వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన Maruti Suzuki, ఎక్కడో తెలుసా?

భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరియు టొయోటా సుషో గ్రూప్ (Toyota Tsusho Group) లు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వ-ఆమోదిత స్క్రాపింగ్ మరియు రీసైక్లింగ్ సదుపాయం ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ (ELVs) ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. నోయిడాలో ఏర్పాటు చేసిన ఈ వెహికల్ స్క్రాపింగ్ సెంటర్ దాదాపు 10,993 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిని మారుతి సుజుకి టొయోట్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Maruti Suzuki Toyotsu India Private Limited) నిర్వహిస్తోంది.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

కేంద్రం ప్రతిపాదించిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీకి అనుగుణంగా ఈ మారుతి సుజుకి టొయోట్సు వెహికల్ స్క్రాపింగ్ సెంటర్ ఉంటుంది. ఈ సదుపాయం కోసం ఇరు కంపెనీలు సుమారు రూ. 44 కోట్ల పెట్టుబడిని వెచ్చించాయి. ఈ సదుపాయం ప్రతి నెలా 2,000 వాహనాలను స్క్రాప్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఒక వాహనాన్ని స్క్రాప్ చేయడానికి సుమారు మూడు గంటల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

మారుతి సుజుకి టొయోట్సు వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, "దేశంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి స్క్రాపేజ్ విధానం కీలకమైన అంశాలలో ఒకటి. పాత కార్లు కొత్త వాటి కంటే చాలా ఎక్కువ కాలుష్యం కలిగిస్తాయి, కాబట్టి వాటిని దశలవారీగా తొలగించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, ఈ స్క్రాపేజ్ విధానం కారణంగా కొత్త వాహనాల అమ్మకాలు కూడా 10-12 శాతం పెరుగుతాయని మేము భావిస్తున్నాము" అని అన్నారు.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

భారత రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాలు సమాజానికి పెద్ద సమస్యగా మారుతున్నాయని, వీటి వలన వాహన కాలుష్యం కూడా తీవ్రస్థాయిలో పెరుగుతోందని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పడాలంటే, ఈ పాత వాహనాలను స్క్రాప్ చేయడం చాలా అవసరమని, దీని వలన అన్ని రకాల ముడి పదార్థాలను తక్కువ ధరకు పొందుతామని, ఫలితంగా ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని గడ్కరీ అన్నారు.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం కొన్ని వాహనాల రీసైక్లింగ్ లేదా స్క్రాపింగ్ కేంద్రాలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ చర్య వలన పాత కార్లను రద్దు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయడమే కాకుండా మరింత మందికి ఉపాధిని కూడా సృష్టిస్తుందని, ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని మరియు వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రి చెప్పారు.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

భారతదేశంలోని రోడ్లపై సురక్షితమైన వాహనాలు మాత్రమే నడిచేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే, జాతీయ వాహన స్క్రాపేజ్ విధానాన్ని ( National Automobile Scrappage Policy) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జాతీయ వాహన స్క్రాపేజ్ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (23వ సవరణ) రూల్స్, 2021 అని పిలవబడే వాహన స్క్రాపేజ్ పాలసీ నియమాలు ఏప్రిల్ 1, 2022 వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

దేశంలో పాత మరియు ఫిట్‌నెస్ లేని వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానం ప్రకారం, వ్యక్తిగత వాహనాలకు 20 సంవత్సరాల తర్వాత మరియు వాణిజ్య వాహనాలు 15 సంవత్సరాల తర్వాత ఆటోమేటెడ్ సెంటర్‌లలో ఫిట్‌నెస్ పరీక్షలను చేయించడం తప్పనిసరి. ఇలాంటి పాత వాహనాలను స్క్రాప్ చేయాలని సదరు వాహన యజమానులు నిర్ణయించుకుంటే, కొత్త వాహనం కొనుగోలుపై 5 శాతం ఇన్సెంటివ్‌ను అందజేయడం జరుగుతుంది.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

అలాకాకుండా, ఒకవేళ ఎవరైనా ఈ నిర్ధిష్ట కాలపరిమితి దాటిన (15 ఏళ్లు, 20 ఏళ్లకు పైబడిన) తర్వాత కూడా సదరు పాత వాహనాలను ఉపయోగించాలని చూస్తుంటే, ఈ కొత్త వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద, కేంద్ర ప్రభుత్వం పాత వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ మరియు ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను భారీగా పెంచనుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ 1, 2022 వ తేదీ నుండి, 15/20 సంవత్సరాల కంటే పాతబడిన వాహనాల రీ-రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజు ప్రస్తుత ఫీజు కన్నా సుమారు 8 రెట్లు ఎక్కువగా ఉండే అవకాసం ఉంది.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

ఈ కొత్త రేట్లు వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి అమలులోకి రానున్నాయి. ఇకపై 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కారు కోసం రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం రూ. 5,000 మరియు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 300 కి బదులుగా, రూ. 1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ రుసుము సుమారు రూ. 10,000 నుండి రూ. 12,500 వరకూ ఉంటుంది.

వెహికల్ స్క్రాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి, ఎక్కడో తెలుసా?

ఇకపోతే, విదేశాల నుండి దిగుమతి చేసుకునే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రూ. 10,000 వరకూ మరియు నాలుగు చక్రాల వాహనాల కోసం రెన్యువల్ ఫీజు రూ. 40,000 వరకూ ఖర్చు అవుతుంది. ఒకవేళ, వాహన యజమాని తమ పాత వాహనాలను సకాలంలో నమోదు చేయకపోయినా లేదా రిజిస్ట్రేషన్ రెన్యువల్ విషయంలో జాప్యం చేసినా, ప్రతిరోజు రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల పునరుద్ధరణకు దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయితే, ప్రతి నెలా ఆలస్యం అయినందుకు ప్రైవేట్ వాహన యజమాని నుండి రూ. 300 మరియు వాణిజ్య వాహన యజమాని నుండి రూ. 500 వసూలు చేయడం జరుగుతుంది.

Most Read Articles

English summary
Maruti suzuki vehicle scrapping plant inaugurated in noida by nitin gadkari details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X