అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

దేశీయ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన మహీంద్రా థార్ (Mahindra Thar) ఈ రోజుకి కూడా తన ఉనికి చాటుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ కారణంగానే ఇప్పటికి కూడా అధిక సంఖ్యంలో బుకింగ్స్ పొందుతూనే ఉంది. అంతే కాకూండా బుక్ చేసుకున్న చాలామంది కస్టమర్లు థార్ డెలివరీ కోసం వేచి చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మహీంద్రా థార్ ఏ స్థాయిలో ఆదరణ పొందుతుంది అనే విషయం అర్థమవుతుంది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

మహీంద్రా థార్ ఆఫ్ రోడింగ్ ప్రేమికులకు అనుకూలమైన వాహనం. ఇది భారత మార్కెట్లో గత సంవత్సరం విడుదలైంది. మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా విపరీతమైన డిమాండ్ పొందగలిగింది. అమ్మకాల విషయంలో అతి తక్కువ కాలంలోనే ఒక రికార్డ్ సృష్టించగలిగింది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

ఇదిలా ఉండగా ఇటీవల కస్టమైజేషన్ మహీంద్రా థార్ కి సంబంధించి ఫోటోలు కొన్ని వెలువడ్డాయి. ఇది చూడటానికి మరింత దూకుడుగా ఉంది. కస్టమైజేషన్ చేసిన ఈ మహీంద్రా థార్ భారతదేశంలో మొట్టమొదటి ర్యాలీ స్టైల్ క్యాబిన్ పొందిన థార్. అంతే కాకూండా ఇక్కడ ఉన్న ఫోటోలను గమనించినట్లయితే ఈ SUV వెనుక స్థలాన్ని ఖాళీ చేయడానికి వెనుక సీట్లు తీసివేయబడి ఉండటం చూడవచ్చు. స్టాక్ రోల్ బార్‌లు ఆఫ్టర్‌మార్కెట్ యూనిట్లచే భర్తీ చేయబడ్డాయి. ముందు సీట్లు కస్టమ్-బిల్ట్ క్యాబిన్‌లో ఉన్నాయి, వెనుకవైపు విండ్‌స్క్రీన్‌తో పూర్తి చేయబడింది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

వెనుక రోల్ కేజ్ పైభాగంలో, మెరుగైన ప్రకాశం కోసం LED లైట్స్ చేర్చబడ్డాయి. దీనితో పాటు ఈ SUV కొత్త జీప్-శైలి ఫ్రంట్ గ్రిల్, ఆఫ్టర్‌మార్కెట్ LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ బాష్ ప్లేట్‌తో కూడిన ఆఫ్‌రోడ్-స్పెక్ బంపర్‌ను కూడా పొందుతుంది. ఫ్రంట్ బంపర్‌కి రెండు టో హుక్స్ మరియు ఒక జత ఇంటిగ్రేటెడ్ LED ఫాగ్ లైట్లు కూడా ఉన్నాయి. అదనంగా, రాక్‌స్లైడర్‌లు కూడా SUVలో చేర్చబడ్డాయి. అదనంగా, వెనుక బంపర్‌పై అదనపు బ్రేక్ ల్యాంప్‌లు భద్రతను నిర్ధారించడానికి మెరుగైన అంతర్గత రక్షణను కూడా జోడించాయి.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

ఈ కస్టమైజ్డ్ మహీంద్రా థార్ చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది, ఇది పుష్కలంగా డైనమిక్ మోడ్‌లను కలిగి ఉంది. అయితే ఈ థార్ SUV యొక్క ఇంజిన్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. కావున ఇప్పటికే అందుబాటులో ఉన్న విధంగా ఈ SUV రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

గత ఏడాది అక్టోబర్‌లో కొత్త ఫీచర్లతో థార్ ఎస్‌యూవీని విడుదల చేసిన మహీంద్రా ఇప్పటివరకు 75,000 బుకింగ్‌లను పొందింది. దీన్ని బట్టి చూస్తే సగటున 200 నుండి 250 మంది కస్టమర్లు కొత్త కారు కొనుగోలు చేయడానికి బుక్ చేస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

కొత్త మహీంద్రా థార్ మరింత శక్తివంతమైనది మరియు మెరుగైనది. అంతే కాకుండా ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి, కావున కొత్త మహీంద్రా థార్ గ్లోబల్ NCAP టెస్ట్ లో సేఫ్టీలో ఏకంగా 4-స్టార్ రేటింగ్ పొందగలిగింది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

మహీంద్రా థార్ ఇప్పుడు మునుపటి కంటే కూడా చాలా సురక్షితమైనదిగా నిర్దారించబడింది. థార్ SUV అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ISOFIX మౌంట్‌లతో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను పొందుతుంది.

అద్భుతంగా ఉన్న కస్టమైజ్ Mahindra Thar.. మీరూ ఓ లుక్కేసుకోండి

Mahindra కంపెనీ తన కొత్త థార్ SUV ని 2020 అక్టోబర్ 2 న భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ SUV ని ప్రారంభించినప్పుడు, AX వేరియంట్ మరియు LX వేరియంట్ల ధరలు వరుసగా రూ. 9.8 లక్షలు మరియు రూ .12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
Meet the mahindra thar suv customized with rally style cabin details
Story first published: Tuesday, November 16, 2021, 18:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X