ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

ఈ ఫొటోలలో కనిపిస్తున్న ఎలక్ట్రిక్ కారును చూశారా? దీని పేరు 'మార్వెల్ ఆర్' (Marvel R). ఎమ్‌జి మోటార్ (MG Motor) కంపెనీ గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న మార్వెల్ ఎక్స్ (Marvel X) నుండి ప్రేరణ పొంది ఈ మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం, ఈ మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ కారును చైనా మార్కెట్లో ఎమ్‌జి మోటార్ యొక్క సబ్ బ్రాండ్ అయిన రోవే (Roewe) ద్వారా విక్రయిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎమ్‌జి మోటార్ ఈ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

ఎమ్‌జి మోటార్ ఇండియా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన కొంత ఆసక్తికర సమాచారం వెల్లడైంది. ఈ కారుకు ఇటీవల యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ క్రాష్ టెస్టులో రోవే మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఓవరాల్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ కారు చాలా సురక్షితమైన వాహనం అని యూరో ఎన్‌క్యాప్ అధ్యయనం వెల్లడించింది.

ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

యూరో ఎన్‌క్యాప్ (Euro NCAP) క్రాష్ టెస్టులో మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రయాణీకుల కంపార్ట్‌మెంట్ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ పరీక్షలో స్థిరంగా ఉన్నట్లు గుర్తించబడింది. ఇది డ్రైవర్ మరియు ప్రయాణీకుల మోకాళ్లు మరియు తొడ ఎముకలకు మంచి రక్షణను కనబరిచింది. అయితే, డ్యాష్‌బోర్డ్‌లోని నిర్మాణాలు వేర్వేరు పరిమాణాల్లో ఉండేవారికి మరియు వేర్వేరు స్థానాల్లో కూర్చున్న వారికి గాయం అయ్యే ప్రమాదం ఉందని భావించారు మరియు ఈ శరీర ప్రాంతం యొక్క రక్షణ అంతంతమాత్రంగానే రేట్ చేయబడింది.

ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

ఛాతీ కుదింపు రీడింగ్‌ల ఆధారంగా డ్రైవర్ ఛాతీకి రక్షణ కూడా మార్జినల్‌గా రేట్ చేయబడింది. ఈ పరీక్షలో ముందు వైపు ప్రయాణీకుల స్థానంలో ఉంచిన డమ్మీ బొమ్మల ఛాతీ భాగంలో స్వల్ప గాయాలు అయినట్లు గుర్తించారు. ఈ క్రాష్ పరీక్షలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ముందు వైపు లోపలి ప్రయాణీకులకు తగిన రక్షణను అందించినట్లు గుర్తించారు. దాని డ్యాష్‌బోర్డ్ డిజైన్ ముందు ప్రయాణీకులకు హాని కలిగిస్తుందని కనుగొనబడిన కారణంగా, దీనికి పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించలేదు.

ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ చివరి 5వ స్టార్‌ను కోల్పోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ కారు సైడ్ నుండి ఢీకొన్న సందర్భంలో తగిన లేదా మంచి రక్షణను అందించింది. అయినప్పటికీ, తుంటి ప్రాంతం మాత్రం కొద్దిగా ప్రభావితమవుతుందని గుర్తించారు. ముందు వైపు నుండి ఢీకొన్న సందర్భంలో మార్వెల్ ఆర్ మధ్యస్తంగా దెబ్బతింటుందని కూడా పరీక్షలో తేలింది. పూర్తి వెడల్పు దృఢమైన అవరోధ పరీక్షలో, వెనుక ప్రయాణీకుడి పెల్విస్ మినహా అన్ని క్లిష్టమైన శరీర ప్రాంతాల రక్షణ మంచిది లేదా సరిపోతుందని రేట్ చేయబడింది.

ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ కారులో చాలా స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సేవలను అప్రమత్తం చేయడానికి ఈ కారులో అధునాతన ఇకాల్(eCall) సిస్టమ్‌ ఉంటుంది, ఇది జరిగిన ప్రమాదాన్ని గుర్తించి అత్యవసర సేవలకు ఆటోమేటిక్ గా కాల్ చేస్తుంది. అలాగే, ఇందులో ద్వితీయ ప్రభావాలను నిరోధించడంలో సహాయపడే యాక్టివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4,674 మి.మీ పొడవును కలిగి ఉండి, మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశపెట్టబడింది. ఈ ఐదు సీట్ల ఎలక్ట్రిక్ కారులో మొత్తం మూడు ఎలక్ట్రిక్ మోటార్లు (ఫ్రంట్ యాక్సిల్ పై ఒకటి మరియు రియర్ యాక్సిల్ పై రెండు చొప్పున) ఉంటాయి. ఇవి మూడు కలిసి గరిష్టంగా 288 హార్స్ పవర్ ను మరియు 665 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తాయి. మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 70 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది డబ్ల్యూఎల్‌టిపి సర్టిఫై చేసిన దాని ప్రకారం, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిమీల కంటే ఎక్కువ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.

ప్రస్తుతం, లగ్జరీ రోవే బ్రాండ్‌లో ఉన్న కార్లను ఎమ్‌జి వాహనాలను రీబ్యాడ్జ్ చేసి ఎమ్‌జి మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయించవచ్చని సమాచారం. ఇటీవల మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ SAIC మోటార్ యొక్క అన్ని ఉత్పత్తులు ఇతర మార్కెట్‌లలో విడుదల చేయడానికి కార్ల తయారీదారులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఇండియాకి రానున్న ఈ MG ఎలక్ట్రిక్ కారు ఎంత సురక్షితమో తెలుసా? వీడియోలో చూడండి!

ఎమ్‌జి మార్వెల్ ఎక్స్ (MG Marvel X) గతేడాది భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఎమ్‌జి మోటార్ ప్రదర్శించిన విజన్ ఈ కాన్సెప్ట్ యొక్క ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్‌గా ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని ఈ మార్వెల్ ఆర్ ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది. డిసి ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఛార్జ్ చేస్తే కేవలం 40 నిమిషాల్లో జీరో నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 180 కి.మీగా ఉంటుంది.

Most Read Articles

English summary
Marvel r all eletric suv gets 4 star safety rating in euro ncap crash test
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X