మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

ప్రస్తుతం కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు కేవలం చవక ధరకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆ కారులో లభించే ఫీచర్ల జాబితాపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మనదేశంలో, ఇటీవలి కాలంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలు బాగా ప్రాచుర్యం పొందాయి. మార్కెట్లో లభిస్తున్న అనేక కాంపాక్ట్ ఎస్‌యూవీలలోని టాప్-ఎండ్ వేరియంట్లలో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

అయితే, ఈ విభాగంలో లభిస్తున్న మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (Maruti Suzuki Vitara Brezza) లో మాత్రం అంత గొప్ప ఫీచర్లేమీ లేవు. అయినప్పటికీ, ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఈ విభాగంలో అమ్ముడవుతున్న ఇతర మోడళ్లలో లభిస్తున్న ఫీచర్లతో పోలిస్తే, విటారా బ్రెజ్జా చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా చాలాకాలంగా సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని మోడల్‌గా ఉంది. అయితే, ఈ విభాగంలోకి కొత్తగా వచ్చిన టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనో కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లతో విటారా బ్రెజ్జా గట్టి పోటీని ఎదుర్కుంటోంది. నిజానికి పైన మోడళ్లలో కొన్ని సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. కానీ, బ్రెజ్జాలో మాత్రం అలాంటి ఫీచర్లు చూద్దామన్నా కనిపించవు.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

మరి ఈ సెగ్మెంట్లోని పోటీదారులతో పోలిస్తే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో లభించని ఆ కీలకమైన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేకపోవటం..

భారతదేశంలో కఠినమైన బిఎస్6 ఉద్గార నిబంధలను ప్రవేశపెట్టిన తర్వాత, మారుతి సుజుకి అసలు డీజిల్ కార్లను తయారు చేయడమే నిలిపివేసింది. మొదట్లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా డీజిల్ ఇంజన్‌తో లభించేంది. అప్పట్లో ఇదే ఆ మోడల్‌కి అతిపెద్ద ప్రయోజనం. అయితే, ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను నిలిపివేయడంతో, ఇప్పుడు ఇది కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతోంది.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

ప్రస్తుతం, ఈ సెగ్మెంట్లో లభిస్తున్న హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు కియా సోనెట్ వంటి మోడళ్లు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తున్నాయి. ఫలితంగా, వీటిలో కస్టమర్లు ఎంచుకునేందుకు ఎక్కువ వేరియంట్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ, విటారా బ్రెజ్జా విషయంలో ఈ సౌకర్యం లేదు. కాబట్టి, ఇది ఎక్కువ మైలేజ్ ను కోరుకునే డీజిల్ కస్టమర్లను కోల్పోతుంది. ఒకవేళ, భవిష్యత్తులో కంపెనీ ఇందులో డీజిల్ ఇంజన్ ను కూడా ప్రవేశపెట్టినట్లయితే, బ్రెజ్జా అమ్మకాలను ఎవ్వరూ ఆపలేరు.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

కేవలం 2 ఎయిర్‌బ్యాగులు మాత్రమే ఉన్నాయి..

ఈ రోజుల్లో కస్టమర్లు కారు యొక్క ధర, మైలేజ్ కంటే ఎక్కువగా ఆ కారులో లభించే సేఫ్టీ ఫీచర్లకు మరియు అది అందించే భద్రతకు ఎక్కువగా ప్రధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మారుతి సుజుకి తమ విటారా బ్రెజ్జాలో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్ లను (డ్రైవర్, కో-డ్రైవర్) మాత్రమే అందిస్తోంది. టాప్-ఎండ్ వేరియంట్లో కూడా కంపెనీ సైడ్ లేదా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ లను అందించడం లేదు.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

అయితే, ఈ విభాగంలో లభిస్తున్న హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సోనెట్ వంటి కార్లు మాత్రం 6 ఎయిర్‌బ్యాగ్ లతో లభిస్తున్నాయి. వీటిలో రెండు ఫ్రంట్, రెండు సైడ్ మరియు రెండు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఈ ఎయిర్‌బ్యాగ్స్ ప్రయాణీకులకు అన్ని వైపుల నుండి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి, మారుతి సుజుకి తమ విటారా బ్రెజ్జాలో కూడా కనీసం 4 నుండి 6 ఎయిర్‌బ్యాగ్ లను అందిస్తే బాగుండేది.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESC) ఫీచర్ లేకపోవడం..

