాల గేర్‌బాక్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా, భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా ఓ కొత్త గేర్‌బాక్స్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

మారుతి సుజుకి 'ఎస్-అసిస్ట్' పేరుతో కంపెనీ ఓ టెక్నాలజీని ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది. బహుశా ఇది భారత మార్కెట్లో బ్రాండ్ నుండి రాబోయే సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎస్-అసిస్ట్ పేరు మినహా, దాని టెక్నాలజీ సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

భారతదేశంలో లభించే కొన్ని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను గమనిస్తే.. ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్), ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్), సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్), డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్), ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) మొదలైన సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి.

MOST READ:హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

పైన పేర్కొన్న వాటిలో సివిటి, డిసిటి అనేవి పూర్తి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు కాగా, మిగిలినవన్నీ సెమీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొనసాగుతున్న ఈ ఆటోమేటిక్ మరియు సెమీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ట్రెండ్ ఆధారంగా, మారుతి సుజుకి త్వరలో భారతదేశంలో తమ మోడల్‌పై మరో కొత్త గేర్‌బాక్స్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది.

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

మారుతి సుజుకి కొత్తగా ట్రేడ్‌మార్క్ చేసిన ఎస్-అసిస్ట్ అనే ట్రాన్సిమిషన్ టెక్నాలజీ ఒక డిసిటి గేర్‌బాక్స్ కావచ్చు లేదా సంస్థ నుండి రాబోయే క్లచ్‌లెస్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ కావచ్చు. మా అభిప్రాయం ప్రకారం, డిసిటితో పోలిస్తే తక్కువ ఉత్పాదక ఖర్చులు మరియు అధిక ఇంధన సామర్థ్యం ఉన్నందున బహుశా ఇది రెండవది (క్లచ్‌లెస్ మాన్యువల్ ట్రాన్సిమిషన్) కావచ్చని తెలుస్తోంది.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

కియా సెల్టోస్ ఐఎమ్‌టి, హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి వేరియంట్ల మాదిరిగానే కొత్త మారుతి సుజుకి ఎస్-అసిస్ట్ కూడా క్లచ్ లేని సెమీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌గా ఉంటుందని సమాచారం. దీని పనితీరు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాదిరిగానే ఉంటుంది, కానీ ఇందులో క్లచ్ పెడల్ మాత్రం ఉండదు. గేర్ మార్చాలనుకున్నప్పుడు క్లచ్ అవసరం లేకుండా సులువుగా గేర్లను మార్చుకోవచ్చు.

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

వాహనం యొక్క వేగాన్ని బట్టి క్లచ్‌ను కారులోని టిసియూ (ట్రాన్సిమిషన్ యూనిట కంట్రోల్) హైడ్రాలిక్స్ మరియు సెన్సార్ల సాయంతో ఆటోమేటిక్‌గా కంట్రోల్ అయ్యేలా చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఈ కొత్త క్లచ్లెస్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు స్టాండర్డ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్ల మాదిరిగానే ఒకేరకమైన మైలేజీని ఇస్తాయి. ఈ కార్లలో క్లచ్ యొక్క మాన్యువల్ ఆపరేషన్ లేకపోవడంతో దీనిని నడపడం చాలా సులభంగా ఉంటుంది.

MOST READ:ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

మారుతి సుజుకి ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో, మోడల్‌ను బట్టి మూడు రకాల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందిస్తోంది. బ్రాండ్ లైనప్‌లోని చాలా కార్లలో 5-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఉంటుంది. అలాగే, హై-ఎండ్ కార్లలో 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు బాలెనో వంటి కార్లలో సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఉంటుంది.

'ఎ-అసిస్ట్' పేరుని ట్రేడ్‌మార్క్ చేసిన మారుతి సుజుకి; అసలేంటి ఇది..?

మారుతి సుజుకి ఎస్-అసిస్ట్‌ను కంపెనీ ఒకవేళ క్లచ్‌లెస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌గా లాంచ్ చేసినట్లయితే, ఈ టెక్నాలజీని ముందుగా ఈ బ్రాండ్ యొక్క ప్రముఖ మోడళ్లలో ప్రారంభించవచ్చు. ఇందులో మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, వ్యాగన్ఆర్, విటారా బ్రెజ్జా మరియు సియాజ్ మొదలైనవి ఉండవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

MOST READ:దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

Most Read Articles

English summary
Maruti Suzuki S-Assist Name Trademarked In India; It Might Be A New Clutch-less Automatic Gearbox. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X