ప్రస్తుతం కార్లలో లభిస్తున్న యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఆధునిక ఫీచర్ల మాదిరిగానే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESC)అనేది వాహనంలో ఓ కీలకమైన సేఫ్టీ ఫీచర్. ఈ ఫీచర్‌ను ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) లేదా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC) అని కూడా పిలుస్తారు.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESC) సేఫ్టీ ఫీచర్ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే, వాహనం రోడ్డుపై పటుత్వాన్ని (ట్రాక్షన్)ని కోల్పోయినప్పుడు, కారులోని సెన్సార్లు ఆ విషయాన్ని గుర్తించి, ఆటోమేటిక్‌గా బ్రేక్ లను అప్లయ్ చేయటం లేదా కారు వేగాన్ని తగ్గించడం ద్వారా వాహనం యొక్క స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి ఇవి సహాయపడతాయి.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

దురృష్టవశాత్తు మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో ఇలాంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్ లభించడం లేదు. అయితే, ఈ విభాగంలో అమ్ముడవుతున్న కియా సోనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూ కార్లలో మాత్రం ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESC) సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉంది. రోడ్డుపై ఆకస్మికంగా బ్రేక్ వేసినప్పుడు లేదా టైర్ గ్రిప్ కోల్పోయినప్పుడు ఈ ఫీచర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

యాంత్రికంగా సర్దుబాటు చేసే సీట్లు లేకపోవడం..

సౌకర్యవంతమైన డ్రైవ్ కోసం అంతే సౌకర్యవంతమైన సీట్లు కూడా అవసరం. కారులో డ్రైవింగ్ పొజిషన్ అనేది చాలా ముఖ్యం. అందుకే, మోడ్రన్ కార్లు యాంత్రికంగా డ్రైవర్ సీట్లను పలు రకాలుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యంతో వస్తున్నాయి. కానీ విటారా బ్రెజ్జా ఫ్రంట్ సీట్లలో మాత్రం ఈ సౌలభ్యం లేదు. విటారా బ్రెజ్జాలోని డ్రైవర్ సీటును మ్యాన్యువల్ గా మాత్రమే సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

360 డిగ్రీ కెమెరా లేకపోవడం.

ఇటీవలి కాలంలో వస్తున్న చిన్న కార్లలో సైతం కంపెనీలు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు 360 డిగ్రీ కెమెరాలు వంటి సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ నిజానికి ఈ సేఫ్టీ ఫీచర్లు రద్దీ ఎక్కువగా ఉండే భారత రోడ్లపై డ్రైవర్‌కు అత్యంత సహాయకారిగా ఉంటాయి.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

మారుతి బ్రెజ్జాలో వంటి పొడవైన మరియు వెడల్పయిన వాహనలో కేవలం రియర్ కెమెరా (రివర్స్ పార్కింగ్ కెమెరా) ఫీచర్ మాత్రమే లభిస్తుంది. ఈ విభాగంలో, బ్రెజ్జా పోటీదారు అయిన నిస్సాన్ మాగ్నెట్ లో కంపెనీ 360-డిగ్రీ సరౌండ్ కెమెరా ఫీచర్ ను అందిస్తోంది. మారుతి సుజుకి కూడా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఈ ఫీచర్ జోడించినట్లయితే, ఇది డ్రైవర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

సన్‌రూఫ్ ఫీచర్ లేకపోవడం..

ప్రస్తుతం, కార్లలో సన్‌రూఫ్ అనేది ఓ ముఖ్యమైన ఫీచర్ గా మారిపోయింది. ఒకప్పుడు ఖరీదైన కార్లలో మాత్రమే లభించే ఈ ఫీచర్ ఇప్పుడు రూ. 10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో కూడా అందుబాటులో ఉంటోంది. నిజానికి సన్‌రూఫ్ ఎలాంటి కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్ కాకపోయినప్పటికీ, కస్టమర్లు ఈ ఫీచర్ పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

సన్‌రూఫ్ అనేది సాధారణ కారును ఓ కన్వర్టిబల్ కారులా మార్చిన అనుభూతిని అందిస్తుంది. కస్టమర్లు దాదాపు రూ. 8 లక్షల చెల్లిస్తున్న విటారా బ్రెజ్జాలో కూడా ఇలాంటి సన్‌రూఫ్ ఫీచర్ లేకపోవడం చాలా బాధాకరం. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వాహనం మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి, ఇందులో ప్రజలు కోరుకునే ముఖ్యమైన ఫీచర్లలో ఇది కూడా ఒకటి.

మారుతి సుజుకి Vitara Brezza లో ఈ ఫీచర్లు ఉంటే ఎంత బాగున్నో..!

ఇదండీ.. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పరిస్థితి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా, ఈ సెగ్మెంట్లోని ఇతర పోటీదారులు అందిస్తున్న ఫీచర్లతో పోల్చుకుంటే, విటారా బ్రెజ్జాలో లభించే ఫీచర్లు చాలా అల్పంగా అనిపిస్తాయి. మరి, భవిష్యత్తులోనైనా మారుతి సుజుకి తమ కొత్త కార్లలో ఇలాంటి ఫీచర్లను అందిస్తుందో లేదో వేచి చూడాలి. మీరేమంటారు?

Most Read Articles

English summary
Maruti suzuki vitara brezza misses these top features in the segment
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X